ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ


ద్వైపాక్షిక సంబంధాల కోసం సరిహద్దులో శాంతి, ప్రశాంతత ప్రాముఖ్యత ముఖ్యమన్న ప్రధానమంత్రి

గతేడాది కజాన్ లో అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో వస్తున్న స్థిర, సానుకూల పురోగతిని స్వాగతించిన ప్రధానమంత్రి

ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలన్న అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానాన్ని అంగీకరించిన ప్రధానమంత్రి

స్థిరమైన, ఊహించగలిగిన, నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలతో ప్రాంతీయ- ప్రపంచ శాంతి, శ్రేయస్సు: ప్రధానమంత్రి

Posted On: 19 AUG 2025 7:38PM by PIB Hyderabad

కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారుటియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారుఅలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనాజాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవాల్సిన ప్రాధాన్యతను ప్రధాన మంత్రి స్పష్టంగా వెల్లడించారుసరిహద్దు సమస్యకు న్యాయమైనసాధ్యమైనపరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
గత ఏడాది కజాన్ లో అధ్యక్షుడు జిన్ పింగ్ తో జరిగిన సమావేశానికి అనుగుణంగా పరస్పర గౌరవంకైలాస్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభంతో సహా పరస్పర ప్రయోజనంపరస్పర సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైనసానుకూల పురోగతిని ప్రధాన మంత్రి స్వాగతించారు.

ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు అధ్యక్షుడు జిన్ పింగ్ కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారుశిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షత వహించడానికి ప్రధాని మద్దతు తెలుపుతూ టియాంజిన్లో అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలవడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారుఅదే విధంగా భారత్చైనా మధ్య స్థిరమైనఅంచనా వేయదగిననిర్మాణాత్మక సంబంధాలు ప్రాంతీయప్రపంచ శాంతిశ్రేయస్సుకు గణనీయంగా దోహదపడతాయని ప్రధాని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2158188)