ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లో రెండు కొత్త రాంసర్ ప్రదేశాలను చేర్చడంపై ప్రధాని హర్షం

प्रविष्टि तिथि: 04 JUN 2025 10:28PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని ఫలోదీ లోని ఖీజన్ఉదయ్‌పూర్‌లోని మేనార్ చిత్తడి ప్రాంతాలను ప్రతిష్ఠాత్మక రాంసర్ ప్రదేశాల్లో చేర్చారుఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భారత్ కొనసాగిస్తోన్న పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారుఈ రెండు ప్రాంతాలతో కలిపి భారత్‌లో రాంసర్ ప్రదేశాలు మొత్తం 91 ఉన్నాయి.

కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ అంశాన్ని ఎక్స్‌లో ప్రకటించారుపర్యావరణ పరిరక్షణపై ప్రధాని మోదీ అంకితభావానికి ఇది నిదర్శనమని అన్నారు.

ఈ పోస్టుకు పీఎం మోదీ స్పందన:

‘‘శుభవార్తపర్యావరణ పరిరక్షణలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందిఈ ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది’’.

 

(रिलीज़ आईडी: 2136213) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Telugu , Kannada