ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 22 SEP 2025 3:28PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జై!

జై హింద్జై హింద్జై హింద్!

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీపర్నాయక్ గారుప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారుకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారురాష్ట్ర ప్రభుత్వ మంత్రులునా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారుతపిర్ గావ్ గారుఅందరు ఎమ్మెల్యేలుఇతర ప్రజా ప్రతినిధులుఅరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,

బోమ్యెరుంగ్ డోనీ పోలోసర్వశక్తిమంతుడైన డోనీ పోలో మనందరినీ ఆశీర్వదిస్తారు!

మిత్రులారా,

హెలిప్యాడ్ నుంచి ఈ మైదానానికి వచ్చే మార్గంలో త్రివర్ణ పతాకంతో స్వాగతిస్తున్న పిల్లలనుమువ్వన్నెల జెండా చేతపట్టుకుని నిలుచున్న ఎంతోమంది బిడ్డలనూ నేను కలిశానుఅరుణాచల్ మర్యాదఆప్యాయతలు నాకు గొప్ప అనుభూతినిచ్చాయిఇక్కడి స్వాగతం చాలా గొప్పగా ఉంది.. అది నా రాకనూ ఆలస్యం చేసింది.. దాని కోసం నేను క్షమాపణ కోరుతున్నానుఈ పవిత్రమైన అరుణాచల్ భూమి ఉదయించే సూర్యుని భూమి మాత్రమే కాదు.. దేశభక్తి శిఖరాగ్రానికి చేరుకునే భూమి కూడామన త్రివర్ణ పతాక మొదటి రంగు కాషాయం లాగే అరుణాచల్ ప్రధాన రంగు కాషాయమేఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి శౌర్యానికీ.. సరళతకు చిహ్నంనేను క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు కూడా చాలాసార్లు అరుణాచల్‌కు వచ్చానునేను ఇక్కడి నుంచి లెక్కలేనన్ని జ్ఞాపకాలను తీసుకువెళుతూనే ఉన్నానువాటిని గుర్తు చేసుకోవడం ఎల్లప్పుడూ నన్ను ఆనందంతో నింపుతుందిమీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక విలువైన జ్ఞాపకంమీరు నాపై కురిపించే ప్రేమఆప్యాయతలు జీవితంలో ఒకరు పొందగల గొప్ప అదృష్టంగా నేను నమ్ముతున్నానుతవాంగ్ మఠం నుంచి నామ్సాయ్ గోల్డెన్ పగోడా వరకు అరుణాచల్ ప్రాంతం శాంతిసంస్కృతిల సంగమంఇది భరతమాతకు గర్వకారణం.. నేను ఈ పవిత్ర భూమికి భక్తితో నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నా అరుణాచల్ పర్యటన మూడు కారణాల వల్ల చాలా ప్రత్యేకమైనదిమొదటిదినవరాత్రి మొదటి రోజున ఈ అందమైన పర్వతాలను చూసే అదృష్టం నాకు లభించిందిఈ నవరాత్రి తొలి రోజున మనం హిమవంతుడి కుమార్తె అయిన మాతా శైలపుత్రిని పూజిస్తాంరెండో కారణంనేటి నుంచి దేశవ్యాప్తంగా తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయిఈ రోజే "జీఎస్టీ పొదుపు పండగప్రారంభమవుతోందిఈ పండగ సీజన్‌లో దేశ ప్రజలు రెట్టింపు ఆనందాన్ని పొందారుమూడో కారణంఈ శుభ దినాన అరుణాచల్‌కు అనేక కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు అందుతున్నాయినేడు అరుణాచల్‌కు విద్యుత్కనెక్టివిటీపర్యాటకంఆరోగ్యం సహా బహుళ రంగాల ప్రాజెక్టులు కానుకగా లభించాయిఇది బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ "డబుల్ బెనిఫిట్"కి ఒక గొప్ప ఉదాహరణఈ ప్రాజెక్టుల కోసం నేను అరుణాచల్ ప్రజలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానునేను ఇక్కడికి రాకముందు చిన్న వ్యాపారులను కలవడానికివారి దుకాణాల్లో ఉత్పత్తులను చూడటానికిమరింత ముఖ్యంగా వారి శక్తినీఉత్సాహాన్నీ చూసే అవకాశం నాకు లభించిందివ్యాపారులుచేతివృత్తులవారుప్రజల్లో ఈ పొదుపు పండగ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.

మిత్రులారా,

సూర్యుని మొదటి కిరణాలు అరుణాచల్ నేలపై పడినప్పటికీ.. వేగవంతమైన అభివృద్ధి కిరణాలు ఇక్కడికి చేరుకోవడానికి అనేక దశాబ్దాలు పట్టింది. 2014కి ముందు కూడా నేను చాలాసార్లు అరుణాచల్‌ను సందర్శించానుమీ మధ్యే నివసించానుప్రకృతి ఇక్కడి భూమికికష్టపడి పనిచేసే ప్రజలకు ఇచ్చిన ఔదార్యాన్నీఅపారమైన సామర్థ్యాన్నీ ప్రత్యక్షంగా చూశానుఅప్పుడు ఢిల్లీలో కూర్చుని దేశాన్ని పరిపాలించిన వారు అరుణాచల్‌ను విస్మరించారుఇక్కడ చాలా తక్కువ మంది నివసిస్తున్నారు.. కేవలం రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే ఉన్నాయి.. అప్పుడు అరుణాచల్‌పై దృష్టి పెట్టడం ఎందుకని కాంగ్రెస్ వంటి పార్టీలు భావించాయిఇటువంటి కాంగ్రెస్ మనస్తత్వం అరుణాచల్‌కుమొత్తం ఈశాన్య ప్రాంతానికీ చాలా హాని చేసిందిదీంతో మన ఈశాన్య ప్రాంతం మొత్తం అభివృద్ధిలో చాలా వెనుకబడింది.

మిత్రులారా,

మీరు 2014లో దేశానికి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినప్పుడు.. నేను దేశాన్ని ఈ కాంగ్రెస్ మనస్తత్వం నుంచి విముక్తి చేయాలని నిశ్చయించుకున్నానుఒక రాష్ట్రంలో ఓట్ల సంఖ్య.. సీట్ల సంఖ్య మాకు స్ఫూర్తి కాదుదేశానికే తొలి ప్రాధాన్యం.. మా మార్గదర్శక సూత్రంనాగరిక్ దేవో భవ... మా పాలన మంత్రంఎవరూ పట్టించుకోని వారిని మోదీ గౌరవిస్తారుఅందుకే కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంతం 2014 నుంచి మా అభివృద్ధి ప్రాధాన్యాలకు కేంద్రంగా మారిందిఈశాన్య ప్రాంత బడ్జెట్‌ను మేం చాలా రెట్లు పెంచాంమూరుమూల ప్రాంతాలకు కనెక్టివిటీసేవలను అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాంఇది మాత్రమే కాదు.. కేవలం ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వం నడపకుండా.. అధికారులుమంత్రులు తరచూ ఈశాన్య ప్రాంతంలో పర్యటిస్తూ.. రాత్రిపూట ఇక్కడే బస చేస్తూ.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నాం.

మిత్రులారా,

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక కేంద్ర మంత్రి రెండు-మూడు నెలలకోసారి ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించేవారుబీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఈశాన్య ప్రాంతానికి ఇప్పటికే 800 కంటే ఎక్కువసార్లు పర్యటించారుఏదో నామమాత్రంగా పర్యటించి వెళ్లిపోవడం కాదుమన మంత్రులు వచ్చినప్పుడు వారు మారుమూల ప్రాంతాలకుజిల్లాలకుమండలాలకు వెళుతున్నారుకనీసం ఒక రాత్రి ఇక్కడ బస చేస్తున్నారునేను ప్రధానమంత్రిగా 70 సార్లు ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించానుగత వారం నేను మిజోరంమణిపూర్అస్సాం రాష్ట్రాలకు వెళ్లానునేను గౌహతిలో రాత్రి బస చేసానుఈశాన్య ప్రాంతం నా హృదయానికి చాలా దగ్గరగా ఉందిఅందుకే మేం ఈ హృదయ దూరాన్ని తొలగించి.. ఢిల్లీని మీ దగ్గరకు తీసుకువచ్చాం.

మిత్రులారా,

ఈశాన్యంలోని ఎనిమిది రాష్ట్రాలను మేం 'అష్ట లక్ష్ములు’గా గౌరవిస్తాంఅందుకే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడటానికి మేం ఎప్పటికీ అనుమతించలేంఈ ప్రాంత వృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోందినేను మీకు ఒక ఉదాహరణ ఇస్తానుకేంద్రం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని రాష్ట్రాలతో పంచుకుంటుందని మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చుకాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర పన్నుల నుంచి అరుణాచల్ ప్రదేశ్ పదేళ్లలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు మాత్రమే పొందిందికానీ ఇప్పుడు కేంద్రంలోని మన బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ పదేళ్లలో అరుణాచల్ లక్ష కోట్ల రూపాయలకు పైగా అందుకుందిఅంటే బీజేపీ ప్రభుత్వం అరుణాచల్‌కు 16 రెట్లు ఎక్కువ డబ్బును ఇచ్చిందిఇది పన్ను వాటా మాత్రమేఅంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల్లోనూ పెట్టుబడులు పెడుతోందిఇక్కడ ప్రధాన ప్రాజెక్టులను అమలు చేస్తోందిఅందుకే ఈ రోజు మీరు అరుణాచల్ అంతటా ఇంత విస్తృతమైనవేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నారు.

మిత్రులారా,

సరైన ఉద్దేశంతో పని జరిగినప్పుడునిజాయితీతో ప్రయత్నాలు జరిగినప్పుడు ఫలితాలు కచ్చితంగా కనిపిస్తాయిమన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారుతోందిఇక్కడ ప్రధానంగా సుపరిపాలనపై దృష్టి ఉందిమా ప్రభుత్వానికి పౌరుల సంక్షేమం కంటే మరేదీ ముఖ్యం కాదుమీ జీవితాలను సులభతరం చేయడానికిమీ జీవన సౌలభ్యానికీ మేం కృషి చేస్తున్నాంప్రయాణంలో మీ ఇబ్బందులు తొలగిస్తూ ప్రయాణ సౌలభ్యాన్ని అందించాంఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికివైద్య చికిత్సను సులభతరం చేస్తున్నాంపిల్లలకు చదువుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యా సౌలభ్యాన్ని అందించాంమీ వ్యాపారవాణిజ్యాలకు మద్దతు కోసం వ్యాపార సౌలభ్యాన్ని అందించాంఈ లక్ష్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందిగతంలో రహదారి గురించిన ఆలోచనే అసాధ్యం అనిపించిన ప్రాంతాల్లో నేడు ఆధునిక రహదారులు నిర్మితమవుతున్నాయిసెలా టన్నెల్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఒకప్పుడు ఊహించలేనివి.. కానీ నేడు సెలా టన్నెల్ అరుణాచల్ గుర్తింపు కోసం ప్రధాన చిహ్నంగా మారింది.

మిత్రులారా,

అరుణాచల్‌ సహా ఈశాన్యంలోని మారుమూల ప్రాంతాల్లో హెలిపోర్ట్‌లను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందిఅందుకే ఈ ప్రాంతాలను ఉడాన్ పథకం ద్వారా అనుసంధానించాంహోలోంగి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం కూడా పూర్తయిందిఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానాలున్నాయిఇది సాధారణ ప్రయాణికులువిద్యార్థులుపర్యాటకులకు మాత్రమే కాకుండారైతులకుచిన్న పరిశ్రమలకూ ప్రయోజనం చేకూరుస్తుందిఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన మార్కెట్లకు పండ్లుకూరగాయలుఇతర ఉత్పత్తులను రవాణా చేయడం ఇప్పుడు చాలా సులభమైంది.

మిత్రులారా,

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో మనమంతా పనిచేస్తున్నాందేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుందిప్రతి రాష్ట్రం జాతీయ లక్ష్యాలతో భుజం కలిపి నడిచినప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుందిఈ జాతీయ లక్ష్యాలను సాధించడంలో ఈశాన్య ప్రాంతం ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందివిద్యుత్ రంగం దీనికి చక్కటి ఉదాహరణ. 2030 నాటికి సాంప్రదాయేతర వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం భారత్ లక్ష్యంసౌర విద్యుత్పవన విద్యుత్జల విద్యుత్ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నాంఅరుణాచల్ ప్రదేశ్ కూడా దేశంతో పాటు ముందడుగు వేస్తోందిఈ రోజు ప్రారంభించిన రెండు విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తిదారుగా అరుణాచల్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయిఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయిఇక్కడ అభివృద్ధి పనుల కోసం సరసమైన ధరకు విద్యుత్‌ లభిస్తుందికాంగ్రెస్‌కు ఎప్పుడూ ఒక అలవాటు ఉందికష్టమైన అభివృద్ధి పని వచ్చినప్పుడల్లా వారు దానిని చేపట్టకుండా పారిపోతారువారి ఈ అలవాటు కారణంగానే ఈశాన్య ప్రాంతంఅరుణాచల్ చాలా నష్టపోయాయిమారుమూలపర్వత ప్రాంతాలుఅడవుల్లోని లోయలుఅభివృద్ధి ఒక సవాలుగా ఉన్న అన్ని ప్రాంతాలనూ కాంగ్రెస్ వదిలివేసిందివాటిని "వెనకబడినవి"గా ప్రకటించింది.. వాటి అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందిఇందులో ఈశాన్యంలోని గిరిజన ప్రాంతాలుజిల్లాలు ఎక్కువగా ఉన్నాయిసరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలను కాంగ్రెస్ "దేశంలోని చివరి గ్రామాలు"గా ప్రకటించి నిర్లక్ష్యం చేసిందిఇలా తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటూ.. కాంగ్రెస్ తన వైఫల్యాలను దాచడానికి ప్రయత్నించిందిఫలితంగాగిరిజనసరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజల వలసలు నిరంతరం కొనసాగాయి.

మిత్రులారా

మన భాజపా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చిందికాంగ్రెస్ గతంలో "వెనుకబడిన జిల్లాలు"అనే పేరుతో పిలిచిన వాటిని మేం ‘ఆకాంక్షిత జిల్లాలుగా’ మార్చాం.  వాటి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చాంకాంగ్రెస్ ‘చివరి గ్రామాలు’గా పరిగణించిన సరిహద్దు గ్రామాలను దేశంలోని మొదటి గ్రామాలుగా గౌరవించటాన్ని ప్రారంభించాందీని ఫలితాలు నేడు కనిపిస్తున్నాయిఅభివృద్ధిలో సరిహద్దు గ్రామాలు కొత్త ఉత్తేజాన్ని చూస్తున్నాయివైబ్రంట్ గ్రామాల కార్యక్రమం విజయం సాధించి.. ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసిందిఅరుణాచల్ ప్రదేశ్‌లో కూడా 450కి పైగా సరిహద్దు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందాయివీటికి రోడ్లువిద్యుత్ఇంటర్నెట్ సౌకర్యాలు అందాయిగతంలో సరిహద్దు గ్రామాల ప్రజల పట్టణాలకు వలస వెళ్లారుకానీ ఇప్పుడు ఈ గ్రామాలు పర్యాటక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి

