ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని ద్వారకలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 25 FEB 2024 4:42PM by PIB Hyderabad

ద్వారకాధీశ్ కీ – జై !

ద్వారకాధీశ్ కీ – జై !

ద్వారకాధీశ్ కీ – జై !

వేదికపై ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్పార్లమెంటులో నా సహచర సభ్యులు.. గుజరాత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సీ.ఆర్పాటిల్ఇతర గౌరవనీయ ప్రముఖులునా గుజరాత్ సోదరీ సోదరులారా.

ముందుగానన్ను స్వాగతించిన నా అహిర్ ఆడపడుచులకు నా గౌరవపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుకొద్ది రోజుల కిందట ద్వారకలో దాదాపు 37,000 మంది అహిర్ ఆడపడుచులు గర్బా ప్రదర్శన ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందిఅది చూసిన కొంతమంది గర్వంగా నాతో.. “సర్ద్వారకలో 37,000 మంది అహిర్ ఆడపడుచులు ఉన్నారు!” అని అంటున్నారుమీరు గర్బా మాత్రమే చూశారు... కానీ అందులో మరో ప్రత్యేకత కూడా ఉందిఆ 37,000 మంది అహిర్ ఆడపడుచులు గర్బా ప్రదర్శన ఇస్తున్నప్పుడు వారి శరీరాలపై కనీసం 25,000 కిలోగ్రాముల బంగారం ధరించారు” అని నేను వారితో చెప్పానుఇది నేను అంచనాతో చెబుతున్నదేవారు గర్బా సమయంలో తమ శరీరాలపై దాదాపు 25,000 కిలోగ్రాముల బంగారం ధరించారని తెలుసుకుని విన్న వారు ఆశ్చర్యపోయారునన్ను స్వాగతించినందుకు.. ఆశీర్వదించినందుకు మాతృమూర్తులందరికీ కృతజ్ఞతగా తల వంచి నమస్కరిస్తున్నానుఅహిర్ ఆడపడుచులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

శ్రీ కృష్ణుడి భూమి అయిన ద్వారకా ధామానికి నేను గౌరవంగా నమస్కరిస్తున్నానుశ్రీకృష్ణుడిని దేవభూమి ద్వారకలో ద్వారకాధీశునిగా కొలుస్తారుఇక్కడ ఏమి జరిగినా ఆ ద్వారకాధీశుని సంకల్పం ప్రకారమే జరుగుతుందిఉదయం ఆ శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శించి ఆయనను పూజించే అదృష్టం నాకు కలిగిందిద్వారక చార్ ధామ్సప్త పూరి రెండింటిలోనూ భాగమని చెబుతారుఆది శంకరాచార్య ఇక్కడ నాలుగు పీఠాల్లో ఒకటైన శారద పీఠాన్ని స్థాపించారుఇక్కడ నాగేశ్వర్ జ్యోతిర్లింగంరుక్మిణీ దేవి ఆలయంఅనేక ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయిఇటీవలే నా 'దేశ బాధ్యతలమధ్య.. దేశవ్యాప్తంగా గల పలు పవిత్ర స్థలాలను సందర్శించే 'దైవ కార్యంచేపట్టే అదృష్టం నాకు కలిగిందిఈ రోజు నేను ఇక్కడ ద్వారకా ధామ్‌లో ఆ దివ్య ప్రకాశాన్ని అనుభవిస్తున్నానుఈ ఉదయమే నాకు మరో అనుభవం కలిగింది.. అది జీవితాంతం నాతోనే ఉంటుంది.. సముద్రపు లోతుల్లోకి వెళ్లి అలనాటి ద్వారకను చూసే భాగ్యం నాకు లభించిందిపురావస్తు శాస్త్రవేత్తలు సముద్రంలో మునిగిన ద్వారక గురించి చాలా రాశారుమన గ్రంథాల్లోనూ ద్వారక గురించి విస్తృత ప్రస్తావనలు ఉన్నాయి --

భవిష్యతి పురీ రమ్యా సుద్వారా ప్రగ్యా-తోరణా.

చయాట్టాలక్ కేయూరా పృథివ్యామ్ కకుదోపమా॥

అంటే అందమైన ద్వారాలుఎత్తయిన భవనాలు కలిగిన ఈ నగరం భూమిపై ఒక శిఖరం లాంటిదివిశ్వకర్మ స్వయంగా ఈ ద్వారక నగరాన్ని నిర్మించాడని చెబుతారుద్వారక నగరం దాని వ్యవస్థీకరణఅభివృద్ధికి ఒక అద్భుతమైన ఉదాహరణఈ రోజు నేను లోతైన సముద్రపు నీటిలో ద్వారకాధీశుడిని చూసి.. నాలో ఆ పురాతన వైభవాన్నిఆ దివ్య ప్రకాశాన్ని నేను అనుభవిస్తున్నానుద్వారకాధీశుడైన శ్రీ కృష్ణుడికి నమస్కరించానునేను నాతో పాటు ఒక నెమలి ఈకను కూడా తీసుకెళ్లాను. శ్రీ కృష్ణుడిని స్మరిస్తూ దానిని నేను అక్కడ సమర్పించానుచాలా సంవత్సరాలుగా పురావస్తు శాస్త్రవేత్తల నుంచి తెలుసుకుంటున్న విషయాలతో నాకు చాలా ఉత్సుకత కలిగిందిఏదో ఒక రోజు సముద్రం లోపలికి వెళ్లి ఆ ద్వారకా నగరంలో మిగిలి ఉన్న అద్భుతాలను దర్శించి భక్తితో నమస్కరించాలనే కోరిక నాలో ఉండేదిఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత నా కోరిక నెరవేరిందినేను ఉప్పొంగిపోయాను.. నా మనస్సు భావోద్వేగాలతో నిండిపోయిందిదశాబ్దాలుగా ఆ కలను పోషించి.. చివరకు ఆ పవిత్ర భూమిని తాకిన తర్వాత నేను ఇప్పుడు ఎంత లోతైన ఆనందాన్ని అనుభవిస్తున్నానో ఊహించండి.

మిత్రులారా,

ఆ సమయంలో 21వ శతాబ్దపు భారత వైభవ దర్శనం కూడా నా కళ్ళలో తిరుగుతూ ఉంది.. నేను చాలా సేపు లోపలే ఉండిపోయానుఈ రోజు ఇక్కడకు ఆలస్యంగా రావడానికి కారణం.. నేను చాలా సేపు నీటి అడుగునే ఉండిపోయానుసముద్ర ద్వారక దర్శనం ద్వారా నేను 'వికసిత్ భారత్సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకున్నాను.

మిత్రులారా,

ఈ రోజు సుదర్శన సేతును ప్రారంభించే అదృష్టమూ నాకు కలిగిందిఆరు సంవత్సరాల కిందట ఈ వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాల్గొన్నానుఈ వంతెన ఓఖాను బేట్ ద్వారక ద్వీపంతో అనుసంధానిస్తుందిఇది ద్వారకాధీశుడిని సందర్శనను సులభతరం చేయడమే కాకుండా ఈ ప్రాంత దైవిక సౌందర్యాన్ని కూడా పెంచుతుందినేను ఈ కలను ఊహించాను.. దానికి పునాది వేసాను.. ఈ రోజు దానిని సాకారం చేసుకున్నాను.. ఇది దైవాన్ని ఆరాధించేప్రజలకు సేవ చేసే మోదీ హామీసుదర్శన సేతు కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. ఇంజనీరింగ్ అద్భుతం కూడాస్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సుదర్శన సేతును అధ్యయనం చేయాలని నేను కోరుకుంటున్నానుఇది దేశంలో ఇప్పటివరకు ఉన్న అత్యంత పొడవైన కేబుల్-స్టేడ్ వంతెనఈ ఆధునికఅద్భుత వంతెన కోసం దేశ పౌరులందరినీ నేను అభినందిస్తున్నాను.

ఇంత ముఖ్యమైన పని జరుగుతున్న సందర్భంలో నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తుకు వస్తుందిరష్యాలో ఆస్ట్రాఖాన్ అనే రాష్ట్రం ఉందిగుజరాత్‌కు ఆస్ట్రాఖాన్‌తో సోదర-రాష్ట్ర సంబంధం ఉందినేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు నన్ను రష్యాలోని ఆస్ట్రాఖాన్ రాష్ట్ర సందర్శనకు ఆహ్వానించారునేను అక్కడికి వెళ్ళినప్పుడు అత్యుత్తమ మార్కెట్అతిపెద్ద మాల్‌కు ఓఖా పేరు పెట్టడం నాకు ఆశ్చర్యం అనిపించిందిప్రతిదానికీ ఓఖా పేరు పెట్టారునేను అడిగాను.. “దీనికి ఓఖా అని ఎందుకు పేరు పెట్టారు?” అని. శతాబ్దాల క్రితం ప్రజలు వ్యాపారం కోసం ఇక్కడి నుంచి అక్కడకు వెళ్ళేవారు.. ఇక్కడి నుంచి పంపిన వస్తువులను అక్కడ అత్యంత నాణ్యమైనవిగా పరిగణించేవారుఅందుకే శతాబ్దాల తర్వాత కూడా దుకాణాలుమాల్స్‌కు ఓఖా పేరు పెట్టినప్పుడు.. ప్రజలు అక్కడ అత్యంత నాణ్యమైన వస్తువులే లభిస్తాయని నమ్ముతారుశతాబ్దాల కిందట ఓఖాకు ఉన్న గౌరవం సుదర్శన సేతు నిర్మాణం తర్వాత మరోసారి ప్రపంచ పటంలో ప్రకాశిస్తుంది.. ఓఖా పేరు మరింత బలపడుతుంది.

మిత్రులారా,

ఈ రోజు నేను సుదర్శన సేతును చూస్తున్నప్పుడు చాలా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయిగతంలో ద్వారకబేట్ ద్వారక ప్రజలు ఫెర్రీ పడవలపైనే ఆధారపడేవారుమొదట సముద్రం ద్వారాతరువాత రోడ్డు ద్వారా వారు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేదిప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు.. కొన్నిసార్లు సముద్రపు అలల తీవ్రత కారణంగా పడవ సేవలూ నిలిచిపోయేవి.. దీనివల్ల భక్తులకూ చాలా అసౌకర్యం కలిగిందినేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి నన్ను కలవడానికి వచ్చే నా సహచరులు ఎల్లప్పుడూ ఈ వంతెన అవసరం గురించి మాట్లాడేవారుమా శివ్-శివ్మా బాబుబా.. ఈ పని నేనే చేయాలనే ఎజెండాతో ఉన్నారుఈ రోజు బాబుబా అత్యంత సంతోషంగా ఉన్నారు.

మిత్రులారా,

ఆ సమయంలో నేను ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు పదే పదే ప్రస్తావించాను. వారు మాత్రం దానిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదుఈ సుదర్శన సేతు నిర్మాణం కూడా శ్రీ కృష్ణ భగవానుడు నా విధిలో రాశారుదేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా నేను ఈ బాధ్యతను నెరవేర్చగలిగినందుకు సంతోషంగా ఉన్నానుఈ వంతెన నిర్మాణం ఇప్పుడు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందిఈ వంతెన మరో ప్రత్యేకత.. దాని అద్భుతమైన లైటింగ్ఇది వంతెనపైనే ఏర్పాటు చేసిన సౌర ఫలకాల ద్వారా విద్యుచ్ఛక్తిని పొందుతుందిసుదర్శన సేతులో పన్నెండు పర్యాటక గ్యాలరీలు నిర్మించారుఈ రోజు నేను ఈ గ్యాలరీలను కూడా సందర్శించానువాటిని అద్భుతంగాఅత్యంత అందంగా రూపొందించారుఈ గ్యాలరీల ద్వారా ప్రజలు అనంతమైన నీలి సముద్రాన్ని చూడవచ్చు.

మిత్రులారా,

ఈ శుభ సందర్భంలో పవిత్ర ద్వారక భూమి ప్రజలను కూడా నేను అభినందిస్తున్నానువారు ఇక్కడ ప్రారంభించిన పరిశుభ్రత మిషన్లుద్వారకలో జరుగుతున్న అద్భుతమైన పరిశుభ్రత పనుల గురించి ప్రజలు సోషల్ మీడియాలో నాకు పంపిన వీడియోలు అద్భుతంగా ఉన్నాయిమీరందరూ సంతోషంగా ఉన్నారాఇప్పుడు ప్రతిదీ చాలా శుభ్రంగా కనిపిస్తున్న కారణంగా మీరంతా పరిశుభ్రత ప్రయత్నాలతో సంతృప్తి చెందారాకానీ ఇప్పుడు మీ బాధ్యత ఏమిటినేను మళ్ళీ శుభ్రం చేయడానికి తిరిగి రావాలామీరందరూ దానిని శుభ్రంగా ఉంచుతారామీ చేతులు పైకెత్తి, “ఇప్పుడు మేం ద్వారకను మురికి కానివ్వం” అని చెప్పండిచూడండీ.. దేశవిదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారుచాలా మంది భక్తులు వస్తారువారు పరిశుభ్రతను చూసినప్పుడు వారి హృదయాల్లో సగం స్థానం మీరు గెలుచుకుంటారు.

మిత్రులారా,

నేను పౌరులకు నవభారత అభివృద్ధి గురించి హామీ ఇచ్చినప్పుడు.. ప్రతిరోజూ నాపై విమర్శలు చేయడానికి ఇష్టపడే ఈ ప్రతిపక్ష సభ్యులు దానిని ఎగతాళి చేసేవారుప్రజలు తమ కళ్ళతోనే నవభారత ఆవిర్భావాన్ని ప్రస్తుతం చూస్తున్నారుదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వారికి సంకల్ప శక్తి లేదు. సామాన్య ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనే వారి ఉద్దేశం.. దాని పట్ల వారి అంకితభావం లోపభూయిష్టంగా ఉన్నాయికాంగ్రెస్ పార్టీ మొత్తం బలం ఒక కుటుంబాన్ని ప్రోత్సహించడంపై కేంద్రీకృతమై ఉంది. ప్రతిదీ ఒకే కుటుంబం కోసం చేయాల్సి ఉన్నప్పుడు దేశాన్ని నిర్మించాలనే ఆలోచన ఎలా గుర్తుకు వస్తుందివారి మొత్తం శక్తినీ సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఎలా నడపాలి.. కుంభకోణాలను ఎలా అణిచివేయాలి అనే దానిపై పెట్టుబడి పెట్టారుఅందుకే 2014కి ముందు 10 సంవత్సరాలపాటు భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉందిఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు ఇంత విశాలమైన దేశం గొప్ప కలలను నెరవేర్చే సామర్థ్యం పొందలేదుమౌలిక సదుపాయాల కోసం ఎంత తక్కువ బడ్జెట్ కేటాయించినా వారు అవినీతికి పాల్పడేవారుదేశంలో టెలికాం మౌలిక సదుపాయాలను పెంచే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ 2జీ కుంభకోణానికి పాల్పడిందిదేశంలో క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించే అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడిందిదేశంలో రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ హెలికాప్టర్జలాంతర్గాముల కుంభకోణాలకు పాల్పడిందిదేశానికి అవసరమైన ప్రతిదానితో కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేయగలదు.

మిత్రులారా,

2014లో మీ అందరి ఆశీస్సులతో నన్ను మీరు ఢిల్లీకి పంపినప్పుడు.. దేశాన్ని దోచుకోనివ్వనని నేను హామీ ఇచ్చానుకాంగ్రెస్ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు ఇప్పుడు ఆగిపోయాయిగత 10 సంవత్సరాల్లో మేం దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాందీని ఫలితంగా మీరు దేశవ్యాప్తంగా అద్భుతమైనగొప్పదైవిక నిర్మాణ పనులను చూస్తున్నారుఒక వైపు మన దైవిక తీర్థయాత్ర స్థలాలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. మరోవైపు మెగా ప్రాజెక్టుల ద్వారా సరికొత్త భారత్ ఆవిష్కారమవుతోందిఈ రోజు మీరు గుజరాత్‌లో అతి పొడవైన కేబుల్-స్టేడ్ వంతెనను చూస్తున్నారుకొద్ది రోజుల కిందటే ముంబయిలో.. దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన పూర్తయిందిజమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన అద్భుతమైన వంతెన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైందిదేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన అయిన తమిళనాడులోని న్యూ పంబన్ వంతెన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయిఅస్సాంలోని.. భారత్‌లోనే అత్యంత పొడవైన నదిపైనా వంతెన నిర్మాణం పూర్తయిందితూర్పుపశ్చిమఉత్తరదక్షిణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయిఈ ఆధునిక అనుసంధానం సమర్థమైనబలమైన దేశాన్ని నిర్మించే మార్గం.

మిత్రులారా,

కనెక్టివిటీ మెరుగుపడినప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం దేశ పర్యాటక రంగంపై కనిపిస్తుందిగుజరాత్‌లో పెరుగుతున్న కనెక్టివిటీ ఈ రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుస్తోందిగుజరాత్‌లో ప్రస్తుతం 22 అభయారణ్యాలు, 4 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయివేల సంవత్సరాల పురాతనమైన లోథల్ ఓడరేవు నగరం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందిఅహ్మదాబాద్ నగరంరాణి కీ వావ్చంపానేర్ధోలావీరాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా మారాయిద్వారకలోని శివరాజ్‌పూర్ బీచ్‌కు నీలి జెండా గుర్తింపు ఉందిఅహ్మదాబాద్ ప్రపంచ వారసత్వ నగరంఆసియాలో అతి పొడవైన రోప్‌వే మన గిర్నార్ పర్వతంపై ఉందిఆసియా సింహాలు మన గిర్ అడవుల్లో కనిపిస్తాయిప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా సర్దార్ సాహెబ్ ఐక్యతా మూర్తి గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉందిరాన్ ఉత్సవ్ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకుల సందడి కనిపిస్తుందికచ్‌లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఉందినాడా బెట్ దేశభక్తికీపర్యాటకానికీ ముఖ్య కేంద్రంగా మారుతోందిగుజరాత్‌లో అభివృద్ధివారసత్వం మంత్రాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక స్థలాలను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారుద్వారకసోమనాథ్పావగఢ్మోథేరాఅంబాజీ వంటి అన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. 52 శక్తి పీఠాల దర్శనం ఒకే చోట చేసుకునేలా అంబాజీలో ఏర్పాట్లు చేశారు.

భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులకు గుజరాత్ ప్రధాన ఎంపికగా మారుతోంది. 2022లో 85 లక్షలకు పైగా పర్యాటకులు భారత్‌ను సందర్శించగా.. వారిలో ప్రతి అయిదో పర్యాటకుడు గుజరాత్‌కు వచ్చారుగత సంవత్సరం ఆగస్టు నాటికి దాదాపు 1.5 మిలియన్ల మంది పర్యాటకులు గుజరాత్‌కు వచ్చారుకేంద్ర ప్రభుత్వం విదేశీ పర్యాటకులకు ఇచ్చిన ఇ-వీసా సౌకర్యంతో గుజరాత్ కూడా ప్రయోజనం పొందిందిపర్యాటకుల సంఖ్య పెరుగుదల గుజరాత్‌లో ఉపాధిస్వయం ఉపాధికి కొత్త అవకాశాలనూ సృష్టిస్తోంది.

