ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఘనా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన... ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం

Posted On: 03 JUL 2025 2:35AM by PIB Hyderabad

గౌరవనీయులైన అధ్యక్షులు జాన్ మహామాకు,
రెండు దేశాల ప్రతినిధులకు,
పాత్రికేయ మిత్రులకు,
నమస్కారం!
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించారు.
ఈ అవకాశం లభించడం నాకు గర్వకారణం.
"
अय्य मे अनेजे से मेवोहा”
ఘనాలో నాకు లభించిన ఆత్మీయతగౌరవానికి నేను కృతజ్ఞుడను.
అధ్యక్షుడే స్వయంగా విమానాశ్రయానికి వచ్చి నాకు స్వాగతం చెప్పడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను.
2024 
డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రెండోసారి మహామా ఎన్నికయ్యారుఈ ఘన విజయం సాధించిన ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆయన దార్శనికతనాయకత్వంపై ఘనా ప్రజలకు ఉన్న గొప్ప విశ్వాసాన్ని ఈ విజయం తెలియజేస్తుంది.
స్నేహితులారా,

భారత్, ఘనా స్నేహసంబంధాల్లో మన ఉమ్మడి విశ్వాసాలుపోరాటాలుసమ్మిళిత భవిష్యత్తు కోసం సమష్టి కల ఉన్నాయి.
మా దేశాల్లో సాగించిన స్వాతంత్ర్య పోరాటాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.
పశ్చిమాఫ్రికా ‘ఆశాకిరణం’గా శక్తిమంతమైన ఘనా ప్రజాస్వామ్యం నేటికీ నిలుస్తోంది.
మా ద్వైపాక్షిక సంబంధాలను ‘‘సమగ్ర భాగస్వామ్యం’’గా మార్చాలని అధ్యక్షులు, నేను ఈ రోజు నిర్ణయించాం.
ఘనా దేశ నిర్మాణ ప్రయాణంలో భారత్ మద్దతుదారుగా మాత్రమే కాదు సహ ప్రయాణికురాలుగాను ఉంది.

గ్రాండ్ జూబ్లీ హౌస్, ఫారిన్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్కొమెడ చక్కెర కర్మాగారంభారత్-ఘనా కోఫీ అన్నన్ ఐసీటీ సెంటర్తెమా పకదాన్ రైల్వే లైన్ ఇవి మా భాగస్వామ్య నిర్మాణానికి ప్రతీకలు.
మా ద్వైపాక్షిక వాణిజ్యం బిలియన్ అమెరికా డాలర్లను అధిగమించింది.
దాదాపు 900 ప్రాజెక్టుల్లో భారత సంస్థలు సుమారు బిలియన్ అమెరికా డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి.
వచ్చే అయిదేళ్లలో మా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని ఈ రోజు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
ఫిన్‌టెక్ రంగంలో, యూపీఐ డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌కున్న అనుభవాన్ని ఘనాతో పంచుకొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
స్నేహితులారా,
మా భాగస్వామ్యంలో అభివృద్ధే కీలకమైన అంశం.
ఆర్థిక పునర్నిర్మాణం’లో అధ్యక్షుడు మహామా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతుసహకారం అందిస్తుందని హామీ ఇస్తున్నాను.
ఘనాలో ఐటీఈసీఐసీసీఆర్ ఉపకారవేతనాలను రెట్టింపు చేయాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం.
యువతకు వృత్తి విద్యను అందించేందుకు ఏర్పాటు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం పనులు ప్రారంభమవుతాయి.
వ్యవసాయ రంగంలో అధ్యక్షుడు మహామా అమలు చేస్తున్న ‘‘ఫీడ్ ఘనా’’ కార్యక్రమానికి మద్దతు అందించడం మాకు సంతోషదాయకం.
జన ఔషధీ కేంద్రాల ద్వారా అందుబాటు ధరల్లోనమ్మకమైన ఆరోగ్య సేవలను ఘనా ప్రజలకు అందిస్తామని భారత్ ప్రతిపాదిస్తోంది.
టీకాల ఉత్పత్తిలో సహకారంపై మేం చర్చించాం.
రక్షణభద్రత రంగాల్లో ‘‘స్థిరత్వం ద్వారా భద్రత’’ మంత్రంతో మేం ముందుకు వెళ్తున్నాం.
భద్రతా దళాలునౌకా వాణిజ్య భద్రతరక్షణ పరికరాలుసైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో సహకారం విస్తరిస్తాం.
కీలకమైన ఖనిజాల అన్వేషణ, తవ్వకంలో భారతీయ సంస్థలు సహకారం అందిస్తాయి.
అంతర్జాతీయ సౌర కూటమివిపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన సమితి లాంటి వేదికల్లో ఇప్పటికే భారత్ఘనా సహకరించుకుంటున్నాయి.
పునరుత్పాదక ఇంధనం ముఖ్యంగా స్వచ్ఛ వంట గ్యాస్ విషయంలో ఘనా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ప్రోత్సాహం అందించేందుకు గాను అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమిలోకి ఆ దేశాన్ని ఆహ్వానిస్తున్నాం.
స్నేహితులారా,

మేమిద్దరం గ్లోబల్ సౌత్‌లో సభ్యదేశాలమే. దాని ప్రాధాన్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఘనాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందడం మాకు గర్వకారణం.
సాహెల్ ప్రాంతంతో సహా ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై మేం చర్చలు చేపట్టాంమానవాళికి ప్రధాన శత్రువు ఉగ్రవాదమే అన్న అభిప్రాయంలో మేం ఐక్యంగా ఉన్నాం.
ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో ఘనా అందిస్తున్న సహకారానికి మేం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ సందర్భంగాఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో మా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాంఐక్యరాజ్యసమితి సంస్కరణలకు సంబంధించి మా ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి.
పశ్చిమాసియాఐరోప దేశాల్లో నెలకొన్న సంఘర్షణలపై మా ఆందోళనలను వ్యక్తం చేశాంఇది యుద్ధాల సమయం కాదని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం.
చర్చలు, దౌత్య విధానాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి.
స్నేహితులారా,
మన రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను ఘనాలోని భారతీయ సమాజం ప్రతిబింబిస్తుంది.
ఎన్నో సంవత్సరాలుగా భారతీయ ఉపాధ్యాయులువైద్యులుఇంజినీర్లు ఘనాలో తమ సేవలు అందిస్తున్నారు.
ఘనా ఆర్థికసామాజిక అభివృద్ధిలో భారతీయ సమాజం సానుకూల భాగస్వామ్యాన్ని అందిస్తోందిఇక్కడి భారతీయులతో రేపు జరిగే సమావేశం కోసం నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.
గౌరవనీయులైన అధ్యక్షులకు,
మీరు భారత్‌కు సన్నిహితుడుభారత్‌తో మీకు బాగా పరిచయం ఉంది.
మిమ్మల్ని భారత్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నానుమీకు ఆతిథ్యమిచ్చే అవకాశం మాకు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను.
మరోసారినాకు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన ఘనా ప్రభుత్వంప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.

సూచన: ప్రధానమంత్రి హిందీలో చేసిన అనువాదానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2141745) Visitor Counter : 3