మిత్రులారా

అరుణాచల్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి గణనీయమైన అవకాశాలున్నాయికొత్త ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతున్నందున.. ఇక్కడ పర్యాటకం క్రమంగా పెరుగుతోందిగత దశాబ్దంలో అరుణాచల్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య రెట్టింపు కావడం అనేది నాకు సంతోషాన్ని కలిగిస్తోందికానీ అరుణాచల్ సామర్థ్యం ప్రకృతి ఆధారితసాంస్కృతిక పర్యాటకానికి పరిమితం కాకూడదుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమావేశకాన్సర్ట్ పర్యాటకం పెరుగుతోందన్న.. తవాంగ్‌లో రాబోతున్న ఆధునిక కన్వెన్షన్ సెంటర్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త రంగాలకు విస్తరిస్తుందిప్రభుత్వ చేపట్టిన ‘వైబ్రంట్ గ్రామాలు’ అనే కార్యక్రమం మన సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమంగా ఉందిఇది అరుణాచల్‌కు ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది

మిత్రులారా

నేడు ఢిల్లీలోఈటానగర్‌లో భాజపా ప్రభుత్వాలు ఉన్నందున రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందికేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సామర్థ్యం అభివృద్ధిపైనే దృష్టి సారించిందిఇక్కడ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పనులు ప్రారంభమవటాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చుఇక్కడ వైద్య కళాశాలలు వస్తున్నాయి.. ఆయుష్మాన్ పథకం కింద ఇక్కడ చాలా మంది ఉచిత చికిత్సను పొందుతున్నారుకేంద్ర రాష్ట్ర స్థాయిలలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా ఇదంతా సాధ్యమైంది.

మిత్రులారా

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి కారణంగా అరుణాచల్ వ్యవసాయంఉద్యానవనాలలో కూడా ముందుకు సాగుతోందిఇక్కడి నుంచి వచ్చే కివీనారింజయాలకులుఅనాస.. రాష్ట్రానికి కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయిపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే మొత్తం కూడా ఇక్కడి రైతులకు చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది

మిత్రులారా

మా అత్యున్నత ప్రాధాన్యతలలో.. మన తల్లులుసోదరీమణులుకుమార్తెలకు సాధికారత కల్పించడం ఒకటిమూడు కోట్ల 'లక్‌పతి దీదీల'ను తయారు చేయటం అనేది ఒక భారీ లక్ష్యం.. ఇది మోదీ లక్ష్యంపెమా ఖండూ గారుఆయన బృందం ఈ లక్ష్యానికి కూడా ఊతం ఇవ్వటం పట్ల  సంతోషంగా ఉన్నానుఉద్యోగినుల హాస్టళ్లను పెద్ద సంఖ్యలో నిర్మించేందుకు ఇక్కడ మొదలైన పనులు.. మన కుమార్తెలకు గొప్ప అధునిక సౌకర్యాలను అందిస్తాయి

మిత్రులారా

ఇవాళ నేనిక్కడ తల్లులుఅక్కాచెల్లెళ్ల భారీ సమావేశాన్ని చూస్తున్నానుమీ అందరికీ జీఎస్టీ పొదుపు పండగ విషయంలో మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుతదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయిఇప్పటి నుండి మీ నెలవారీ ఇంటి ఖర్చులో మీకు అవసరమైన ఉపశమనం లభిస్తుందివంటగది వస్తువులుపిల్లల విద్యకు సంబంధించినవి బట్టలు,  బూట్లు.. ఇలా ప్రతిదీ ఇప్పుడు మరింత తక్కువ ధరకే దొరుకుతాయి.

మిత్రులారా

2014కు ముందు ఉన్న పరిస్థితులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండిచాలా ఇబ్బందులు ఉండేవి.. ధరల పెరుగుదల ఆకాశాన్ని తాకింది.. ప్రతిచోటా భారీ మోసాలేకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూనే ఉందిఅప్పుడు సంవత్సరానికి కేవలం రెండు లక్షల రూపాయలు సంపాదించే వారు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉండేదిఇది 11 సంవత్సరాల క్రితం పరిస్థితి.. అప్పుడు రెండు లక్షల రూపాయల ఆదాయంపై కూడా పన్ను ఉందిఅనేక ముఖ్యమైన వస్తువులపై కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతానికి పైగా పన్ను వసూలు చేసిందిపిల్లల టోఫేలపై కూడా పన్ను చాలా ఎక్కువగా ఉండేది

