ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో కిండ్రిల్ ఛైర్మన్, సీఈవో మార్టిన్ ష్రోటర్ భేటీ

Posted On: 21 AUG 2025 9:50PM by PIB Hyderabad

కిండ్రిల్ ఛైర్మన్, సీఈవో శ్రీ మార్టిన్ ష్రోటర్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రపంచ భాగస్వాములను ఆహ్వానించిన ప్రధాన మంత్రి, భారతదేశంలోని విస్తృతమైన అవకాశాలను అన్వేషించాలని కోరారు. దేశంలోని ప్రతిభావంతులైన యువతతో కలిసి ఆవిష్కరణలు చేపట్టి యువతకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.  

ఈ తరహా భాగస్వామ్యాల ద్వారా భారతదేశానికి మాత్రమే కాక ప్రపంచ ప్రగతికి కూడా తోడ్పడే పరిష్కారాలను రూపొందించవచ్చని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మార్టిన్ ష్రోటర్ ఎక్స్ పోస్టుకు స్పందిస్తూ, ప్రధాన మంత్రి ఇలా అన్నారు;

"మార్టిన్ ష్రోటర్ తో ఉపయుక్తమైన సమావేశం జరిగింది. ప్రపంచ భాగస్వాములను హృదయపూర్వకంగా ఆహ్వానించిన భారత్, దేశంలోని విస్తృతమైన అవకాశాలను అన్వేషించాలని,  నూతన ఆవిష్కరణలకు దేశంలోని ప్రతిభావంతులైన యువతకు ప్రోత్సాహం అందించాలని పేర్కొంది.

భాగస్వామ్యం ద్వారా మనం కనుగొన్న పరిష్కారాలు కేవలం దేశానికే కాక, ప్రపంచ అభివృద్ధికి తోడ్పడుతాయి."

 

***


(Release ID: 2159735)