ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వామి వివేకానంద గారి వర్ధంతి.. ప్రధానమంత్రి నివాళులు

నాడు పోస్టు చేయడమైనది: 04 JUL 2025 8:50AM by PIB Hyderabad

స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారుమన సమాజం ఎలా రూపుదిద్దుకోవాలనే విషయంలో స్వామి వివేకానంద గారి ఆలోచనలుదార్శనికత మనకు దారి దీపంలా నిలిచి ఉన్నాయని ఆయన అన్నారుమన చరిత్ర పట్లమన సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్నీఆత్మవిశ్వాస భావననూ ఆయన జాగృతం చేశారని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నానుమన సమాజం ఎలా రూపుదిద్దుకోవాలనే విషయంలో స్వామి వివేకానంద గారి ఆలోచనలుదృష్టికోణం మనకు దారి దీపం లాంటివిమన చరిత్ర పట్లమన సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్నీఆత్మవిశ్వాస భావననూ ఆయన జాగృతం చేశారుసేవాపథంలో ముందు ముందుకు సాగిపోతూ ఉండాలనీఅలాగే కరుణమార్గాన్ని అనుసరించాలనీ కూడా ఆయన ఉద్ఘాటించారు’’ అని పేర్కొన్నారు. ‌

 

****


MJPS/ST


(రిలీజ్ ఐడి: 2142061) సందర్శకుల సూచీ సంఖ్య : : 33