సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ స్వేచ్ఛా సామరస్యాలకు సంబంధించిన చిత్రాల ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ప్రారంభమైన మూడు రోజుల హర్ ఘర్ తిరంగా చలనచిత్రోత్సవం


స్వాతంత్య్ర సమరయోధుడైన షహీద్ వీర్ సావర్కర్‌ చిత్రం ప్రదర్శనతో ప్రారంభమైన ఉత్సవం

యురి, ఆర్‌ఆర్‌ఆర్, తన్హాజీ, మేజర్‌లను ప్రదర్శించిన ఎన్‌ఎఫ్‌డీసీ

పాత కాలం నాటి దిగ్గజ సినిమాలతో పాటు సమకాలీన దేశభక్తి చిత్రాలను ప్రదర్శిస్తోన్న ఎన్‌ఎఫ్‌డీసీ

దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చిత్ర ప్రముఖులతో ఢిల్లీ, ముంబయి, చెన్నై, పుణెలలో భారీగా ప్రారంభమైన చలనచిత్రోత్సవం

"భారతదేశ గొప్ప సాంస్కృతిక చరిత్ర, ఘన వారసత్వాన్ని ప్రదర్శించాలని హర్ ఘర్ తిరంగా దేశభక్తి చలనచిత్రోత్సవం లక్ష్యంగా పెట్టుకుంది" - శ్రీ సంజయ్ జాజు, కార్యదర్శి, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ

"ఈ చలన చిత్రోత్సవం స్వాతంత్య్రం కోసం మనం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది" - కపిల్ మిశ్రా, కళలు- సంస్కృతి- భాషా మంత్రి, ఢిల్లీ

Posted On: 11 AUG 2025 5:22PM by PIB Hyderabad

హర్ ఘర్ తిరంగా దేశభక్తి చలనచిత్రోత్సవం ఎంతో ఉత్సాహంతో ఇవాళ ప్రారంభమైంది. దేశ స్వాతంత్రయా నికి గౌరవం ఇస్తూ దేశవ్యాప్తంగా చేసుకునే సినీ పండుగ ఇది. 2025 ఆగస్టు 11 నుంచి 13 వరకు జరిగే ఈ ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్వహిస్తోంది.



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత స్థాయిలో ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. త్రివర్ణ పతాకంతో ప్రజలకు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని మరింతగా పెంచేందుకు.. ఐక్యత, దేశభక్తిని పెంపొందించాలని ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రదర్శించే చిత్రాలను నిశిత పరిశీలనతో ఎంతో జాగ్రత్తగా ఎంపికచేశారు. ప్రేక్షకులకు భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేయటం, వీరుల త్యాగాలను గుర్తించటం, దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన కథలను తెలియజేయాలనే లక్ష్యంతో చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వ కళలు, సంస్కృతి, భాషా శాఖ మంత్రి శ్రీ కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను చిరకాలం గుర్తుంచుకునేలా చేసే, తరతరాలకు స్ఫూర్తినిచ్చే శక్తి సినిమాకు ఉందని అన్నారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి చలనచిత్రోత్సవం కేవలం సినిమా వేడుక మాత్రమే కాదు.. మనకు స్వాతంత్య్ర  పోరాటాన్ని ఇది గుర్తు చేస్తోందని ఆయన అన్నారు.



ముంబయిలో జరిగిన కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ..  హర్ ఘర్ తిరంగా దేశభక్తి చలనచిత్రోత్సవం అనేది సినిమా మాధ్యమం ద్వారా దేశానికి ఉన్న గొప్ప సాంస్కృతిక చరిత్ర, ఘన వారసత్వాన్ని ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. సినిమా దృశ్య మాధ్యమంగా ఉండటం వల్ల ప్రేక్షకులపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందన్నారు. ఈ ఉత్సవం భారతీయులందరిలో దేశభక్తిని రేకెత్తించాలని భావిస్తోందన్నారు.



ముంబయిలో జరిగిన కార్యక్రమంలో నటి శ్రియా పిల్గావ్‌కర్ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వటాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. "ఈ సినిమాలు మన వీరుల మనోధైర్యాన్ని గుర్తు చేస్తాయి. ఈ కథలను ఇతరులతో పంచుకోవటాన్ని కొనసాగించటమనేది చాలా ముఖ్యం" అని అన్నారు.

ఢిల్లీ, ముంబయి, చెన్నై, పుణెలలో జరిగిన ప్రారంభోత్సవాలు:

 


నాలుగు నగరాల్లో ఘన వేడుకలు

ఢిల్లీ: సిరి పోర్ట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వ కళలు, సంస్కృతి, భాషా శాఖ మంత్రి శ్రీ కమిల్ మిశ్రా ప్రారంభించారు. ఆయనతో పాటు సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ (ఐఎన్‌బీ) అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ (డీపీడీ) శ్రీ భూపేంద్ర కైంతోలా, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ (మీడియా, కమ్యూనికేషన్) శ్రీ ధీరేంద్ర ఓజా తదితర సీనియర్ ప్రముఖులు పాల్గొన్నారు.

ముంబయి: ఎన్‌ఎఫ్‌డీసీ–నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా (ఎన్‌ఎంఐసీ) కాంప్లెక్స్‌లో ప్రారంభోత్సవం జరిగింది. సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రముఖ నటి శ్రియా పిల్గావ్‌కర్ కూడా హాజరవ్వటంతో చిత్ర ప్రముఖుల ఆకర్షణ ఈ కార్యక్రమానికి తోడైంది. సీనియర్ అధికారులు, చిత్రనిర్మాతలు, సినీ ప్రేమికులు కూడా ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు. అందరూ కలిసి మూడు రోజుల పాటు జరిగే స్ఫూర్తిదాయకమైన చలనచిత్ర ప్రదర్శనలకు ఒక మంచి ప్రారంభాన్నిచ్చారు.

చెన్నై: ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దేశభక్తిపై లోతైన భావంతో సినిమాలు తీయటం గురించి దర్శకుడు వసంత్,  కళకు ఉన్న పాత్రను ప్రధానంగా చూపించటంపై కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ మాట్లాడారు. చలనచిత్రోత్సవానికి సహాయసహకారాలు అందిస్తూ ప్రోత్సహం అందిస్తోన్న తమిళ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు శ్రీ చోళ నాచియార్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. దేశభక్తి గురించి నటి నమిత.. సంస్కృతి, సంప్రదాయం, యువ ప్రతిభను అనుసంధానం చేయటం గురించి తమిళనాడు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీఎస్ శివకుమార్ ప్రసంగించారు. నటుడు, దర్శకుడు, నిర్మాత శ్రీ వీర కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

పుణె: ఎన్‌ఎఫ్‌డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో (ఎన్‌ఎఫ్ఏఐ) జరిగిన కార్యక్రమానికి హాజరైన వారు.. ఢిల్లీ, ముంబయి, చెన్నై ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని ఆస్వాదించారు. ఆ వెంటనే సినీ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర సాంస్కృతిక రాజధానిలో జరిగిన ఈ కార్యక్రమం ఐక్యత, సంయుక్త వేడుకల స్ఫూర్తిని తెలియజేసింది.

 



వైవిధ్యభరితమైన, స్ఫూర్తిదాయకమైన చలనచిత్రాల ప్రదర్శనలు -

వైవిధ్యభరితమైన చలనచిత్రాల విభాగంలో ఉన్న పాత దేశభక్తి చిత్రాలు:

షహీద్ (1965)– షహీద్ భగత్ సింగ్‌‌ త్యాగాన్ని తెలియజేసే ఉత్తేజకరమైన కథ

స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (2024) – స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం, భావజాలాన్ని వివరించే చిత్రం

యురి: ది సర్జికల్ స్ట్రైక్ (2019) – భారత సైన్యం 2016లో నిర్వహించిన మెరుపుదాడులను తెలియజేసే ఆధునిక కథన చిత్రం

ఆర్‌ఆర్‌ఆర్ (2022) – స్వాతంత్య్ర సమరయోధుల కల్పిత కథలతో కూడిన ఒక ప్రముఖ సినిమా

తన్హాజీ (2020)– మరాఠా యోధుడు తన్హాజీ మలుసరే ధైర్యసాహసాలను తెలిపే చిత్రం

ప్రదర్శనలో ఉన్న ఇతర ముఖ్యమైన చిత్రాలు:

* మేజర్ (2022) – 26/11 ముంబయి దాడులలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్యసాహసాలను తెలిపే చిత్రం
* నేతాజీ సుభాష్ చంద్రబోస్ – దార్శనిక జాతీయవాద నాయకుడి ఘన వారసత్వాన్ని తెలియజేసే డాక్యుమెంటరీ చిత్రం
* వీరపాండియా కట్టబొమ్మన్ (1959) – దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడుపై తీసిన తమిళ క్లాసిక్ చిత్రం
* క్రాంతి (1981)– వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును తెలియజేసే గొప్ప కథ
* హాకీకత్ (1964)– 1962 ఇండో, చైనా వివాదం నుంచి ప్రేరణ పొందిన యుద్ధానికి సంబంధించిన హృదయ విదారక చిత్రం
* పరాశక్తి (1952)– బలమైన సామాజిక, జాతీయవాద భావాలతో కూడిన ఒక ముఖ్యమైన తమిళ చిత్రం
* సాత్ హిందుస్తానీ (1969) – గోవా విముక్తి కోసం పోరాడిన ఏడుగురు భారతీయుల కథ

వీటితో పాటు చారిత్రక విషయాలపై అవగాహన కల్పిస్తూ ప్రేక్షకులను నిమగ్నం చేసేందుకు ఉద్దేశించిన కింది డాక్యుమెంటరీ చిత్రాలను కూడా చిలనచిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు:

* అవర్ ఫ్లాగ్ - త్రివర్ణ పతాక చరిత్ర..  జెండాలోని రంగులు, చిహ్నాల విశేషాలను తెలియజేసే చిత్రం
* లోకమాన్య తిలక్ - బాల గంగాధర్ తిలక్ జీవితం, రాజకీయాలను వివరించే చిత్రం
* తిలక్ - తిలక్ జాతీయవాద దృక్పథాన్ని తెలిపే చిత్రం
* షహదత్ - భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోని త్యాగాలను ప్రధానంగా తెలియజేసే చిత్రం

గతానికి జీవం పోస్తూ ఎన్‌ఎఫ్ఏఐ పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు -

ఈ ఉత్సవంలో నాలుగు ముఖ్యమైన చిత్రాలు - క్రాంతి (1981), హకీకత్ (1964), సాత్ హిందుస్తానీ (1969), షహీద్ (1965)లను ప్రదర్శిస్తున్నారు. వీటిని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్ఏఐ) ఎంతో శ్రమించి డిజిటల్ పద్ధతులతో పునరుద్ధరించింది. 

* క్రాంతి (1981) - 19వ శతాబ్దంలో బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటానికి సంబంధించిన ఒక గొప్ప కథ ఇది. మనోజ్ కుమార్, దిలీప్ కుమార్, హేమ మాలినిలతో కూడిన తారాగణం ఇందులో నచింటింది.
* హకీకత్ (1964) - చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన యుద్ధానికి సంబంధించిన ఈ చిత్రం.. 1962 ఇండో-చైనా యుద్ధానికి సంబంధించిన భావోద్వేగ, వ్యూహాత్మక పరిస్థితులను తెలియజేస్తోంది.
* సాత్ హిందుస్తానీ (1969) - విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఏడుగురు భారతీయులు, పోర్చుగీస్ పాలన నుంచి గోవాను విముక్తి చేయడానికి కలిసి పోరాటం చేయటానికి సంబంధించిన ఉత్సాహభరితమైన చిత్రం. అమితాబ్ బచ్చన్ అరంగేట్రం చేసిన చిత్రంగా దీనికి గుర్తింపు ఉంది.
* షహీద్ (1965) – భగత్ సింగ్ విప్లవాత్మక పోరాటం, త్యాగాన్ని తెలియజేసే చిత్రం. మనోజ్ కుమార్ భగత్ సింగ్ పాత్రను పోషించారు.

పునరుద్ధరణలో ఎన్‌ఎఫ్ఏఐ పాత్ర:

ఎన్ఎఫ్‌డీసీలో నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా అనేది ఒక విభాగం. చలనచిత్రాల సంరక్షణ, పునరుద్ధరణ విషయంలో ఇది పని చేస్తోంది. భారతదేశ సినీ వారసత్వం కాలక్రమేణా క్షీణించకుండా ఉండేందుకు ఇది కృషి చేస్తోంది. అధునాతన డిజిటలైజేషన్ పద్ధతులు, కలర్ గ్రేడింగ్, ఆడియోను మెరుగుపరచటం ద్వారా ఎన్‌ఎఫ్ఏఐ విచ్ఛిన్న స్థితిలో ఉన్న సెల్యులాయిడ్ ప్రింట్‌లను అసలు నాణ్యతకు సమానమైన స్థాయిలోకి పునరుద్ధరిస్తోంది. నవతరం ప్రేక్షకులు ఈ క్లాసిక్‌ చిత్రాలను చూసేందుకు వీలైన నాణ్యత ఉండేలా చూసుకుంటోంది. హర్ ఘర్ తిరంగా  దేశభక్తి చలనచిత్రోత్సవంలో పునరుద్ధరించిన చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది చిత్రనిర్మాతలకు గుర్తింపునివ్వటంతో పాటు దేశ చలనచిత్ర వారసత్వాన్ని కాపాడటంలో ఎన్‌ఎఫ్ఏఐ నిబద్ధతను తెలియజేస్తోంది.  

అన్ని నగరాల్లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ (2025 ఆగస్టు 11–13)

హర్ ఘర్ తిరంగా దేశభక్తి చలనచిత్రోత్సవానికి సంబంధించి నగరాల వారీగా రోజువారీ షెడ్యూల్ కింద ఉంది. ఒక నగరంలో ఒకే సమయంలో ఒకే చిత్రం ఎక్కువ చోట్ల ఉన్న సందర్భంలో ఆయా కేంద్రాల్లో రెండో చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. 

సిరి ఫోర్ట్ ఆడిటోరియం, ఢిల్లీ - 

 

Date

Venue / Screen

Time

Event

Aug 11, 2025 (Opening Day)

Main Hall (Audi-2)

11:00 AM – 11:30 AM

Opening Ceremony

 

Main Hall (Audi-2)

12:30 PM – 3:30 PM

Shaheed

 

Main Hall (Audi-2)

4:00 PM – 7:00 PM

Swatantrya Veer Savarkar

Aug 12, 2025 (Day 2)

Main Hall (Audi-2)

11:00 AM – 11:20 AM

Documentary — Our Flag

 

Main Hall (Audi-2)

11:20 AM – 2:00 PM

Uri: The Surgical Strike

 

Main Hall (Audi-2)

2:30 PM – 2:40 PM

Netaji Subhash Chandra Bose (short documentary)

 

Main Hall (Audi-2)

2:40 PM – 5:10 PM

Major

 

Screening Room (Secondary)

2:30 PM – 5:40 PM

Kranti (parallel screening)

 

Main Hall (Audi-2)

5:30 PM – 6:00 PM

Documentary — Shahadat

Aug 13, 2025 (Closing Day)

Main Hall (Audi-2)

11:00 AM – 1:15 PM

Tanhaji

 

Main Hall (Audi-2)

2:00 PM – 5:30 PM

RRR

 

Main Hall (Audi-2)

6:00 PM – 8:30 PM

Saat Hindustani

 

ఎన్‌ఎఫ్‌డీసీ/ఎన్ఎంఐసీ కాంప్లెక్స్, పెద్దర్ రోడ్, ముంబయి - 

 

Date

Venue / Screen

Time

Event

Aug 11, 2025 (Opening Day)

Main Hall

11:00 AM – 11:30 AM

Opening Ceremony

 

Main Hall

11:30 AM – 12:00 PM

Local Opening Ceremony (Shriya Pilgaonkar)

 

Main Hall

12:00 PM – 12:30 PM

Documentary — Lokmanya Tilak

 

Main Hall

12:30 PM – 3:30 PM

Shaheed

 

Main Hall

4:00 PM – 7:00 PM

Swatantrya Veer Savarkar

Aug 12, 2025 (Day 2)

Main Hall

11:00 AM – 11:20 AM

Documentary — Our Flag

 

Main Hall

11:20 AM – 2:00 PM

Uri: The Surgical Strike

 

Screening Room (Secondary)

2:30 PM – 2:40 PM

Netaji Subhash Chandra Bose (short documentary)

 

Main Hall

2:40 PM – 5:10 PM

Major

 

Main Hall

5:30 PM – 6:00 PM

Documentary — Shahadat

 

Screening Room (Secondary)

6:00 PM – 9:00 PM

Kranti (parallel screening)

Aug 13, 2025 (Closing Day)

Main Hall

11:00 AM – 1:15 PM

Tanhaji

 

Main Hall

2:00 PM – 5:30 PM

RRR

 

Main Hall

6:00 PM – 8:30 PM

Saat Hindustani

ఎన్ఎఫ్‌డీసీ/ఎన్‌ఎఫ్ఏఐ (లా కాలేజ్ రోడ్), పుణె

 

Date

Venue / Screen

Time

Event

Aug 11, 2025 (Opening Day)

NFAI Theatre (Main)

11:00 AM – 11:30 AM

Opening Ceremony

 

