రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దీపావళి, ఛాత్ పండగలకు 12,000కు పైగా ప్రత్యేక రైళ్లు; అక్టోబర్ 13 నుంచి 26 తేదీల్లో ప్రయాణించి, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు తిరుగు ప్రయాణ టికెట్లపై 20% రాయితీ: అశ్వినీ వైష్ణవ్


బీహార్, ఢిల్లీ, అమృత్ సర్, హైదరాబాద్ తో పలు ప్రాంతాలను కలుపుతూ నాలుగు అమృత్ భారత్ రైళ్లు: రైల్వే మంత్రి


పూర్ణియా – పాట్నా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్; వైశాలి, హజీపూర్, సోనేపూర్, పాట్నా, రాజ్ గిర్, గయా, కోడెర్మాను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ రైలు సర్వీసు: అశ్వినీ వైష్ణవ్


బీహార్ లో రైల్వే లైన్ విస్తరణ: బాక్సర్-లఖిసరై నాలుగు లైన్ల కారిడార్, పాట్నా రింగ్ రైల్వే,

సుల్తాన్ గంజ్-దేవఘర్ రైల్ లింక్, పాట్నా-అయోధ్య రైలు

Posted On: 21 AUG 2025 2:09PM by PIB Hyderabad

దీపావళి, ఛత్ పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం 12,000పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారత రైల్వే నిర్ణయించింది.

రైల్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్కేంద్రమంత్రి లలన్ సింగ్ఎంపీ సంజయ్ కుమార్ ఝాతో చర్చించిన తర్వాత రాబోయే దీపావళిఛత్ పండగలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారుప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో కూడా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

 

సీనియర్ ప్రజా ప్రతినిధులతో సంప్రదింపుల అనంతరం దీపావళి, ఛత్ పండుగల కోసం 12,000పైగా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు చెప్పారుప్రయాణికులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

 

అక్టోబర్ 13 నుంచి 26 తేదీల్లో ప్రయాణించినవంబర్ 17 నుంచి డిసెంబర్ వరకు రిజర్వు చేసుకునే తిరుగు ప్రయాణ టికెట్లపై 20% రాయితీని ప్రకటించారుపండుగ సీజన్ లో అమలు చేసే రాయితీ వల్ల ప్రజలకు లబ్ధి చేకూరనుంది.

 

గయా నుంచి ఢిల్లీ, సహర్సా నుంచి అమృత్ సర్ఛాప్రా నుంచి ఢిల్లీముజఫర్ పూర్ నుంచి హైదరాబాద్ కు నాలుగు కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారుభగవాన్ బుద్ధకు సంబంధించిన ప్రత్యేక ప్రాంతాలను కలుపుతూమధ్యతరగతి కుటుంబాలకు అనుగుణంగా కొత్త సర్క్యూట్ రైలు ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారుఈ రైలు వైశాలిహాజీపూర్సోనేపూర్పాట్నారాజ్ గిర్గయాకొడెర్మా ప్రాంతాల గుండా వెళ్తుంది.

 

మరిన్ని రైళ్లను నడిపేందుకు వీలుగా బక్సర్-లఖిసరై రైల్వే విభాగాన్ని విస్తరించనున్నారుపాట్నా చుట్టూ రింగ్ రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారుసుల్తాన్‌గంజ్దేవఘర్ ప్రాంతాలను రైల్వే ద్వారా అనుసంధానించనున్నారుపాట్నా-అయోధ్య మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభించనున్నారు.

లౌకహా బజార్‌లో వాషింగ్ పిట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. బీహార్‌లో ఇటీవల ఆమోదం పొందిన అనేక రహదారి వంతెన పనులను చేపట్టనున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

 

బీహార్ లో ఎన్నో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు, అమృత్ భారత్వందే భారత్ సహా పలు కొత్త రైళ్లను ప్రారంభానికి అనుమతించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ఎంపీ సంజయ్ కుమార్ ఝా కృతజ్ఞతలు తెలిపారు. 

 
 
****

(Release ID: 2159538)