ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంటల బీమా, భూసార సూచక కార్డులు, ప్రయోజనాల బదిలీతో పాటు ఆధునిక సేద్య నీటి పారుదలపై శ్రద్ధ.. జీవనోపాధిని బలపరిచి, ఉత్పాదకతను పెంచి, భారత వ్యవసాయ రంగానికి దృఢత్వాన్ని సంతరించిన విధానాలు, రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 12 AUG 2025 12:33PM by PIB Hyderabad

రైతుల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను వివరిస్తూ రాజ్యసభ ఎంపీ శ్రీ సత్‌నాం సింగ్ సంధూ రాసిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారుపంట బీమాభూ సార సూచక కార్డులుఆర్థికసాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వంటి నిర్ణయాలు వారి జీవనోపాధిని ఏ విధంగా బలపరిచిఫలసాయాన్ని పెంచడంతో పాటు దేశ వ్యవసాయ రంగాన్ని దృఢమైందిగా మార్చివేశాయో ఈ వ్యాసం వివరించింది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

‘‘శ్రీ సత్‌నాం సింగ్ సంధూ గారి (@satnamsandhuchd) వ్యాసం అనేక ముఖ్య విషయాలను వివరించింది.. పంట బీమాభూసార సూచక కార్డులుఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వంటి నిర్ణయాలను తీసుకొంటూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఏ విధంగా పెద్దపీట వేసిందీఈ చర్యలు రైతుల జీవనోపాధిని బలపరిచిదిగుబడులను పెంచుతూమన దేశ వ్యవసాయ రంగాన్ని ఆటుపోట్లకు తట్టుకొనే స్థితికి ఎలా చేర్చిందీ... ఆయన తన వ్యాసంలో తెలిపారు.’’‌

 

**‌*


(Release ID: 2155485)