ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కకోరి రైలు పోరాటానికి శతాబ్ది సందర్భంగా దేశభక్తుల ధైర్యసాహసాలను స్మరించుకున్న ప్రధాని మోదీ

Posted On: 09 AUG 2025 2:59PM by PIB Hyderabad

కకోరి రైలు పోరాటం 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పాల్గొన్న భారతీయుల శౌర్యందేశభక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకున్నారు

వంద సంవత్సరాల కిందట కకోరిలో దేశభక్తులైన భారతీయులు ప్రదర్శించిన ధైర్యం వలస పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహాన్ని తెలియజేసిందని అన్నారుప్రజల డబ్బును వలసవాద దోపిడీకి ఉపయోగిస్తున్న తీరును చూసి వారంతా ఆగ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు.

వారి ధైర్యాన్ని భారత ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ప్రధాని వ్యాఖ్యానించారుబలమైనసుసంపన్న భారతదేశం విషయంలో వారి కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ఈ విధంగా పేర్కొన్నారు

"వంద సంవత్సరాల కిందట ఇవాల్టి రోజున కకోరిలో దేశభక్తిగల భారతీయులు చూపించిన ధైర్యం వలస పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలిపిందివలసవాద దోపిడీకి ప్రజల డబ్బును ఉపయోగిస్తున్న తీరును చూసి వారు కోపంతో రగిలిపోయారువారి పరాక్రమాన్ని భారత ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారుబలమైనసుసంపన్న భారత్‌ కోసం వారు కన్న కలలను నెరవేర్చడానికి మేం కృషి చేస్తూనే ఉంటాం."


(Release ID: 2154696)