ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్ లో ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 16 JUN 2025 9:10PM by PIB Hyderabad

గౌరవనీయ ప్రెసిడెంట్ గారు,

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ను ఇచ్చినందుకు మీకుసైప్రస్ ప్రభుత్వానికిసైప్రస్ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇది ఒక్క నరేంద్ర మోదీకి ఇచ్చిన సత్కారం కాదుఇది 140 కోట్ల మంది భారతీయులకు బహూకరించిన సన్మానంఇది వారి బలానికీఆకాంక్షలకూ గుర్తింపుఇది మా ఘన సాంస్కృతిక వారసత్వానికీ, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మా దర్శనానికీ గుర్తింపు.

దీనిని భారత్సైప్రస్‌ మైత్రీ సంబంధాలకుమన ఉమ్మడి విలువలతో పాటు మన పరస్పర అవగాహనకూ నేను అంకితం చేస్తున్నాను.

ఈ పురస్కారాన్ని భారతీయులందరి పక్షాన సవినయంగానుకృతజ్ఞ‌తతోను అందుకొంటున్నాను.

శాంతిభద్రతసార్వభౌమత్వంప్రాదేశిక సమగ్రతలతో పాటు మా ప్రజల సమృద్ధికి ఒక ప్రతీక ఈ అవార్డు.

గౌరవనీయా,

భారత్సైప్రస్‌ మైత్రీ బంధాలను బలపరచడంలో ఒక బాధ్యతగా ఈ గౌరవాన్ని నేను స్వీకరిస్తున్నాను.

రాబోయే కాలంలో మన భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకొంటుందని నేను నమ్ముతున్నానుమరిమనం కలసికట్టుగామన దేశాల అభివృద్ధికే కాకుండా ప్రపంచ శాంతిభద్రతల కోసం కూడా కృషి చేద్దాం.

ఈ సత్కారాకిగాను మరోసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞ‌తలు తెలియజేస్తున్నాను.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

గమనిక ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు సుమారు అనువాదంప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు.

 

***


(रिलीज़ आईडी: 2136926) आगंतुक पटल : 49
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam