రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నిషిద్ధ జాబితా తయారు చేయడంలో భాగంగా... ‘లూజ్ ఫాస్టాగ్’ సమాచారం పంపండి: ఎన్‌హెచ్ఏఐ
Posted On:
11 JUL 2025 1:17PM by PIB Hyderabad
టోల్ గేట్ల వద్ద వాహనాల రాకపోకలు సజావుగా సాగిపోయేటట్లు చూడడంతో పాటు ‘‘లూజ్ ఫాస్టాగ్స్’’ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఎన్‌హెచ్‌ఏఐ నడుం బిగించింది. టోల్ వసూలు చేసే ఏజెన్సీలు, అనుమతిని పొందిన వ్యాపార సంస్థల (కన్సెషనర్ల) విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మెరుగుపరిచింది. ‘‘లూజ్ ఫాస్టాగ్’’లను ప్రదర్శిస్తున్న వారి వివరాలను సేకరించి వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించింది. ట్యాగులను వాహన విండ్‌షీల్డుకు అంటించకుండా, చేతుల్లో పట్టుకు చూపడాన్ని ‘లూజ్ ఫాస్టాగ్స్’గా వ్యవహరిస్తున్నారు. వీటిని సాధారణంగా ‘‘ట్యాగ్-ఇన్-హ్యాండ్’’ అన్నా ఇదే. త్వరలో వార్షిక పాస్ సిస్టమ్‌ను, మల్టి-లేన్ ఫ్రీ ఫ్లో టోల్‌ను అమల్లోకి తీసుకు రానున్నారు. అందువల్ల ఫాస్టాగ్ ప్రామాణికతతో పాటు వ్యవస్థను మరింత విశ్వసనీయమైందిగా తీర్చిదిద్దాలంటే ముందుగా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
వాహనాల యజమానులు కొన్ని సందర్భాల్లో కావాలనే ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పైన అంటించడంలేదు. దీంతో ఆయా మార్గాల్లో రద్దీ పెరగడం, తప్పుగా వసూలు చేసిన అధిక ఛార్జిని బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సిరావడం, మూసివేసిన టోల్ వ్యవస్థ దుర్వినియోగంతో పాటు ఎలక్ట్రానిక్ టోల్ వసూలులో అంతరాయాలు తలెత్తుతున్నాయి. టోల్ ప్లాజాల్లో అనవసర జాప్యం చోటుచేసుకుంటున్నది. ఈ పరిస్థితి ఇతరులకు ఇబ్బందికరంగానూ మారుతోంది.
ఒక ప్రత్యేక ఇమెయిల్ ఐడీని అందుబాటులోకి తేవడం ద్వారా... లూజ్ ఫాస్టాగ్స్ సమాచారాన్ని అందించాలంటూ ఎన్హెచ్ఏఐ ఆదేశించింది. లూజ్ ఫాస్టాగ్‌ల యజమానులను బ్లాక్‌లిస్టు లేదా హాట్‌లిస్టులో ఉంచనున్నారు.
98 శాతానికి పైగా ఫాస్ట్ ట్యాగులను ఉపయోగించడం వల్ల... టోల్ వసూళ్లకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వ్యవస్థలో పెనువిప్లవాన్ని తీసుకువచ్చింది. అయితే లూజ్ ఫాస్టాగ్‌లు ఎలక్ట్రానిక్ విధానానికి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో టోల్ కార్యకలాపాల్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దినట్లయితే, జాతీయ రహదారుల వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రయాణాలు సజావుగా సాగుతాయి.
***
(Release ID: 2144249)
Read this release in:
Malayalam
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Tamil