ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ కార్మిక రంగ శ్రేయస్సే లక్ష్యంగా గత 11 ఏళ్ళలో జరిగిన విధాన నిర్ణయాలు, ప్రణాళికలు, అభివృద్ధి పనుల తీరును తెలిపే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 JUN 2025 5:37PM by PIB Hyderabad

దేశ కార్మిక రంగ శ్రేయస్సే లక్ష్యంగా గత 11 ఏళ్ళలో జరిగిన విధాన నిర్ణయాలు, ప్రణాళికలు, అభివృద్ధి పనుల తీరును తెలిపే ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. ప్రభుత్వం అనుసరించిన  కొత్త వైఖరి వల్ల ఉపాధి కల్పనలో, సామాజిక సంక్షేమ పథకాల విస్తృతిలో చారిత్రాత్మక ప్రగతి గోచరించిందని శ్రీ మోదీ వివరించారు.

కేంద్రమంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ ఎక్స్ పోస్టుకు స్పందిస్తూ...

“కేంద్రమంత్రి డాక్టర్ @mansukhmandviya అందించిన వ్యాసంలో, దేశ కార్మిక రంగ శ్రేయస్సు పరమావధిగా గత 11 సంవత్సరాల్లో జరిగిన విధాన నిర్ణయాలు, ప్రణాళికలు, అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఈ వైఖరి వల్ల ఉపాధి కల్పనలో, సామాజిక సంక్షేమ పథకాల విస్తృతిలో చారిత్రాత్మక ప్రగతి గోచరించింది. తప్పక చదవండి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 


(రిలీజ్ ఐడి: 2137500) సందర్శకుల సూచీ సంఖ్య : : 19