వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రకటన

Posted On: 30 JUL 2025 8:29PM by PIB Hyderabad

ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దాని ప్రభావాలను సునిశితంగా పరిశీలిస్తోంది.

 

గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా దేశాలు ఉభయులకూ న్యాయసమ్మతమైన, సమతౌల్యమైన, ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు కొనసాగిస్తున్నాయి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

భారత రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వర్గం, కార్మికులు, ఎంఎస్‌ఎంఈల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుంది.

 

ఇటీవల యూకేతో కుదుర్చుకున్న తాజా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం సహా గతంలో కుదిరిన ఇతర ఒప్పందాల తరహాలోనే, దేశ హితాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుంది.

 

***


(Release ID: 2150528)