ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే చేతుల మీదుగా డారుమా బొమ్మను అందుకున్న ప్రధానమంత్రి

Posted On: 29 AUG 2025 4:29PM by PIB Hyderabad

జపాన్‌లోని గున్మాలోని టకాసాకీ సిటీలోని షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డారుమా బొమ్మను బహుమతిగా ఈ రోజు అందజేశారుఈ బహుమతి భారత్‌కుజపాన్‌కు మధ్య ఉన్న సన్నిహిత నాగరికతఆధ్యాత్మిక బంధాలకు ప్రతీకగా ఉంది.

డారుమా డాల్‌ను జపానీయుల సంస్కృతిలో శుభప్రదమైందిగాసౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారుగున్మాలోని టకాసాకీ సిటీ ప్రఖ్యాత డారుమా బొమ్మలకు పుట్టినిల్లుజపాన్‌లో ‘డారుమా దైశీ’గా పేరుపొందిన ఒక బోధిధర్మ భారతదేశంలోని కాంచీపురం నుంచి ఇక్కడికి చేరుకున్నారుఈయన పేరిట జపాన్‌లో డారుమా సంప్రదాయం ఏర్పడిందిడారుమా దైశీ వేయి సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కిందటజపాన్‌ నుంచి ఇక్కడికి తరలివచ్చారు.


(Release ID: 2162024) Visitor Counter : 10