ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 09 JUL 2025 6:02AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారుబ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారుఅధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.
పరిమితమైనప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో ప్రధానమంత్రిఅధ్యక్షుడు లూలా పాల్గొన్నారుభారత్బ్రెజిల్ మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారురెండు దేశాల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను పునరుద్ఘాటించారువాణిజ్యంపెట్టుబడులురక్షణ రంగంభద్రతమౌలిక వసతుల అభివృద్ధిడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలుయూపీఐసంప్రదాయ వైద్యంయోగాక్రీడా సంబంధాలుసంస్కృతిప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో సహకారంపై ఇరువురు నాయకులు చర్చించారుకీలకమైన ఖనిజాలునూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఏఐసూపర్ కంప్యూటర్లుడిజిటల్ భాగస్వామ్యంవాహన రంగం తదితర ఆధునిక రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాన్ని వారు అన్వేషించారు.
వాణిజ్యంవ్యాపారాంశాల్లో చర్చలు నిర్వహించడానికి మంత్రిత్వ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇద్దరూ స్వాగతించారుభారత్-మెర్కోసుర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం విస్తరణతో సహా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారువచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారుఇంధన రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారుఅలాగే హైడ్రో కార్బన్పునురుత్పాదక రంగాల్లో రెండు దేశాలకు అపారమైన సామర్థ్యం ఉన్న నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు అంగీకరించారు.
2025, 
ఏప్రిల్ నెలలో పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన క్రూరమైన దాడి అనంతరం భారత్‌కు సంఘీభావంమద్దతు అందించిన బ్రెజిల్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారుఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవాలనే రెండు దేశాల దృఢచిత్తాన్ని తెలియజేస్తోందిఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించరాదనిఇలాంటి అమానవీయ చర్యలను ప్రోత్సహించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఉగ్రవాదంతో పోరాటం చేయడానికిదాన్ని అంతమొందించడానికి అంతర్జాతీయ సమాజంతో కలసి రెండు దేశాలు పని చేయడానికి అధ్యక్షుడు లూలా అంగీకరించారు.

ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై తమ ఆలోచనలను నాయకులిద్దరూ పంచుకున్నారుబహుపాక్షిక విధానంఐక్యరాజ్యసమితి భద్రతామండలితో సహా అంతర్జాతీయ పాలనా సంస్థలను సంస్కరించడం పట్ల తమ నిబద్ధతను తెలియజేశారువాతావారణ మార్పులను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ చర్యలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారుకాప్30 వాతావరణ మార్పుల సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో బ్రెజిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారుగ్లోబల్ సౌత్ ఆసక్తులను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.

చర్చల అనంతరంఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంభద్రతా సంబంధమైన సమాచార మార్పిడివ్యవసాయ పరిశోధనపునరుత్పాదక ఇంధనమేధోసంపత్తి హక్కులుడిజిటల్ సహకారం (ఇండియా స్టాక్రంగాల్లో ఆరు ఎంవోయూలు [వివరాలను ఇక్కడ చూడొచ్చుఖరారయ్యాయిఅధికారిక పర్యటనలో సంయుక్త ప్రకటన [లింక్జారీ చేశారు.
ప్రధానమంత్రి గౌరవార్థం అధ్యక్షుడు లూలా విందును ఏర్పాటు చేశారుఅధ్యక్షుడు లూలా ఆతిథ్యానికి ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారుభారత్‌ను సందర్శించాలని ఆహ్వానించారు.

 

***


(Release ID: 2143547)