సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నవంబరు 1 మొదలు నవంబరు 30 వరకు జాతీయ స్థాయి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ) ప్రచార ఉద్యమం
• దేశవ్యాప్తంగా 1,850 కన్నా ఎక్కువ జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో శిబిరాల నిర్వహణ
• ముఖ ప్రమాణీకరణ సాంకేతికతను ఉపయోగించి పింఛనుదారులకు డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడానికి చేపడుతున్న అతి పెద్ద ప్రచార ఉద్యమం
• రెండు కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల నమోదు లక్ష్యంగా పరిపూర్ణ నమూనా వైపు మొగ్గు
Posted On:
13 AUG 2025 11:27AM by PIB Hyderabad
పింఛనుదారులు జీవించే ఉన్నామని సూచించే సర్టిఫికెట్లను ఏటా నవంబరులో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ) ప్రచార ఉద్యమం 3.0’ను 845 నగరాల్లో గతేడాది నవంబరులో నిర్వహించినప్పుడు 1.62 కోట్ల మంది డీఎల్‌సీలు దాఖలు చేశారు. పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం (డీఓపీపీడబ్ల్యూ) ‘4వ జాతీయ స్థాయి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచార ఉద్యమాన్ని’ ఈ సంవత్సరం నవంబరు నెల 1-30 తేదీల మధ్య నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలు, నగరాలు, పట్టణాలు కలుపుకొని భారత్ అంతటా 1,850 కన్నా ఎక్కువ చోట్ల 2,500 శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రచార ఉద్యమానికి సమగ్ర మార్గదర్శకాలను గత నెల 30న డీఓపీపీడబ్ల్యూ ప్రకటించింది. ఈ ప్రచార ఉద్యమాన్ని పింఛనును పంపిణీ చేసే బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, పింఛనుదారుల సంక్షేమ సంఘాలు, సీజీడీఏ, టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ), రైల్వేలు, డీఓపీ, ఈపీఎఫ్ఓ, యూఐడీఏఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై)ల సహకారంతో దేశంలో సుదూర ప్రాంతాల పెన్షనర్ల వద్దకు కూడా తీసుకుపోయే ఉద్దేశంతో చేపడుతున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ప్రచార ఉద్యమానికి సన్నాహాలు ఏ స్థాయుల్లో ఉన్నాయో డీఓపీపీడబ్ల్యూ కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ ఈ రోజున సమీక్షించారు. ఐపీపీబీ తనకున్న 1.8 లక్షల మంది పోస్ట్మన్లు, గ్రామీణ డాక్ సేవక్‌ల విస్తృత బలగంతోను, 1600 జిల్లా, సబ్-డివిజనల్ పోస్టాఫీసుల్లోను శిబిరాలను నిర్వహించనుంది. డీఎల్‌సీ సేవలను ఇంటి ముంగిట కూడా ఐపీపీబీ అందించనుంది. పింఛనుదారులు శిబిరాలకు చేరుకొనేటట్లు 57 పింఛను సంక్షేమ సంఘాలు కీలక పాత్రను పోషించనున్నాయి. దేశమంతటా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు అంటే.. రైల్వేల మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ (సీజీడీఏ). తపాలా విభాగం, టెలికమ్యూనికేషన్ల విభాగం, ఈపీఎఫ్ఓ కూడా ఏర్పాటు చేయనున్నాయి.
శిబిరాలను నిర్వహించే రాష్ట్రాలవారీ, బ్యాంకులవారీ వివరాలు ఇలా ఉన్నాయి:
State-wise
|
|
Bank-wise
|
Name of State/UT
|
No. of Cities/Towns
|
Name of Bank
|
No. of Cities/Towns
|
Uttar Pradesh
|
170
|
State Bank of India
|
82
|
Madhya Pradesh
|
127
|
Punjab National Bank
|
31
|
Bihar
|
114
|
Bank of india
|
27
|
Odisha
|
110
|
Indian Bank
|
24
|
Maharashtra
|
106
|
Bank of Baroda
|
24
|
West Bengal
|
102
|
Union Bank of India
|
20
|
Karnataka
|
97
|
Bank of Maharashtra
|
16
|
Rajasthan
|
95
|
Central Bank of India
|
16
|
Tamil Nadu
|
85
|
Canara Bank
|
12
|
Andhra Pradesh
|
81
|
HDFC Bank
|
12
|
Gujarat
|
76
|
ICICI Bank
|
11
|
Assam
|
74
|
Indian Overseas Bank
|
10
|
Telangana
|
73
|
Punjab and Sind Bank
|
6
|
Jharkhand
|
69
|
Axis Bank
|
6
|
Chhattisgarh
|
68
|
UCO Bank
|
5
|
Punjab
|
54
|
J&K Bank
|
4
|
Haryana
|
53
|
Bandhan Bank
|
5
|
Arunachal Pradesh
|
40
|
IDBI
|
2
|
Kerala
|
38
|
Kotak Mahindra Bank
|
2
|
Himachal Pradesh
|
35
|
|
Uttarakhand
|
30
|
Meghalaya
|
22
|
Tripura
|
22
|
Nagaland
|
21
|
Manipur
|
19
|
Mizoram
|
13
|
Sikkim
|
5
|
Goa
|
4
|
Jammu and Kashmir
|
38
|
Andaman and Nicobar Islands
|
6
|
Dadra and Nagar Haveli and Daman and Diu
|
4
|
Ladakh
|
4
|
Chandigarh
|
1
|
Delhi
|
1
|
Puducherry
|
1
|
Total
|
1858
|
Total
|
315
|
***
(Release ID: 2156062)