ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జెరూసలేం‌లో జరిగిన ఘోర ఉగ్రదాడిని ఖండించిన ప్రధానమంత్రి

Posted On: 08 SEP 2025 9:23PM by PIB Hyderabad

జెరూసలేంలో అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘‘అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్నిదాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోందిఅలాగే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘జెరూసలేంలోని అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంబాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం

అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోంది. అలాగే ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’

@netanyahu


(Release ID: 2164870) Visitor Counter : 2