రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కలకత్తాలో సెప్టెంబర్ 15న కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి


సంస్కరణలు, పరివర్తన, మార్పు, కార్యాచరణ సంసిద్ధతపై దృష్టి

Posted On: 08 SEP 2025 3:50PM by PIB Hyderabad

భారత సాయుధ దళాలు సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు కలకత్తాపశ్చిమ బెంగాల్ లో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)-2025ని నిర్వహించనున్నాయి. "సంస్కరణల సంవత్సరం భవిష్యత్తులోకి ప్రయాణంఅనే థీమ్ తో ఈ సమావేశం జరగనుందిప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ సమావేశానికి రక్షణమంత్రిజాతీయ భద్రతా సలహాదారురక్షణ శాఖ కార్యదర్శిత్రివిధ దళాధిపతి హాజరవుతారుఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్త్రివిధ దళాల అధికారులతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

 

సంస్కరణలుపరివర్తనమార్పుకార్యాచరణ సంసిద్ధతపై సీసీసీ 2025 దృష్టి సారించనుందిఇవి సంస్థాగత సంస్కరణలులోతైన సమన్వయంసాంకేతిక ఆధునికీకరణ పట్ల సాయుధ దళాల నిబద్ధతను ప్రతిబింబిస్తాయిఅదే సమయంలోబహుళ రంగాల కార్యకలాపాల సంసిద్ధతను సూచిస్తాయిసంక్లిష్టంగా మారుతున్న భౌగోళిక-వ్యూహాత్మక పరిణామాల మధ్య చురుకైననిర్ణయాత్మక సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరగనున్నాయిసమ్మిళిత భాగస్వామ్య పద్ధతిని కొనసాగిస్తూసాయుధ దళాల్లోని వివిధ స్థాయుల అధికారులుసిబ్బందితో ముఖాముఖి చర్చలను ఈ సదస్సు నిర్వహిస్తుందిదీనివల్ల... క్షేత్ర స్థాయి అభిప్రాయాలు ఉన్నతస్థాయి చర్చలకు మరింత విలువను జోడిస్తాయి.

 

సీసీసీ అనేది సాయుధ దళాల అత్యున్నత స్థాయి సమాలోచన వేదికఇది దేశంలోని అత్యున్నత పౌరసైనిక నాయకత్వం ఒకచోట చేరిప్రాథమికంగావ్యూహాత్మకంగా అభిప్రాయాలు పంచుకోవటానికి సహకరిస్తుంది.

 

***


(Release ID: 2164729) Visitor Counter : 2