ప్రధాన మంత్రి కార్యాలయం
పాల్ఘర్‌లో భవనం కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని
Posted On:
28 AUG 2025 8:23PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఓ నివాస భవనం కూలి అనేక మంది ప్రభావితమైన, పలువురు గాయపడిన విషాద ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంవో ఇండియా హ్యాండిల్ చేసిన పోస్టు:
‘‘మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఓ భవనం కూలిపోయిన దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అన్నివిధాల అవసరమైన సాయాన్ని అధికారులు అందిస్తున్నారు: PM @narendramodi”
(Release ID: 2161724)
Visitor Counter : 16