ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్’పై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 16 SEP 2025 2:40PM by PIB Hyderabad

సబ్‌కా సాథ్సబ్‌కా వికాస్సబ్‌కా ప్రయాస్’పై కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. ‘సబ్‌కా సాథ్సబ్‌కా వికాస్సబ్‌కా ప్రయాస్’... దైనందిన కార్యక్రమాల్లో కనిపిస్తోందివిద్యుత్తు ఎంతమాత్రం విలాసవంత కాదు. సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. డిజిటల్ సాంకేతిక నేపథ్యంలోనే మౌలిక సదుపాయాలు అందివస్తున్నాయి.

కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో నమోదు చేసిన సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందించారు.
‘‘‘
సబ్‌కా సాథ్సబ్‌కా వికాస్సబ్‌కా ప్రయాస్’ ఫలితాలు దేశ ప్రజల కళ్లెదుట నిలిచాయని కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ఈ వ్యాసంలో వివరించారువిద్యుత్తు ఇక విలాస వస్తువు ఎంత మాత్రం కాదనీసంక్షేమ పథకాలను నేరుగా ప్రజల చెంతకు చేరుస్తున్నారనీమౌలిక వసతుల కల్పనలో డిజిటల్ మాధ్య సమన్వయంతో వినియోగించుకుంటున్నారనీ ఆయన తెలిపారు.


ఈ భారతీయ నమూనాను ముందు  ప్రయోగాత్మకంగా గుజరాత్‌లో అమలుచేసి ఆ తరువాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ స్థాయికి విస్తరించారుపాలనను ఈ నమూనా చివరి అంచె వరకు తీసుకువెళ్లిభారత్ లోని అధికార యంత్రాంగాన్ని వాగ్దానాలను చేసే స్థాయి నుంచి ఆ వాగ్దానాలను నెరవేర్చే స్థాయికి మెరుగుపరచడంతో పాటు 2047 కల్లా ‘వికసిత్ భారత్‌’ లక్ష్య సాధనకు కూడా బాట వేస్తోంది.’’‌‌

 

 

***

MJPS/VJ


(Release ID: 2167354) Visitor Counter : 2