మిత్రులారా,

నేను సౌరాష్ట్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడి నుంచి కొత్త శక్తితో తిరిగి వెళ్తానుసౌరాష్ట్ర భూమి సంకల్పం’ నుంచి విజయం’ వరకు గొప్ప స్ఫూర్తినిస్తుందిప్రస్తుత సౌరాష్ట్ర అభివృద్ధిని చూసినప్పుడు ఇక్కడ జీవితం ఎంత కష్టతరంగా ఉండేదో ఎవరూ గ్రహించలేరుసౌరాష్ట్రలోని ప్రతి కుటుంబంప్రతి రైతుప్రతి నీటి చుక్క కోసం ఆరాటపడే రోజులను మనం చూశాంఇక్కడి నుంచి ప్రజలు చాలా దూరం నడిచి వలస వెళ్లేవారుఏడాది పొడవునా ప్రవహించే నదుల నీటిని అక్కడి నుంచి సౌరాష్ట్రకచ్‌ ప్రాంతాలకు తీసుకువస్తామని నేను చెప్పినప్పుడు.. కాంగ్రెస్ వారు నన్ను ఎగతాళి చేసేవారుకానీ ఇప్పుడు సౌని పథకం సౌరాష్ట్ర విధిని మార్చిందిఈ పథకం కింద 1300 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్‌లు వేశారుఈ పైప్‌లైన్‌లు కూడా చిన్నవి కావు.. పైపు లోపల మారుతి కారు నడపగలిగేంత పెద్దవిగా ఉంటాయిఫలితంగా సౌరాష్ట్రలోని వందలాది గ్రామాలకు సాగునీరుతాగునీటి అవసరాల కోసం నీరు చేరుకుందిఇప్పుడు సౌరాష్ట్రలోని రైతులుపశువుల పెంపకందారులుమత్స్యకారులు సంపన్నులు అవుతున్నారురాబోయే కొన్ని సంవత్సరాల్లో సౌరాష్ట్రగుజరాత్ కలిసి విజయంలో కొత్త శిఖరాలకు చేరుకుంటాయని నేను నమ్ముతున్నానుద్వారకాధీశుడి ఆశీస్సులు మనతో ఉన్నాయిమనం కలిసికట్టుగా సౌరాష్ట్రనుగుజరాత్‌నూ అభివృద్ధి చేసుకుందాంగుజరాత్ అభివృద్ధి చెందినప్పుడు భారత్ కూడా అభివృద్ధి చెందుతుంది.

మరోసారి ఈ అద్భుతమైన వంతెన కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుఇప్పుడు నేను నా ద్వారకా వాసులను ఒక్కటే కోరుతున్నాను.. ప్రపంచం నలుమూలల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఎలా ఆకర్షించాలో ఇప్పుడే నిర్ణయించుకోండివారు వచ్చిన తర్వాత ఇక వారు ఇక్కడే ఉండాలని భావిస్తారుమీ భావాలను నేను గౌరవిస్తానునాతో కలిసి మీరంతా ఇలా చెప్పండి:

ద్వారకాధీశ్ కీ – జై!

ద్వారకాధీశ్ కీ – జై!

ద్వారకాధీశ్ కీ – జై!

భారత్ మాతా కీ – జై!

భారత్ మాతా కీ – జై!

భారత్ మాతా కీ – జై!

చాలా ధన్యవాదాలు.

గమనిక – ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం

 

***


(रिलीज़ आईडी: 2168974) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam