ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత‑మారిషస్: వర్చువల్ ‌ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 29 FEB 2024 3:06PM by PIB Hyderabad

గౌరవనీయులు ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ గారికి,

మారిషస్‌ మంత్రివర్గ సభ్యులకు,

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ గారికి,

నేటి కార్యక్రమానికి హాజరైన అగలేగా నివాసితులకు,

నా స్నేహితులందరికీ నమస్కారం!

గత ఆరు నెలల్లో మారిషస్‌ ప్రధాని జుగ్నాథ్నేను సమావేశమవ్వడం ఇది అయిదోసారిభారత్‌మారిషస్ మధ్య ఉన్న శక్తిమంతమైనబలమైనప్రత్యేకమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనంపొరుగు దేశాల ప్రాధాన్యతలో మారిషస్‌ మా ముఖ్య భాగస్వామిగా ఉందిఅలాగే ‘సాగర్’ దృష్టికోణంలో మారిషస్ మా ప్రత్యేక భాగస్వామిగ్లోబల్ సౌత్ సభ్యులుగా మాకు ఉమ్మడి ప్రాధాన్యతలున్నాయిగత 10 సంవత్సరాల్లో మా సంబంధాల్లో అపూర్వమైన వేగం కనిపించిందిపరస్పర సహకారంతో కొత్త శిఖరాలను చేరుకున్నాంసాంస్కృతికచారిత్రక సంబంధాలు కొత్త రూపం దాల్చాయిభాషసంస్కృతులు ప్రజల్ని కలిపి ఉంచాయికొన్ని రోజుల కిందటే యూపీఐరూపే కార్డు వంటి ప్రయత్నాల ద్వారా ఆధునిక డిజిటల్‌ అనుసంధానాన్ని అందించాం.

మిత్రులారా,

మా వ్యూహాత్మక సంబంధాల్లో అభివృద్ధి భాగస్వామ్యం ఒక ముఖ్యమైన స్తంభంగా నిలిచిందిఈ భాగస్వామ్యం మారిషస్  ప్రాధాన్యతల ఆధారంగా నిర్మితమై ఉందిభద్రతా అవసరాలు అయినాఆరోగ్య భద్రత అయినాభారత్‌ ఎప్పుడూ మారిషస్ అవసరాలను గౌరవంగా వచ్చిందికోవిడ్ మహమ్మారి సంక్షోభం అయినాచమురు లీకేజీ ప్రమాదం అయినాభారత్‌ తన మిత్రుడు మారిషస్‌కు మొదట స్పందించే దేశంగా నిలిచిందిమారిషస్‌లోని సాధారణ ప్రజల జీవితాల్లో సార్థకమైన మార్పులను తీసుకురావడమే మా ప్రయత్నాల ప్రధాన లక్ష్యం.

గత 10 సంవత్సరాల్లో సుమారు 1000 మిలియన్ డాలర్ల రుణ సౌకర్యం,  400 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం మారిషస్ ప్రజలకు అందించాంమెట్రో లైన్లు అభివృద్ధిసమాజాభివృద్ధి ప్రాజెక్టులుసామాజిక గృహ నిర్మాణంచెవి,ముక్కుకంటి ఆసుపత్రులుసివిల్ సర్వీస్ కళాశాలలు,  క్రీడా సముదాయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం నాకు లభించిందిఈ భాగస్వామ్యం భారత్‌మారిషస్ మధ్య ఉన్న స్నేహబంధాన్నిసహకార శక్తిని ప్రతిబింబిస్తుంది.

మిత్రులారా,

మా అభివృద్ధి భాగస్వామ్యానికి నేడు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు. 2015లో అగలేగా ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీ నేడు పూర్తవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిఈ మధ్యకాలంలో భారత్‌లో దీన్ని ‘‘మోదీ హామీ’’అని పిలుస్తున్నారుమేం కలిసి ప్రారంభించిన ఈ సదుపాయాలు ప్రజల జీవన విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉందిమారిషస్ ఉత్తరదక్షిణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరుగుతుందిముఖ్య భూభాగం నుంచి పరిపాలనా సహకారం మరింత సులభమవుతుందిసామాజికఆర్థిక అభివృద్ధికి బలమైన తోడ్పాటు లభిస్తుందిఅ సదుపాయాలు వైద్య చికిత్స అవసరమైన అత్యవసర పరిస్థితులలో రవాణావిద్యార్థుల ప్రయాణం మెరగవుతుంది.

మిత్రులారా,

ఈ మధ్య కాలంలో భారత మహాసముద్ర ప్రాంతంలో అనేక సంప్రదాయసాంప్రదాయేతర సవాళ్లు తలెత్తుతున్నాయిఈ సవాళ్లన్నీ మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయివీటిని ఎదుర్కొనేందుకు భారత్‌మారిషస్ సముద్ర భద్రతా రంగంలో సహజ భాగస్వాములుగా ఉన్నాయిభారత మహాసముద్ర ప్రాంతంలో భద్రతఅభివృద్ధిస్థిరత్వాన్ని సాధించేందుకు మేం ఇద్దరం కలిసికట్టుగా పని చేస్తున్నాంప్రత్యేక ఆర్థిక ప్రాంతాల పర్యవేక్షణఉమ్మడి గస్తీహైడ్రోగ్రఫీమానవతా సాయం,  విపత్తు సహాయ చర్యలు వంటి అన్ని రంగాలలో మేము పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాంనేడు ఆగలేగా ద్వీపంలో జరిగిన ఎయిర్‌స్ట్రిప్జెట్టీ ప్రారంభోత్సవం మా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళుతుందిఇది మారిషస్‌లో సముద్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

మారిషస్‌లో జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నానుజన్ ఔషధి కార్యక్రమంలో చేరిన తొలి దేశంగా మరిషస్ నిలవడం గర్వకారణందీని ద్వారా భారత్‌లో తయారైన ఉన్నత నాణ్యత గల జనరిక్ ఔషధాల ప్రయోజనాలు మారిషస్ ప్రజలకు లభించనున్నాయి.

గౌరవనీయులు,

ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్‌ దూరదృష్టిగొప్ప నాయకత్వానికి అభినందనలురాబోయే కాలంలో మనం కలసి పనిచేసి మారిషస్భారత్‌ మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామనే నమ్మకం నాకు ఉంది.

మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!

 

***


(Release ID: 2170111) Visitor Counter : 8