సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అధీకృత వార్తలను ఉచితంగా పొందేందుకు పీబీ-శబ్ద్‌లో నమోదు చేసుకోవాలని వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానెళ్లకు విజ్ఞప్తి

Posted On: 23 JUL 2025 7:02PM by PIB Hyderabad

అధీకృత వార్తలుమల్టీమీడియా సమాచారాన్ని ఉచితంగా పొందేందుకు వార్తా ప్రసార వేదిక అయిన ‘ప్రసార భారతి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిసెమినేషన్ (పీబీ-శబ్ద్)’లో నమోదు చేసుకోవాలని దేశవ్యాప్తంగా వార్తాపత్రికలుమ్యాగజైన్లుటీవీ ఛానళ్లను ప్రసార భారతి ఆహ్వానిస్తోంది.

2024 మార్చిలో ప్రారంభించిన పీబీ-శబ్ద్ 40కి పైగా కేటగిరీల్లో వివిధ భారతీయ భాషల్లో రోజూ 800కు పైగా వార్తా కథనాలను అందిస్తోందికీలకమైన జాతీయఅంతర్జాతీయ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలుభద్రపరచి ఉంచిన అనేక వీడియోలూచిత్రాలూక్రమం తప్పకుండా ప్రచురితమయ్యే వివరణాత్మకపరిశోధనాత్మక కథనాలు కూడా ఇందులో ఉంటాయిఉపయోగించుకోగలిగే విధంగానే కంటెంటును అందుబాటులో ఉంచుతారుఇది మీడియా సంస్థలుకంటెంట్ సృజనకారులకు అది సులభంగా అందుబాటులో ఉంటుంది.

సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో.. ప్రామాణికమైనసులభగ్రాహ్యమైన సమాచారం విస్తృతంగా ప్రసారమయ్యేలా చూసుకునేందుకు ప్రముఖ మీడియా సంస్థలన్నింటినీ ఇందులో చేర్చేందుకు ప్రాధాన్యమిచ్చారు.

మీడియా సంస్థలు shabd.prasarbharati.org లో దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అధికారిక సమాచార పత్రాన్ని ఇక్కడ చూడొచ్చు:

https://shabd.prasarbharati.org/public/assets/E-brochure_SHABD_balanced%20final_web.pdf

shabd.prasarbharati.org/register లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం సంప్రదించండిశ్రీమతి జయంతి ఝాపీబీశబ్ద్ సహాయక సంచాలకులు-మెయిల్jha.jayanti16[at]gmail[dot]com

 

***


(Release ID: 2147624)