ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌లో 2047 కల్లా సికిల్ సెల్ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమంపై ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 12 AUG 2025 12:35PM by PIB Hyderabad

భారత్‌లో కొడవలి కణ రక్తహీనత (సికిల్ సెల్ ఎనీమియావ్యాధి ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమ పురోగతిని గురించి వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రాసిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

‘‘జన్యుపరమైన అనారోగ్యాన్ని చక్కదిద్ది సమానత్వానికీఆత్మ గౌరవానికీ ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం ధ్యేయంగా పనిచేస్తున్న నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ ప్రజారోగ్య సంరక్షణలో ఓ నవ యుగానికి నాంది పలికింది

మన దేశంలో సికిల్ సెల్ వ్యాధి జాడలను 2047కల్లా రూపుమాపాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని గురించి కేంద్ర మంత్రి  శ్రీ జేపీ నడ్డా (@JPNadda) ఒక వ్యాసంలో రాశారుదీనిని తప్పక చదవండి.’’

 

***


(Release ID: 2155488)