ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రశేఖర్ ఆజాద్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JUL 2025 9:43AM by PIB Hyderabad
చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘స్వాతంత్ర్య సాధనకు భారత్ చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చాలా విలువైంది. న్యాయం పక్షాన ధైర్య సాహసాలతో, దృఢ విశ్వాసంతో నిలిచేలా మన దేశ యువతకు ఆయన ప్రేరణను కూడా అందించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ:
‘‘చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా. సాటిలేని పరాక్రమానికి, ధీరత్వానికి ఆయన మారుపేరు. స్వాతంత్ర్య సాధనకు మన దేశం చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో విలువైంది. న్యాయం పక్షాన ధైర్య సాహసాలతో, దృఢ విశ్వాసంతో నిలిచేలా మన దేశ యువతకు ఆయన ప్రేరణను అందించారు’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2147226)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam