ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి, భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు మిర్జియోయెవ్
ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి అనేక కీలక అంశాల్లో పురోగతిని సమీక్షించిన ఇరువురు నేతలు
ప్రాచీన కాలం నుంచి ఉన్న భారత్- మధ్యాసియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు తెలిపిన ఇద్దరు నాయకులు
प्रविष्टि तिथि:
12 AUG 2025 7:06PM by PIB Hyderabad
ఉజ్బెకిస్తాన్ దేశాధ్యక్షుడు శ్రీ షవ్కత్ మిర్జియోయెవ్ ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రికి, దేశ ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు మిర్జియోయెవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వాణిజ్యం, అనుసంధానత, ఆరోగ్యం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక అంశాల్లో పురోగతిని ఇరువురు సమీక్షించారు.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాచీన కాలం నుంచి ఉన్న భారత్- మధ్య ఆసియా సంబంధాలను మరింత బలోపేతం చేసే విషయంలో నిబద్ధతతో ఉన్నట్లు పునరుద్ఘాటించారు.
ఒకరికి ఒకరు అందుబాటులో ఉండాలని ఇరువురు నిర్ణయించారు.
***
(रिलीज़ आईडी: 2155892)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam