ప్రధాన మంత్రి కార్యాలయం
లండన్‌లో వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్.. బ్లిట్జ్ సెమీ ఫైనల్‌లో దివ్యా దేశ్‌ముఖ్ అద్భుత విజయం.. ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
19 JUN 2025 2:00PM by PIB Hyderabad
లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌పై చారిత్రక గెలుపును సాధించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌ను ఓడించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌కు ఇవే అభినందనలు. ఆమె గెలుపు ఆమె ధైర్యాన్నీ, దృఢ సంకల్పాన్నీ చాటిచెబుతున్నది. ఈ విజయం చాలా మంది వర్ధమాన చదరంగం క్రీడాకారులకు ప్రేరణను ఇస్తుంది. రాబోయే కాలంలో ఆమె తన ప్రయత్నాల్లో రాణించాలని కోరుకుంటూ, ఆమెకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.@DivyaDeshmukh05’’
(Release ID: 2137666)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam