ప్రధాన మంత్రి కార్యాలయం
ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
11 SEP 2025 8:51AM by PIB Hyderabad
ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు నివాళి అర్పించారు. భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ రంగాలకు ఆచార్య వినోబా భావే అందించిన సమున్నత సేవలను ప్రధానమంత్రి స్మరించుకొన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘ఆచార్య వినోబా భావే జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయనను దేశంలో అత్యంత ఆరాధనీయ ఆధ్యాత్మిక నేతలు, స్వాతంత్ర్య సమరయోధులు, సమాజ సంస్కర్తల్లో ఒకరుగా మనం చెప్పుకుంటాం. గాంధేయవాద ఆదర్శాలకు జనప్రియత్వాన్ని తెచ్చి, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాలవారికి సాధికారతను సంపాదించిపెట్టడానికీ వినోబా భావే తన జీవితాన్ని అంకితం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన మార్గంలో మనం ముందుకు పోవడానికి ఆయన ఆలోచనలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.’’
***
(रिलीज़ आईडी: 2165576)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam