రాష్ట్రపతి సచివాలయం
డ్యురాండ్ కప్ టోర్నమెంట్ ట్రోఫీలను ఆవిష్కరించిన రాష్ట్రపతి
Posted On:
04 JUL 2025 12:25PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ రోజు (2025, జులై 4) జరిగిన కార్యక్రమంలో డ్యురాండ్ కప్ టోర్నమెంట్ 2025 ట్రోఫీలను శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.
క్రీడలు క్రమశిక్షణను, పట్టుదలను, బృంద స్ఫూర్తిని పెంచుతాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజలను, ప్రాంతాలను, దేశాలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని అన్నారు. భారత్లో జాతీయ ఐక్యతకు క్రీడలు శక్తిమంతమైన సాధనాలుగా ఆమె అభివర్ణించారు. ఒలింపిక్స్ లేదా అంతర్జాతీయ క్రీడల్లో త్రివర్ణ పతాకం ఎగురుతుంటే తోటి పౌరులంతా పులకరించిపోతారని వివరించారు.
లక్షలాది మంది హృదయాల్లో ఫుట్‌బాల్‌కు ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇది ఓ క్రీడాంశం మాత్రమే కాదు.. ఓ ఉద్వేగం. ఫుట్‌బాల్ అంటే సమష్టి లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహం, సహనం, అందరూ కలసి పనిచేయడమని పేర్కొన్నారు. డ్యురాండ్ కప్ లాంటి పోటీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా.. తర్వాత తరం ఫుట్‌బాల్ క్రీడాకారులను తయారు చేస్తాయని, వారు ఎదిగేందుకు అవసరమైన వేదికను అందిస్తాయని రాష్ట్రపతి అన్నారు.. డ్యురాండ్ కప్‌ను సజీవంగా ఉంచడంలో, దాన్ని స్ఫూర్తిని కొనసాగించడంలో భద్రతాదళాలు పోషిస్తున్న పాత్రను ఆమెను ప్రశంసించారు.


(Release ID: 2142202)
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam