హోం మంత్రిత్వ శాఖ
జార్ఖండ్‌లోని హజారీబాగ్ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భారీ విజయం సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ పోలీసులను ప్రశంసించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో హతమైన రూ. 1 కోటి రివార్డు గల
నక్సల్ కమాండర్ సీసీఎమ్ సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేష్
మరో ఇద్దరు నక్సల్స్ రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చంచల్,
బిర్సెన్ గంజు అలియాస్ రామ్‌ఖేలావన్‌లనూ హతమార్చిన భద్రతా దళాలు
ఈ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ తరువాత ఉత్తర జార్ఖండ్‌లోని
బొకారో ప్రాంతంలో పూర్తయిన నక్సలిజం నిర్మూలన
త్వరలోనే యావత్ దేశానికి నక్సలిజం ముప్పు నుంచి విముక్తి
Posted On:
15 SEP 2025 5:35PM by PIB Hyderabad
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఈ రోజు నిర్వహించిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భారీ విజయం సాధించిన కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల (సీఆర్‌పీఎఫ్) కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ పోలీసులను కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ వేదికగా చేసిన ఒక పోస్టులో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్ లో ఈరోజు జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బలగాల (సీఆర్‌పీఎఫ్) కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. ఈ ఆపరేషన్‌లో రూ. 1 కోటి రివార్డు ఉన్న నక్సల్ కమాండర్ సీసీఎమ్ సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేష్ హతమయ్యారు. మరో ఇద్దరు నక్సల్స్.. రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చంచల్, బిర్సెన్ గంజు అలియాస్ రామ్ ఖేలావన్‌లను కూడా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ తరువాత ఉత్తర జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో నక్సలిజం ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శ్రీ అమిత్ షా ప్రకటించారు. త్వరలోనే యావత్ దేశం నక్సలిజం ముప్పు నుంచి విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2166978)
Visitor Counter : 2