ప్రధాన మంత్రి కార్యాలయం
హరిత భవితను నిర్మించడంలో భారతీయ రైల్వేల పాత్రపై వచ్చిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
05 JUN 2025 11:55AM by PIB Hyderabad
హరిత భవితను నిర్మించడంలో భారతీయ రైల్వేలు ఏ విధంగా కీలక పాత్రను పోషిస్తోందీ వివరిస్తూ కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకన్నారు. విద్యుదీకరణ పనులు శరవేగంగా పూర్తి అవుతూ ఉండడం, స్వచ్ఛ ఇంధనం వైపు మరలుతూ ఉండడంతో భారతీయ రైల్వేలు నికర శూన్య ఉద్గారాల (నెట్ జీరో ఎమిషన్స్) లక్ష్యాన్ని సాధించే మార్గంలో పయనిస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి రాసిన ఒక వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ ఎక్స్‌లో ఒక సందేశాన్ని ఈ కింది విధంగా పోస్టు చేసింది:
‘‘హరిత భవితను నిర్మించడంలో భారతీయ రైల్వేలు ఏ విధంగా కీలక పాత్రను పోషిస్తోందీ రైల్వేల శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ (@AshwiniVaishnaw) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక వ్యాసం రాశారు. విద్యుదీకరణ పనులు శరవేగంగా పూర్తి అవుతూ ఉండడం, స్వచ్ఛ ఇంధనం వైపు మళ్లుతూ ఉండడంతో భారతీయ రైల్వేలు నికర శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే మార్గంలో పయనిస్తున్నాయి.’’
***
(Release ID: 2134427)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam