ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2025 2:55PM by PIB Hyderabad

దేశ ప్రజలకు గర్వకారణమైన త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన శ్రీ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారుప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం (హర్ గర్ తిరంగాకార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలను కోరారుజెండాతో ఉన్న సెల్ఫీ లేదా ఫోటోలను హర్ గర్ తిరంగా వె‌బ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు

పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నానుమనందరికీ గర్వకారణమైన త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినందుకు ఆయన చిరస్మరణీయుడు!

ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం (హర్‌ గర్ తిరంగాకార్యక్రమాన్ని ఎప్పటిలాగే బలోపేతం చేద్దాంత్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాంమీ సెల్ఫీఫోటోలను హర్‍గర్‌ తిరంగా వై‌బ్‌సైట్‌లో (harghartiranga.comఅప్‌లోడ్ చేయండి.”

 

***


(రిలీజ్ ఐడి: 2151771) సందర్శకుల సూచీ సంఖ్య : : 26