ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఫౌజా సింగ్ మృతికి ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 15 JUL 2025 9:29AM by PIB Hyderabad

శ్రీ ఫౌజా సింగ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారుఆయన అసాధారణ వ్యక్తిత్వంఅచంచలమైన స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారుఆయన గొప్ప సంకల్పం కలిగిన విలక్షణమైన క్రీడాకారుడని ప్రధాని ప్రశంసించారు.

ఎక్స్‌లో ఆయన చేసిన పోస్టు:

‘‘అనుపమానమైన వ్యక్తిత్వంప్రవర్తన కలిగిన అసాధారణమైన వ్యక్తి ఫౌజా సింగ్అత్యంత ముఖ్యమైన ఫిట్‌నెస్ విషయంలో భారతీయ యువతకు ఆదర్శంగా నిలిచారుగొప్ప సంకల్పం కలిగిన విలక్షణ క్రీడాకారుడుఆయన మృతి బాధాకరంఆయన కుటుంబంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాకమైన అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.’’


(రిలీజ్ ఐడి: 2146209) సందర్శకుల సూచీ సంఖ్య : : 11