ప్రధాన మంత్రి కార్యాలయం
పీఆర్ఎస్- 2024పై వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నైపుణ్య ఆధారిత, సమ్మిళిత విద్య దిశగా అద్భుత ప్రణాళిక అంటూ ప్రశంస
Posted On:
30 JUL 2025 1:32PM by PIB Hyderabad
కేవలం నమోదులకే పరిమితం కాకుండా, వాస్తవిక అభ్యసనం దిశగా భారత్ తన విద్యా వ్యవస్థను పునర్నిర్వచించుకుంటోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్రీయ విజ్ఞానంతో విద్యార్థిని పురోగమనంలో నిలపడమే కాకుండా.. సత్ఫలితాలనివ్వగల, జిల్లా స్థాయి కార్యాచరణతో సమ్మిళిత, నైపుణ్య ఆధారిత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం ప్రణాళికల రూపకల్పన లక్ష్యంగా పెట్టుకున్న పీఆర్ఎస్- 2024పై ప్రశంసలు కురిపిస్తూ ప్రధానమంత్రి ఓ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదురి చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ, ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“కేవలం నమోదులకే పరిమితం కాకుండా, వాస్తవిక అభ్యసనం దిశగా భారత్ తన విద్యా వ్యవస్థను పునర్నిర్వచించుకుంటోంది. శాస్త్రీయ విజ్ఞానంతో విద్యార్థిని పురోగమనంలో నిలపడంతోపాటు మంచి ఫలితాలనిచ్చేలా, జిల్లా స్థాయి కార్యాచరణతో సమ్మిళిత, నైపుణ్య ఆధారిత విద్యా వ్యవస్థ దిశగా ప్రణాళికల రూపకల్పన లక్ష్యంగా పీఆర్ఎస్- 2024 కృషిని తన తాజా వ్యాసంలో కేంద్ర మంత్రి శ్రీ @jayantrld చర్చించారు.
***
(Release ID: 2150246)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam