ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంత ప్రయోగం పట్ల ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
25 JUN 2025 1:29PM by PIB Hyderabad
భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను సందర్శించబోయే తొలి భారతీయుడు, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు.
ఎక్స్ వేదికపై ప్రధాని తమ సంతోషాన్ని వెలిబుచ్చుతూ:
“భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంత ప్రయోగం సంతోషాన్ని కలిగిస్తోంది.
భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే తొలి భారతీయుడు కానున్నారు. 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలు, ఆశలు, ఆశయాలు అతని వెంటే ఉన్నాయి.
శుభాంశు, అతని సహచర వ్యోమగాములకు శుభాకాంక్షలు!” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2139830)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam