ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్ల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 11 AUG 2025 11:44AM by PIB Hyderabad

శ్రీ ఓం బిర్లా గారూ, మనోహర్ లాల్ గారూకిరణ్ రిజిజు గారూమహేశ్ శర్మ గారూగౌరవ పార్లమెంటు సభ్యులూలోక్‌సభ ప్రధాన కార్యదర్శి గారూసోదరీ సోదరులారా!

 

కొన్ని రోజుల కిందటే కర్తవ్య పథ్‌లో ఉమ్మడి కేంద్ర సచివాలయం కర్తవ్య భవన్‌ను నేను ప్రారంభించానునేడు నా పార్లమెంటు సహచరుల కోసం ఈ నివాస సముదాయాన్ని ప్రారంభించే అవకాశం కూడా నాకు దక్కింది. ఇక్కడి నాలుగు టవర్లకు కృష్ణగోదావరికోసిహుగ్లీ అని అందమైన పేర్లు కూడా పెట్టారుదేశంలో లక్షలాది ప్రజలకు జీవనాధారమైన నాలుగు గొప్ప నదులవిఆ స్ఫూర్తితో మన ప్రజాప్రతినిధుల జీవితాల్లోనూ ఇప్పుడు ఆనందం చోటుచేసుకుంటుంది. కొంతమందికి అభ్యంతరాలు కూడా ఉండొచ్చు.. ఉదాహరణకుఇక్కడ కోసీ నది పేరుంటే వారికి ఆ నది బదులు బీహార్ ఎన్నికలే కనిపించవచ్చుఅలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తులకు నేనిప్పుడూ అదే చెబుతున్నాను.. నదుల పేర్లు పెట్టే సంప్రదాయం మనల్ని దేశ ఐక్యత సూత్రంతో అనుసంధానిస్తుందిఇది ఢిల్లీలో మన ఎంపీలకు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందిఇక్కడ ఎంపీలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ గృహాల సంఖ్య కూడా పెరుగుతుందిఎంపీలందరికీ శుభాకాంక్షలుఈ ఫ్లాట్ల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లుకార్మికులకు అభినందనలువారంతా ఎంతో శ్రమకోర్చి అంకితభావంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

మిత్రులారా,

మన సహచర ఎంపీలు త్వరలో మారబోయే నమూనా ఫ్లాట్‌ను చూసే అవకాశం నాకు ఈ రోజు వచ్చింది. పాత ఎంపీ నివాసాలను కూడా గతంలో నేను చూశానుపాత నివాసాలు శిథిలావస్థకు చేరాయిఎంపీలు తరచూ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదిఈ కొత్త నివాసాల్లోకి అడుగుపెడితే వారికి సమస్యలు తొలగిపోతాయిఇలాంటి వ్యక్తిగత ఇబ్బందుల నుంచి మన ఎంపీలు బయటపడితేనేప్రజాసమస్యల పరిష్కారం కోసం తమ సమయాన్నిశక్తిని మరింత సమర్థంగా వినియోగిస్తారు.

 

మిత్రులారా,

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఢిల్లీలో ఇల్లు కేటాయించడం ఎంత కష్టంగా ఉండేదో మీ అందరికీ తెలిసిందే. ఈ కొత్త భవనాలతో ఆ సమస్య కూడా తొలగిపోతుందిఈ బహుళ అంతస్తుల భవనాల్లో 180 మందికి పైగా ఎంపీలు ఉండేందుకు అవకాశముందిఅంతేకాకుండా.. ఈ కొత్త నివాసాలకు గణనీయమైన ఆర్థిక కోణం కూడా ఉందిఅనేక మంత్రిత్వ శాఖలు అద్దె భవనాల నుంచే పని చేస్తున్నాయనివాటి అద్దెలకే ఏటా దాదాపు రూ. 1,500 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ఇటీవల కర్తవ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను చెప్పానుఇది ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా వృథాచేయడమేఅలాగేఎంపీ నివాసాలు తగినన్ని లేకపోవడంతో ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతూ ఉండేదిమీరే ఊహించండి ఎంపీలకు ఇళ్ల కొరత ఉన్నప్పటికీ, 2004 నుంచి 2014 వరకు లోక్‌సభ ఎంపీల కోసం ఒక్క కొత్త నివాసాన్ని కూడా నిర్మించలేదుఅందుకే 2014 అనంతరం మేమీ కార్యక్రమాన్ని ఓ లక్ష్యంగా భావించాం. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్లాట్లు సహా 350 ఎంపీ నివాసాలను నిర్మించాంఅంటేఈ నివాసాలు పూర్తయితే ప్రజాధనం కూడా ఆదా అవుతుంది.

 

మిత్రులారా,

21వ శతాబ్దపు భారత్ లక్ష్యాన్ని సాధించడం అత్యావశ్యకంకీలకం కూడానేడు భారత్ కర్తవ్య పథ్కర్తవ్య భవన్‌లను నిర్మిస్తోంది. అలాగేలక్షలాది ప్రజలకు పైపుల ద్వారా నీటినందించే బాధ్యతనూ నిర్వర్తిస్తుందినేడు దేశం ఎంపీల కొత్త ఇళ్ల నిరీక్షణను నెరవేర్చడంతోపాటే.. పీఎం ఆవాస్ యోజన కింద కోట్ల పేద కుటుంబాలకు గృహ సదుపాయాన్నీ కల్పిస్తుందికొత్త పార్లమెంటు భవనంతోపాటు వందలాది కొత్త వైద్య కళాశాలలను కూడా నేడు భారత్ నిర్మిస్తుందిఈ చర్యలన్నీ సమాజంలో ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగిస్తున్నాయి.

మిత్రులారా,

ఈ కొత్త ఎంపీ నివాసాల్లో పర్యావరణ హిత అభివృద్ధి విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం సంతోషాన్నిస్తోంది. ఇది కూడా దేశ పర్యావరణ అనుకూలసురక్షిత భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంసోలార్ ఆధారిత మౌలిక సదుపాయాల నుంచి సౌర శక్తిలో కొత్త రికార్డులు నెలకొల్పడం వరకు.. సుస్థిరాభివృద్ధి లక్ష్యం దిశగా దేశం నిరంతరం పురోగమిస్తోంది.

 

మిత్రులారా,

నాది మరో అభ్యర్థన. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలుప్రాంతాలకు చెందిన ఎంపీలు కలిసి ఉంటారుఇది ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’కు ప్రతీకవివిధ రాష్ట్రాలకు చెందిన పండుగలువేడుకలను ఎప్పటికప్పుడు ఇక్కడే కలసికట్టుగా జరుపుకోవడం ఈ సముదాయానికి శోభనిస్తుందిఆయా కార్యక్రమాలకు మీ నియోజకవర్గ ప్రజలను కూడా ఆహ్వానించవచ్చుమీమీ ప్రాంతీయ భాషల్లోని పదబంధాలను తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందిపర్యావరణంస్వచ్ఛతపరంగా కూడా ఈ సముదాయానికి గుర్తింపు తేవచ్చుఇది మనందరి కర్తవ్యంకేవలం ఎంపీ నివాసాలే కాకుండాసముదాయం మొత్తం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలిఅది ఎంత అద్భుతమో కదా!

 

మిత్రులారా,

మనమంతా ఒకే జట్టుగా కలసి పనిచేయాలని ఆశిస్తున్నాను. అప్పుడు మన ప్రయత్నం దేశానికి ఆదర్శమవుతుందిఎంపీ నివాస సముదాయాల్లో ఏడాదికి రెండుమూడుసార్లు పరిసరాల పరిశుభ్రతపై పోటీలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రిత్వ శాఖనుమీ హౌసింగ్ కమిటీని కోరుతానుఏ బ్లాకు శుభ్రంగా ఉన్నదీ ప్రకటిస్తారుఏడాది తర్వాత అత్యంత పరిశుభ్రంగా ఉన్న బ్లాకునూఅత్యంత చెత్తగా ఉన్న బ్లాకునూ గుర్తించేందుకు కూడా వీలవుతుంది.

 

మిత్రులారా,

కొత్తగా కట్టిన ఈ ఫ్లాట్లను చూడడానికి వెళ్లిన సమయంలో.. లోపలికి వెళ్ళగానే నేనడిగిన మొదటి ప్రశ్న- ‘‘ఇదంతానా?’’ అని. “లేదు సర్ఇది ప్రవేశం మాత్రమేలోపలికి రండి” అని నాతో వాళ్లన్నారునాకు ఆశ్చర్యమేసిందిఅన్ని గదులనూ మీరు నింపనుకూడా లేరని అనుకుంటున్నాఅంత విశాలంగా ఉన్నాయివీటిని సద్వినియోగం చేసుకుంటారనిఈ కొత్త నివాసాలు మీ వ్యక్తిగతకుటుంబ జీవితాలను శోభాయమానం చేస్తాయని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

ధన్యవాదాలు.

 

***


(Release ID: 2155106)