NFAI Theatre (Main)

11:30 AM – 2:00 PM

Shaheed

 

NFAI Theatre (Main)

4:00 PM – 7:00 PM

Swatantrya Veer Savarkar

Aug 12, 2025 (Day 2)

NFAI Theatre (Main)

11:00 AM – 11:20 AM

Documentary — Our Flag

 

NFAI Theatre (Main)

11:20 AM – 2:00 PM

Uri: The Surgical Strike

 

NFAI Theatre (Main)

3:00 PM – 3:20 PM

Netaji Subhash Chandra Bose (short documentary)

 

NFAI Theatre (Main)

3:30 PM – 6:30 PM

Haqeeqat

 

NFAI Theatre (Main)

6:30 PM – 7:00 PM

Documentary — Shahadat

Aug 13, 2025 (Closing Day)

NFAI Theatre (Main)

11:00 AM – 1:15 PM

Tanhaji

 

NFAI Theatre (Main)

2:00 PM – 2:30 PM

Documentary — Tilak

 

NFAI Theatre (Main)

2:30 PM – 5:40 PM

Kranti

 

NFAI Theatre (Main)

6:00 PM – 8:30 PM

Saat Hindustani

 

ఠాగూర్ ఫిల్మ్ సెంటర్, చెన్నై -

 

Date

Venue / Screen

Time

Event

Aug 11, 2025 (Opening Day)

Tagore Film Centre (Main)

11:00 AM – 11:30 AM

Opening Ceremony

 

Tagore Film Centre (Main)

12:30 PM – 3:30 PM

Shaheed

 

Tagore Film Centre (Main)

4:00 PM – 7:00 PM

Swatantrya Veer Savarkar

Aug 12, 2025 (Day 2)

Tagore Film Centre (Main)

11:00 AM – 11:20 AM

Documentary — Our Flag

 

Tagore Film Centre (Main)

11:20 AM – 2:00 PM

Uri: The Surgical Strike

 

Tagore Film Centre (Main)

3:00 PM – 3:20 PM

Netaji Subhash Chandra Bose (short documentary)

 

Tagore Film Centre (Main)

3:30 PM – 6:30 PM

Veerapandia Kattabomman

 

Tagore Film Centre (Main)

6:30 PM – 7:00 PM

Documentary — Shahadat

Aug 13, 2025 (Closing Day)

Tagore Film Centre (Main)

11:00 AM – 1:15 PM

Tanhaji

 

Tagore Film Centre (Main)

2:00 PM – 2:30 PM

Documentary — Tilak

 

Tagore Film Centre (Main)

2:30 PM – 5:40 PM

Parasakthti

 

Tagore Film Centre (Main)

6:00 PM – 8:30 PM

Saat Hindustani

 

నిబద్ధతతో ఎన్‌ఎఫ్‌డీసీ తీసుకుంటున్న చర్యలు 

దశాబ్దాలుగా భారతీయ సినిమాల అభివృద్ధి, సంరక్షణలో భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ప్రధాన చలనచిత్ర సంస్థగా చిత్రాలను నిర్మించి ప్రోత్సహించడమే కాకుండా.. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా ద్వారా దేశ సినీ వారసత్వాన్ని కూడా ఇది కాపాడుతోంది.

తరతరాలను, పలు రకాల భాషలను, ప్రాంతాలను ఏకం చేసే శక్తిగా సినిమా అనే మాధ్యమాన్ని హర్ ఘర్ తిరంగా దేశభక్తి చలనచిత్రోత్సవం ద్వారా ఎన్‌ఎఫ్‌డీసీ  ఉపయోగించుకొంటుంది. ప్రజలకు, జాతీయ జెండాకు మధ్య వ్యక్తిగత భావోద్వేగాన్ని పెంపొందించడం.. జెండా ఏగరేసే వేడుకను భారతదేశ విలువలు, చరిత్రతో లోతైన అనుబంధంగా మార్చడం అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా చలనచిత్రోత్సవం ఉంది.

చారిత్రక వాస్తవాలు, కాల్పానిక పాత్రలతో కూడిన దేశభక్తి చిత్రాలు ప్రేక్షకులను చేరేందుకు, స్వేచ్ఛా - సామరస్యాలకు సంబంధించిన భావాలను నిలబెట్టేందుకు భావితరాలను ప్రోత్సహించేందుకు ఎన్‌ఎఫ్‌డీసీ కృషి చేస్తోంది. 

 

***


(Release ID: 2155250)