సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌.. సాయుధ దళాలపై పాకిస్థాన్‌ దుష్ప్రచారాన్ని అధికారిక నిజనిర్ధారణ విభాగం ద్వారా ఖండించిన కేంద్ర ప్రభుత్వం


· ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత్‌పై బూటకపు వార్తల గుర్తింపు.. నిరోధం.. కల్పిత వీడియోలమీద నిఘా ద్వారా పాక్‌ దుష్ప్రచారంపై సత్వర ఖండనతోపాటు దీటైన జవాబివ్వడంలో నిరంతరం శ్రమించిన ‘పీఐబీ’ నిజనిర్ధారణ విభాగం

· భారత్‌ వ్యతిరేక ప్రచారానికి తోడ్పడిన 1,400కుపైగా ‘యూఆర్‌ఎల్‌’లను నిరోధించిన ప్రభుత్వం

Posted On: 30 JUL 2025 4:46PM by PIB Hyderabad

బూటకపు వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారం నిరోధానికి ప్రభుత్వం తన పరిధిలోని చట్టబద్ధ, సంస్థాగత యంత్రాంగాల ద్వారా అన్నిరకాల చర్యలూ చేపడుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం, దుష్ప్రచారం భారత్‌ వెలుపలి నుంచి అధికంగా సాగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. తదనుగుణంగా వాటన్నిటినీ అరికట్టడానికి కిందివిధంగా చురుకైన చర్యలు తీసుకుంది:

ప్రామాణిక సమాచార ప్రదానం: నిర్దిష్ట వ్యవధి ప్రకారం పత్రికా-ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో సమావేశాల ద్వారా పౌరులకు సమాచారం అందించింది. రక్షణ దళాల కార్యాచరణ వివరాలను సంబంధిత దృశ్య-శ్రవణ మాధ్యమాలు సహా ఉపగ్రహ చిత్రసహితంగా వివరించింది. ఇవన్నీ ప్రామాణిక సమాచార ప్రదానంలో కీలకాంశాలుగా ఉన్నాయి.

మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం: ఆపరేషన్ సిందూర్ వేళ కేంద్ర మంత్రత్వశాఖలతోపాటు వాటి పరిధిలోని  విభాగాల మధ్య సమన్వయం కోసం కేంద్రీకృత కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలూ పనిచేస్తూ, అన్నిరకాల మాధ్యమ భాగస్వాములకు ప్రత్యక్ష సమాచార ప్రదాన సౌలభ్యం కల్పించింది. ఈ కంట్రోల్ రూమ్‌లో సైనిక, నావిక, వైమానిక దళాల నుంచి నోడల్ ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ మీడియా విభాగాల అధికారులు, పత్రికా సమాచార సంస్థ (పీఐబీ) అధికారులు ఉన్నారు. నకిలీ వార్తలు, తప్పుడు సమాచార విస్తృతికి దోహదం చేసే సామాజిక మాధ్యమాల నిర్వహణ-పోస్టులను వీరు ఎప్పటికప్పుడు చురుగ్గా గుర్తిస్తూ వచ్చారు.

నిజనిర్ధారణ యూనిట్‌ (ఎఫ్‌సీయూ)


భారత్‌ సహా సాయుధ దళాలపై పాకిస్థాన్‌ దుష్ప్రచారాన్ని నిజనిర్ధారణ విభాగం తక్షణం ఖండిస్తూ వచ్చింది. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా శల్యపరీక్షతో అనేక పోస్టులలో నిజానిజాలను తనిఖీ చేసింది. ఆపరేషన్ సిందూర్‌ సంబంధిత తప్పుడు సమాచారం లేదా వార్తలకు దారితీసే లింకులను ‘ఎఫ్‌సీయూ’ నిశితంగా తనిఖీ చేసింది. తదుపరి తగిన చర్యల దిశగా సంబంధిత మధ్యవర్తులతో సమాచారాన్ని తక్షణం పంచుకుంది.

ఈ నిజనిర్ధారణ యూనిట్ కృషిని మీడియా సంస్థలు కూడా ప్రశంసించాయి. దీనికి సంబంధించి కొన్ని కథనాల శీర్షికలు, లింకులను దిగువన చూడవచ్చు:

 

“India's FCU battles Pakistan's digital propaganda with swift rebuttals following 'Operation Sindoor”

https://www.newindianexpress.com/nation/2025/May/10/indias-fcu-battles-pakistans-digital-propaganda-with-swift-rebuttals-following-operation-sindoor

“Govt fact-checking unit swings into action in the wake of Operation Sindoor to highlight false claims”

https://www.livemint.com/industry/media/india-pib-govt-fact-checking-unit-operation-sindoor-misinformation-false-claims-11746770729519.html

“How India is fighting Pakistan’s disinformation campaign”

https://www.hindustantimes.com/india-news/how-india-is-fighting-pakistan-s-disinformation-campaign-101746644575505.html

దుష్ప్రచార నిరోధం

కొన్ని సామాజిక మాధ్యమాల.. ముఖ్యంగా భారత్‌ వెలుపలి నుంచి పనిచేసే హ్యాండిళ్లు తప్పుడు.. హానికర సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు తేలింది. సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం... భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లు, పోస్టులను నిరోధించడానికి ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేసింది.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా డిజిటల్ మీడియాలో 1,400కుపైగా ‘యూఆర్‌ఎల్‌’లను అడ్డుకోవాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ ‘యూఆర్‌ఎల్‌’ల సారాంశంలో నకిలీ, తప్పుదోవ పట్టించే భారత వ్యతిరేక వార్తలున్నాయి. ప్రధానంగా పాకిస్థాన్‌లోని సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టే, భారత సాయుధ దళాల వ్యతిరేక సారాంశం ఉంది.

మీడియాకు సూచన

జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రత దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 26న అన్ని మీడియా చానెళ్లకు ఒక సూచన జారీచేసింది.

కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు లోక్‌సభలో ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(Release ID: 2150478)