ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భోజ్‌పురి చౌతాళ్ ప్రదర్శనకు ప్రధానమంత్రి ప్రశంసలు

Posted On: 04 JUL 2025 9:06AM by PIB Hyderabad

ట్రినిడాడ్ టొబాగోకుభారతదేశానికి మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలకు గుర్తుగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ప్రదర్శించిన ‘భోజ్‌పురి చౌతాళ్’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ సంగీత కార్యక్రమం ఇరు దేశాల మధ్య వేళ్లూనుకొన్న బంధాలకుప్రత్యేకించి బీహార్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాల్లో తరాల తరబడి వర్ధిల్లిన భోజ్‌పురి సంప్రదాయాలకు అద్దం పట్టింది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

సాటి లేని సాంస్కృతిక అనుబంధమిది..

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భోజ్‌పురి చౌతాళ్ ప్రదర్శనను చూడటం పట్ల సంతోషంగా ఉందిట్రినిడాడ్ టొబాగోకుభారత్‌కు మధ్య బంధంప్రత్యేకించి బీహార్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాల మధ్య పెనవేసుకొన్న అనుబంధం చెప్పుకోదగ్గది’’ అని పేర్కొన్నారు.‌

 

"एगो अनमोल सांस्कृतिक जुड़ाव !

बहुत खुशी भइल कि पोर्ट ऑफ स्पेन में हम भोजपुरी चौताल प्रस्तुति के प्रदर्शन देखनी. त्रिनिदाद एंड टोबैगो आ भारत, खास करके पूर्वी यूपी आ बिहार के बीच के जुड़ाव उल्लेखनीय बा।"

*****


MJPS/ST


(Release ID: 2142178)