ప్రధాన మంత్రి కార్యాలయం
తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాడి రైతులకు సాధికారతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: ప్రధానమంత్రి
Posted On:
04 SEP 2025 8:43PM by PIB Hyderabad
భారత పాడి రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. పోషకాహార భద్రతను నిర్ధారించడంలో, సమ్మిళిత వృద్ధిని సాధించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.
రాష్ట్రీయ గోకుల్ మిషన్, సహకార సంస్థలకు మెరుగైన మద్దతు, అన్ని రంగాల్లో నిరంతర సంస్కరణల వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పాడి పరిశ్రమను ఆధునికీకరించడం, మరింత శక్తిమంతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. తాజా #NextGenGST సంస్కరణలు ఈ లక్ష్యం దిశగా ఒక కీలక ముందడుగును సూచిస్తాయి.
‘ఎక్స్’ వేదికగా అమూల్ సహకార సంఘం చేసిన పోస్టుకు స్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, లక్షలాది మందికి పోషకాహార భద్రతను నిర్ధారించడంలో మన అన్నదాతల సహకారం కీలకమైనది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్, సహకార సంస్థలకు మద్దతు, నిరంతర సంస్కరణల వంటి కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం భారత పాడి పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంది.
#NextGenGST సంస్కరణలు లక్షలాది మంది పాడి రైతులకు సాధికారత కల్పించడంతో పాటు ఉత్పత్తుల విలువను మెరుగుపరుస్తూ.. ప్రతి ఇంటికీ సరసమైన ధరలకు పాల ఉత్పత్తులను అందించే దిశగా కీలక ముందడుగును సూచిస్తున్నాయి.
***
(Release ID: 2163998)
Visitor Counter : 5
Read this release in:
Odia
,
English
,
Gujarati
,
Kannada
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Malayalam