ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 24 AUG 2025 10:24PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులుగుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులుఎమ్మెల్యేలుసర్దార్‌ధామ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్ట్రస్టీ వి.కెపటేల్దిలీప్ భాయ్ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారాముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..

సర్దార్‌ధామ్ పేరు ఎంత పవిత్రమైనదో.. అది చేసే పని కూడా అంతే పవిత్రమైనదిఆడబిడ్డలకు సేవ చేసేందుకువారి చదువుల కోసం నేడు ఒక హాస్టల్ ప్రారంభమవుతోందిఈ హాస్టల్‌లో ఉండే అమ్మాయిలకు ఆకాంక్షలుకలలు ఉంటాయివాటిని నెరవేర్చుకోవడానికి వారికి అనేక అవకాశాలు లభిస్తాయిఅంతేకాకుండాఈ అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడి సమర్థులుగా మారినప్పుడు.. వారు సహజంగానే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారుదీనితో పాటు వారి కుటుంబాలు కూడా సమర్థవంతంగా మారుతాయిఅందుకే అన్నింటికంటే ముందు.. ఈ హాస్టల్‌లో ఉండే అవకాశం లభించే అందరు అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానువారి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను.

మిత్రులారా,

బాలికల హాస్టల్ 2వ దశకు పునాదిరాయి వేసే అవకాశం మీరు నాకు ఇవ్వడం నా అదృష్టంసమాజ కృషి వల్ల వేల మంది బాలికలు.. అద్భుతమైన ఏర్పాట్లుసౌకర్యాలతో కూడిన ఒక గొప్ప భవనాన్ని పొందుతున్నారుబరోడాలో కూడా వేల మంది విద్యార్థుల కోసం హాస్టల్ రాబోతుందనిదాని నిర్మాణం పూర్తి కాబోతోందని నాకు తెలిసిందిఈ రకమైన విద్యఅభ్యాసంశిక్షణ కోసం సూరత్రాజ్‌కోట్మెహ్సానాలో కూడా చాలా కేంద్రాలు వస్తున్నాయివీటన్నింటికి సహాయం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానుఎందుకంటే మన దేశం.. సమాజ బలంతో మాత్రమే అభివృద్ధి చెందుతుందిఈ సందర్భంగా నేను సర్దార్ సాహెబ్ పాదాలకు నమస్కరిస్తున్నానునేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధి దేశాభివృద్ధికి చాలా అవసరమని నేను ఎప్పుడూ చెప్పేవాడినిగుజరాత్ నాకు నేర్పించినదిగుజరాత్ నుంచి నేను నేర్చుకున్నది నేడు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుండటం యాదృచ్చికం. 25-30 సంవత్సరాల కిందట గుజరాత్‌లో అనేక రకాల ఆందోళనకర పరిస్థితులు ఉండేవని మీ అందరికీ తెలుసుఅభివృద్ధితో పాటు సామాజిక అంశాలకు సంబంధించిన అనేక సంక్షోభాలలో కూడా గుజరాత్ రాష్ట్రం పనిచేయాల్సి వచ్చిందిఆయా రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందినేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే విద్యా రంగంలో ఆడపిల్లలు చాలా వెనుకబడి ఉన్నారని మొదటిసారి నా దృష్టికి వచ్చిందిఇది నన్ను బాగా కలిచివేసిందిచాలా కుటుంబాలు ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదుపాఠశాలలో చేరిన వారు కూడా తక్కువ సమయంలోనే మానేసేవారు. 25 ఏండ్ల కిందట మీరంతా నాకు అండగా నిలిచారుదీనితో పరిస్థితి మొత్తం మారిపోయిందిమేం బాలికా విద్య (కన్యా శిక్షకోసం రథయాత్ర చేసే వాళ్లమని మీరందరికి గుర్తుండే ఉంటుందిజూన్ 13, 14, 15 తేదీలలో ఉష్ణోగ్రత 40-42 డిగ్రీలు ఉండేదిగ్రామ గ్రామానికిఇంటింటికీ వెళ్తూ మేం అమ్మాయిల బతిమాలి మరీ పాఠశాలలకు తీసుకొచ్చేవాళ్లంపాఠశాల ప్రవేశాలకు సంబంధించిన ఉత్సవాల కోసం మేం పెద్ద కార్యక్రమాలను నిర్వహించాంఈ పని గొప్ప ప్రయోజనాలను అందించడం నా అదృష్టందాని కారణంగానే నేడు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చెందాయిపాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు లభించాయికావాల్సిన అన్ని రకాల వ్యవస్థలు అభివృద్ధి చెందాయిఉపాధ్యాయులను నియమించారుసమాజం కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని తన బాధ్యతను నిర్వర్తించిందిఫలితంగా ఆ పాఠశాలల్లో నాడు చేర్చుకున్న అమ్మాయిలు, అబ్బాయిలూ నేడు వైద్యులుఇంజనీర్లు అయ్యారుమధ్యలో చదువులకు స్వస్తి చెప్పే వారి శాతం తగ్గిందిఇది మాత్రమే కాదు.. గుజరాత్‌ వ్యాప్తంగా విద్య పట్ల అవగాహన పెరిగింది.

అప్పట్లో ఉన్న రెండో ప్రధాన ఆందోళన భ్రూణహత్యలుఇది ఆ కాలంలో మనకు ఉన్న చాలా పెద్ద కళంకంచాలాసార్లు మన సమాజం దీని గురించి ఆందోళన వెలిబుచ్చేదిపౌర సమాజం నన్ను సమర్థించిందిదీంతో ఒక ఉద్యమం ప్రారంభమైందిమేం సూరత్ నుంచి ఉమియా మాత వరకు ఊరేగింపు చేపట్టాంకొడుకులుకూతుర్లు సమానమే అనే భావన బలపడిందిమన గుజరాత్ శక్తిని పూజించే ప్రాంతంఇక్కడ మనకు ఉమియా మాతఖోడల్ మాతకాళి మాతఅంబా మాతబహుచర్ మాత ఉన్నారువారి ఆశీర్వాదాలు కూడా మనకు ఉన్నాయిఇటువంటి సమాజంలో భ్రూణహత్య ఒక పాపంఈ ఆలోచన వచ్చిన సమయంలో నాకు అందరి ద్దతు లభించటంతో గుజరాత్‌లో కుమారులుకుమార్తెల సంఖ్యలో ఉన్న భారీ అంతరాన్ని క్రమంగా తగ్గించడంలో నేడు మనం విజయం సాధించాం.

మిత్రులారా,

సమాజ శ్రేయస్సు కోసం గొప్ప లక్ష్యాలతో కృషి చేసినప్పుడుస్వచ్ఛతతో పనిచేసినప్పుడు దేవుడు కూడా తోడ్పడతాడుదేవుని రూపంలో ఉన్న సమాజం కూడా మద్దతునిస్తుందిఫలితాలు కూడా సాధించవచ్చునేడు సమాజంలో కొత్త అవగాహన వచ్చిందిమన ఆడ పిల్లలకు విద్యను అందించేందుకువారి గౌరవాన్ని పెంచటానికివారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు.. గొప్ప హాస్టళ్లను నిర్మించడానికి మనం స్వయంగా ముందుకు వస్తున్నాంగుజరాత్‌లో మనం నాటిన విత్తనం నేడు దేశవ్యాప్తంగా బేటీ బచావో-బేటీ పఢావో రూపంలో ఒక సామూహిక ఉద్యమంగా మారిందిమహిళల భద్రతసాధికారత కోసం దేశంలో చారిత్రక ప్రయత్నాలు జరుగుతున్నాయిఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడేటప్పుడు.. మన ఆడపిల్లల గొంతు వినిపిస్తుందివారి సామర్థ్యం మనకు తెలుస్తుందిగ్రామాల్లో చేపట్టిన లక్‌పతి దీదీ కార్యక్రమం లక్ష్యం కోట్ల మహిళలు కాగా.. ఇప్పటికే మనం కోట్లకు చేరుకున్నాందీనితో పాటు డ్రోన్ దీదీ మొదలైన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలోని మన స్త్రీల పట్ల దృక్పథాన్ని మార్చాయిగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తున్న బ్యాంక్ సఖీఇన్సూరెన్స్ సఖీలను మహిళలే నిర్వహిస్తున్నారు.

మిత్రులారా,

సమాజానికి సానుకూల తోడ్పాటు అందించే వ్యక్తులను తయారు చేయడంవారి సామర్థ్యాలను పెంపొందించడమే చదువుకు ఉన్న అతి పెద్ద లక్ష్యంప్రస్తుతం ఈ పనిని మనం వేగంగా చేస్తున్న నేపథ్యంలో.. ఇది సముచితం అనిపిస్తుందిఇప్పుడు మన మధ్య నైపుణ్యాల్లో పోటీ పెరగాలిప్రతిభలో పోటీ పడాలిఏ సందర్భంలోనైనా నైపుణ్యమే సమాజానికి బలంఈ రోజుప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామిక శక్తికి డిమాండ్ బాగా పెరిగిపోతుందిగతంలో దశబ్దాల తరబడి పాలించిన ప్రభుత్వం విద్యావ్యవస్థ పట్ల అనాలోచిత ధోరణితో వ్యవహరించిందిమేం దీనిలో మార్పులు తీసుకువచ్చాంపాత వ్యవస్థ నుంచి బయటకి వచ్చి.. పరిస్థితులను మారుస్తున్నాంమేం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం.. నైపుణ్యాలకుప్రతిభకు అధిక ప్రాధాన్యమిస్తుందిమేం స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించాందీని ద్వారా వివిధ రంగాల్లో నిపుణులుగా కోట్లాది మంది యువతను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాంప్రస్తుతం అంతర్జాతీయంగా వృద్ధాప్య సమస్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఈనాటి ఈ ప్రపంచానికి యువత అవసరం ఉందియువశక్తిని ప్రపంచానికి అందించగలిగిన సామర్థ్యం భారత్‌కు ఉందిమన యువతలో నైపుణ్యం పెరిగితే.. వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయివారి ఆత్మవిశ్వాసంస్వావలంబనసామర్థ్యం దాని నుంచే వస్తుందియువతకు ఉపాధి కల్పించడంగరిష్ఠంగా ఉద్యోగ అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. 11 ఏళ్ల క్రితందేశంలో స్వల్ప సంఖ్యలో మాత్రమే అంకుర సంస్థలు ఉండేవిఇప్పడు భారత్‌లో ఉన్న అంకుర సంస్థల సంఖ్య లక్షలకు చేరుకుందిఅందులోనూ.. ఈ అంకుర సంస్థలు ద్వితీయతృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటవుతున్నాయిముద్ర యోజన ద్వారా బ్యాంకుల నుంచి రుణాలను అందిస్తున్నాంఅది కూడా ఎలాంటి హామీ అవసరం లేకుండాఆలోచించండి... స్వయం ఉపాధి కోసం యువతకు రూ. 33 లక్షల కోట్లు అందించాంఫలితంగా లక్షలాది యువత స్వయం సమృద్ది సాధించడమే కాకుండా.. తమతో పాటు ఒకరిద్దరికి ఉపాధిని కూడా అందించగలుగుతున్నారుఆగస్టు 15న నేను ఓ పథకాన్ని ప్రకటించానుఆ రోజు నుంచే అమల్లోకి వచ్చిందిఅది ఒక లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకందీని ద్వారా ప్రైవేటు రంగంలో మీరు ఎవరికైనా ఉద్యోగం ఇస్తే.. ఆ వ్యక్తికి ప్రభుత్వం మొదటి నెల జీతంగా 15 వేల రూపాయలు అందిస్తుంది.

మిత్రులారా,

ప్రసుతం దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి రికార్డు స్థాయి వేగంతో ముందుకు సాగుతోందిపీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్తు పథకం ద్వారా పెద్ద ఎత్తున సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోందిడ్రోన్రక్షణ వ్యవస్థలు భారత్‌లో నిరంతరాయంగా వృద్ధి చెందుతున్నాయిఅలాగే తయారీ రంగంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించిందిఈ కార్యక్రమాలన్నీ గుజరాత్‌లో నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.

మిత్రులారా,

ప్రస్తుత ప్రపంచం భారతీయ శ్రామిక శక్తినిప్రతిభకున్న ప్రాధాన్యం గురించి అర్థం చేసుకుందిఅందుకే ప్రపంచ వ్యాప్తంగా విభిన్న దేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయిఆరోగ్య సేవలువిద్యఅంతరిక్షంతదితర రంగాల్లో తన ప్రతిభతో మన యువత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

మిత్రులారా,

ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు... ఎర్ర కోట నుంచిస్వదేశీ ప్రాధాన్యతను వివరించానుభారత్ స్వయం సమృద్ధంగా మారాలని అభ్యర్థించానుఇప్పుడు సమాజంలోని ప్రజలంతా నా ముందే కూర్చున్నారుగతంలో మీ అందరికీ పని గురించి చెప్పి ఆశీస్సులు పొందానుకానీ ఇప్పుడు అప్పగించిన పనులు మీరు కూడా పూర్తి చేశారని నేను చెప్పాలి. 25 ఏళ్ల నా అనుభవంలో నా అంచనాలను మీరు అందుకోలేని సందర్భం ఎప్పుడూ లేదుకాబట్టి నా ఆశ ఇంకొంచెం పెరిగిందిప్రతిసారి కొన్ని పనులను మీకు అప్పగించాలనే కోరిక పెరగుతూ ఉంటుందిఈ రోజు నేను ఓ విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నానుఅనిశ్చితి నెలకొన్న ప్రస్తుత ప్రపంచంలో స్వయం సమృద్ధి సాధించడమే భారత్‌కు ఉత్తమమైన మార్గంమనం స్వయం సమృద్ధం కావాలంటే.. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యమివ్వాలిమేక్ ఇన్ ఇండియా పట్ల మన ఆసక్తి పెరగాలి.

స్వదేశీ ఉద్యమం 100 ఏళ్ల నాటిది కాదు.. అది మన భవిష్యత్తును బలోపేతం చేసే ఉద్యమందానికి మీరు నాయకత్వం వహించాలిమన యువతీయువకులు దానిని చేపట్టాలిఒక్క విదేశీ వస్తువు కూడా మన కుటుంబంలోకిమన ఇంట్లోకి రాకుండా మనం చూసుకోవాలిఅలాగే.. నేను భారత్‌లో వివాహం చేసుకోవడం గురించి చెప్పానుచాలా మంది విదేశాల్లో తమ వివాహాలను రద్దు చేసుకొని భారత్‌కు వచ్చారుఇక్కడ హాళ్లను బుక్ చేసుకొని వివాహం చేసుకున్నారుమీరు ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే.. దేశం పట్ల ప్రేమ దానికదే పెరుగుతుందిమేక్ ఇన్ ఇండియాఆత్మ నిర్భర భారతే మ విజయంబలంమన భావితరాల భవిష్యత్తు దాని మీదే ఆధారపడి ఉందికాబట్టి స్నేహితులారాఎల్లప్పుడూ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయండిఉత్పత్తుల నాణ్యత దానికదే మెరుగుపడుతుందిమార్కెట్లో కొనసాగాలి అంటే.. అందరూ మంచి ఉత్పత్తులు తయారు చేయాలిమంచి ప్యాకింగ్ చేయాలితక్కువ ధరలకు అమ్మాలిమన డబ్బు విదేశాలకు తరలిపోతే అది మంచిది కాదుఈ విషయంలో సమాజంలో అవగాహన పెంపొందించి నేను అప్పగించిన ఈ చిన్న పనిని మీరు పూర్తి చేస్తారనిదేశానికి కొత్త శక్తిని ఇస్తారని ఆశిస్తున్నాను.

అలాగే వ్యాపారులకు కూడా నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నానుమన సమాజం ఇప్పుడు రైతులదే కాదు.. వ్యాపారులది కూడాకాబట్టి వ్యాపారిగా.. నా దుకాణంలో దేశీయ ఉత్పత్తులు మాత్రమే లభిస్తాయని అని మీరు బోర్డు పెట్టాలిదేశీయ ఉత్పత్తులు కొనాలనుకొనేవారు కచ్చితంగా మన దగ్గరకు వస్తారుమనం కూడా వారికి దేశీయ ఉత్పత్తులను విక్రయించవచ్చుఇది కూడా దేశభక్తేఆపరేషన్ సిందూర్ ఒక్కటే దేశభక్తి కాదుఇది కూడా దేశభక్తేనా భావనను మీతో పంచుకుంటున్నానుదానికి మీ సహకారం అందించి పూర్తి చేస్తారని మాట ఇచ్చారుమీ అందరి మధ్య ఉండే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడనుమీ అందరికీ నా శుభాకాంక్షలుఅమ్మాయిలందరికీ నా ఆశీస్సులునమస్కారం.

సూచనఇది ప్రధానమంత్రి గుజరాతీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2160580)