ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ అత్యున్నత జాతీయ పురస్కారం


* అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను

అందించిన మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు...

ఈ సత్కారం మన రెండు దేశాల మధ్య శాశ్వతమైన, బలమైన స్నేహానికి ప్రతీక. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నాను: పీఎం
* ఇక్కడి భారతీయ సమాజం నేటికీ మన ఉమ్మడి సంప్రదాయాలను, సంస్కృతిని, ఆచారాలను కాపాడుకోవడం గర్వకారణం... ఈ సమాజానికి అధ్యక్షురాలు కంగలూ జీ, ప్రధానమంత్రి కమ్లా జీ అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు: ప్రధాని

* క్యారికాంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ భారత్‌కు ట్రినిడాడ్ అండ్ టొబాగో ముఖ్యమైన భాగస్వామి, మా మధ్య సహకారం గ్లోబల్ సౌత్ మొత్తానికి ముఖ్యమైనది: పీఎం

Posted On: 04 JUL 2025 9:17PM by PIB Hyderabad

పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని అధ్యక్ష భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’’ను ఆ దేశ అధ్యక్షురాలు గౌరవ క్రిస్టీన్ కార్లా కంగలూ ఓఆర్‌టీటీ ప్రధానం చేశారుఆయన రాజనీతిగ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలకు మద్దతుభారత్ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య సంబంధాలను బలోపేతానికి చేసిన అసాధారణ కృషికిగాను ఈ పురస్కారాన్ని అందించారుదీన్ని స్వీకరించిన తొలి విదేశీయుడిగా ప్రధాని నిలిచారు.

1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి స్వీకరించారుఅలాగే రెండు దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహబంధానికి ఈ గౌరవాన్ని అంకితం చేశారుఈ ప్రత్యేక సంబంధాలు 180 ఏళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన భారతీయుల ఉమ్మడి చరిత్రసాంస్కృతిక వారసత్వంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారుభారత్ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల తన నిబద్దతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాఆమె మంత్రి వర్గంలోని సభ్యులుపార్లమెంటు సభ్యులుఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

 

***

MJPS/ST


(Release ID: 2142477)