మిత్రులారా

మీ ఆదాయంపొదుపు.. రెండింటినీ పెంచేందుకు కృషి చేస్తానని ఆ సమయంలో నేను మీకు హామీ ఇచ్చానుకొన్నేళ్లుగా దేశం అనేక పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొందికానీ మేం నిరంతరాయంగా ఆదాయపు పన్నును తగ్గిస్తూనే వచ్చాంఒక్కసారి ఆలోచించండి.. 11 సంవత్సరాల కిందట రెండు లక్షల రూపాయల ఆదాయంపై పన్ను ఉండేది.. ఈ సంవత్సరం మేం 12 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పూర్తి పన్ను రహితంగా చేశాంనేటి నుంచి జీఎస్టీ కేవలం శాతం, 18 శాతం.. అంటే రెండు స్లాబ్‌లుగానే ఉంటుందిఅనేక వస్తువులపై ఎలాంటి పన్ను లేదుఇతర వస్తువులకు పన్ను గణనీయంగా తగ్గిందిమీరు కొత్త ఇల్లు నిర్మించాలనుకున్నా.. దిచక్రవాహనం కొనాలనుకున్నాభోజనం చేయాలనుకున్నాప్రయాణించాలనుకున్నా.. ఇప్పుడు ప్రతిదీ మరింత అందుబాటు ధరల్లోకి మారిందిఈ జీఎస్టీ పొదుపు అనే పండగ మీకు నిజంగా గుర్తుండి పోతుంది

మిత్రులారా

నమస్కారం చెప్పే కంటే ముందే ‘జై హింద్’ అని చెప్పే అరుణాచల్ ప్రత్యేకతను నేను అభినందిస్తానుమీ కంటే దేశమే ముందు అని భావించే వాళ్లు మీరు. 'వికసిత్ భారత్'ను తయారు చేసేందుకు మనందరం కలిసి పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో దేశం కూడా మన నుంచి ఒకటి ఆశిస్తుందిఅదే 'ఆత్మనిర్భరత' (స్వయం సమృద్ధి). స్వావలంబనగా మారినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందిఈ స్వావలంబన కోసం స్వదేశీ మంత్రం చాలా అవసరంమనం స్వదేశీని పాటించాలనిదేశంలో తయారైన వాటిని మాత్రమే కొనుగోలువిక్రయం చేయాలని.. కాలందేశం డిమాండ్ చేస్తున్నాయిగర్వంగా చెప్పండి ఇది స్వదేశీమీరందరూ నాతో చెబుతారానేను "గర్వంగా చెప్పండిఅని చెప్పినప్పుడుమీరు "ఇది స్వదేశీఅని అనండిగర్వంగా చెప్పండి ఇది స్వదేశీగర్వంగా చెప్పండి ఇది స్వదేశీగర్వంగా చెప్పండి ఇది స్వదేశీగర్వంగా చెప్పండి ఇది స్వదేశీ!. ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది.. అరుణాచల్ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుందిఇవాల్టి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో నేను మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుఈ రోజు పవిత్రమైన నవరాత్రి పండగ మాత్రమే కాదు.. పొదుపు పండగ కూడా ఉందిఈ గొప్ప వేడుకలో మీరంతా భాగమైనందున.. మీరు ఒకటి చేయాలని కోరుతున్నానుదయచేసి మీ మొబైల్ ఫోన్‌లను తీసిఫ్లాష్‌లైట్‌లను వేసి పైకి ఎత్తి.. చుట్టూ చూడండిఇది పొదుపు పండగ తీరు.. ఇది దాని బలంనవరాత్రిలో ఈ మొదటి రోజున ప్రతిచోటా వెలుగు ఉంది.. అరుణాచల్ కాంతిరేఖలు దేశం అంతటా వ్యాపించాయిమీ చుట్టూ చూడండి.. మెరుస్తోన్న నక్షత్రాల వలె లైట్లన్నీ ప్రకాశిస్తున్నాయిమీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుచాలా ధన్యవాదాలు!

 

***


(Release ID: 2169967)