వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించండి అంటూ పౌరులకు ప్రధాని ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


* ‘‘మనదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కొంటే మన ఉత్పత్తిదారుల ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్ఠమవుతుంది: శ్రీ చౌహాన్

Posted On: 03 AUG 2025 5:22PM by PIB Hyderabad

మన దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కొనండంటూ పౌరులకు ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తిని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు పునరుద్ఘాటించారు. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి 20వ వాయిదాను ఈ నెల 2న వారణాసిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేసిన సందర్భంగా, స్వదేశీ  ఉత్పత్తులనే కొనండంటూ దేశ ప్రజలను కోరారు. ఆర్థికవ్యవస్థను పటిష్ఠపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి మరోసారి స్పష్టంచేస్తూ, ప్రధాని విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. ఒక అధికార ప్రకటనలో మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘ప్రియమైన సోదర, సోదరీమణులు, మేనకోడళ్లు, మేనల్లుళ్లారా.. ప్రతిఒక్కరూ..కీటకాలు, పశు పక్ష్యాదులతో సహా.. తమ కోసం తాము జీవిస్తాయి. అయితే, తన కోసమే తాను బతకడంలో గొప్పేముంది? మనం మన దేశం కోసం జీవించి తీరాలి. దేశం కోసం జీవించడం ఎంత ముఖ్యమో నిన్న మనకు గౌరవ ప్రధాని బోధించారు. మన ఇళ్లలో వాడడానికి మన దేశంలోనే తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే వాడదామంటూ మనకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రియమైన సోదర, సోదరీమణులారా, ఏ వస్తువైనా మీ గ్రామంలో, మీకు దగ్గరలో ఉన్న నగరంలో, మీ జిల్లాలో, మీ  రాష్ట్రంలో, లేదా మన  దేశంలో మరెక్కడైనా సరే, తయారైందంటే.. అలాంటి వాటినే కొనండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతోంది. మనం ఇప్పుడు ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచాం.. అతి త్వరలోనే, మూడో స్థానానికి దూసుకుపోతాం. 144 కోట్ల మంది జనాభా ఉన్న ఈ  దేశం ఒక సువిశాల మార్కెట్. మనం మన దేశంలో తయారైన వస్తువులనే కొని, ఉపయోగిస్తామని సంకల్పించుకొంటే, అప్పుడు మన రైతులు, మన  చిన్న తరహా ఉత్పత్తిదారు సంస్థలు, స్వయంసహాయక బృందాలతో పాటు చేతివృత్తి కళాకారులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వారి ఆదాయం పెరుగుతుంది.  మరి వారి సంపాదన పెరిగితే, మన ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది.

మన డబ్బు విదేశాలకు ఎందుకు దక్కడం? ఆ  డబ్బుతో మన పిల్లలకు బతుకుదెరువును అందిద్దాం. నేను నా దేశం కోసం బతుకుతాను, మీరు కూడా దేశం కోసం బతకాలి.. భారత్‌లో తయారు చేసిన వస్తూత్పత్తులను మాత్రమే కొనండి. మీకు ధన్యవాదాలు.’’    


 

***


(Release ID: 2152089)