ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్‌లో రెండు కొత్త రాంసర్ ప్రదేశాలను చేర్చడంపై ప్రధాని హర్షం
Posted On:
04 JUN 2025 10:28PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని ఫలోదీ లోని ఖీజన్, ఉదయ్‌పూర్‌లోని మేనార్ చిత్తడి ప్రాంతాలను ప్రతిష్ఠాత్మక రాంసర్ ప్రదేశాల్లో చేర్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భారత్ కొనసాగిస్తోన్న పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రెండు ప్రాంతాలతో కలిపి భారత్‌లో రాంసర్ ప్రదేశాలు మొత్తం 91 ఉన్నాయి.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ అంశాన్ని ఎక్స్‌లో ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రధాని మోదీ అంకితభావానికి ఇది నిదర్శనమని అన్నారు.
ఈ పోస్టుకు పీఎం మోదీ స్పందన:
‘‘శుభవార్త! పర్యావరణ పరిరక్షణలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది’’.
(Release ID: 2136216)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada