ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన గ్రీస్ ప్రధాని


ప్రధానమంత్రి శ్రీ మోదీ పుట్టిన రోజు సందర్భంగా

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని శ్రీ మిట్సోటాకిస్


భారత్-గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరుచునకోవడంతో పాటు

ప్రాంతీయ శాంతి, సమృద్ధిల కోసం కట్టుబడి ఉందామంటూ ఇద్దరు నేతల పునరుద్ఘాటన

భారత్-ఈయూ ఎఫ్టీఏ త్వరగా కొలిక్కిరావాలంటూ మద్దతు తెలిపిన ప్రధాని శ్రీ మిట్సోటాకిస్

Posted On: 19 SEP 2025 2:52PM by PIB Hyderabad

హెలెనిక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవ కిరియాకోస్ ిట్సోటాకిస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
ప్రధానమంత్రి శ్రీ మోదీ పుట్టిన రోజు సందర్భంగాప్రధాని శ్రీ ిట్సోటాకిస్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారుఈ ప్రతిగా ప్రధానమంత్రి శ్రీ మోదీ కృతజ్ఞ‌తలు తెలియజేశారు.

వాణిజ్యంపెట్టుబడిటెక్నాలజీనౌకాయానంరక్షణభద్రతసంధానంఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాల్లో చేసుకున్న అభివృద్ధిని నేతలు స్వాగతించారుభారత్-గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకూ ప్రయోజనం కలిగించేదిగా రూపొందాలనీఈ ఒప్పందం త్వరిత గతిన తుది రూపును దిద్దుకోవాలనీ ప్రధాని శ్రీ ిట్సోటాకిస్ కోరుకుంటూఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు గ్రీస్ మద్దతిస్తుందన్నారువచ్చే సంవత్సరం 2026లో భారత్ నిర్వహించే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫలప్రదం కావాలని కూడా ఆకాంక్షించారు.
ఉభయ దేశాల ప్రయోజనం ముడిపడి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నేతలూ తమ ఆలోచనలను పంచుకున్నారు.
సంప్రదింపులను కొనసాగించాలని కూడా వారు నిర్ణయించుకున్నారు.


(Release ID: 2168784)