ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు గత నెలలో చేపట్టిన బ్రెజిల్ పర్యటనను గుర్తు చేసుకున్న మోదీ


వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, పౌర సంబంధాల అంశాల్లో మరింత సహకరించుకునేందుకు అంగీకరించిన ఇద్దరు నేతలు

ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర అవగాహన

Posted On: 07 AUG 2025 9:34PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారుగత నెలలో జరిగిన తన బ్రెజిల్ పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారువాణిజ్యంసాంకేతికతఇంధనంరక్షణవ్యవసాయంఆరోగ్యంపౌర సంబంధాల విషయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ఈ పర్యటనలోనే ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.

దీనికి కొనసాగింపుగా భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతలో ఉన్నట్లు ఇరు దేశాల నేతలు తెలిపారు

ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.

ఒకరికొకరు అందుబాటులో ఉండేందుకు ఇద్దరు నాయకులూ అంగీకరించారు


(Release ID: 2154029)