ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మిషన్ సక్షమ్ ఆంగన్వాడీ, పోషణ్ 2.0’పై వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 SEP 2025 11:51AM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. బాలలుకౌమార దశలో ఉన్న బాలికలుగర్భిణులతో పాటు బాలింతల పోషణను మెరుగుపరచడానికి ‘మిషన్ సక్షమ్ ఆంగన్వాడీపోషణ్ 2.0’ పేరిట ఒక ప్రధాన కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు మంత్రి ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా విస్తరించిన ఆంగన్వాడీ కేంద్రాల విస్తృత వ్యవస్థ ద్వారా లక్షల మంది లబ్ధిదారులు ఈ  పథకంలో భాగంగా సాయాన్ని అందుకుంటున్నారు’’ అని శ్రీ  మోదీ అన్నారు.

సామాజిక  మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ  మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘
బాలలుకౌమార దశలో ఉన్న బాలికలతో పాటు గర్భవతులుబాలింతల పోషణను మెరుగుపరచడానికి తీసుకువచ్చిన ఒక భారీ కార్యక్రమం ‘మిషన్ సక్షమ్ ఆంగన్వాడీ పోషణ్ 2.0’. దీనిలో భాగంగా.. దేశం నలుమూలలా విస్తరించిన ఆంగన్వాడీ కేంద్రాల విస్తృత వ్యవస్థ ద్వారా కోట్లాది లబ్ధిదారులకు సాయం అందుతోందిమహిళలుబాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకంతో బాలల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న తీరును కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి గారు ఒక వ్యాసంలో సమగ్రంగా తెలిపారు...’’‌


(रिलीज़ आईडी: 2168773) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam