ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
30 MAY 2025 4:43PM by PIB Hyderabad
గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గోవా విశిష్ట సంస్కృతి భారత్‌కు గర్వకారణం. గోవా ప్రజలు వివిధ రంగాల్లో బలమైన ముద్ర వేశారు. ఎల్లవేళలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజల దృష్టిని ఈ రాష్ట్రం ఆకట్టుకుంటోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గోవా సోదరీ సోదరులకు శుభాకాంక్షలు. గోవా విశిష్ట సంస్కృతి దేశానికి గర్వకారణం. గోవా ప్రజలు వివిధ రంగాల్లో బలమైన ముద్ర వేశారు. ఎల్లవేళలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజల దృష్టిని ఈ రాష్ట్రం ఆకట్టుకుంటోంది. గత దశాబ్దంలో గోవా పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా విశేషంగా కృషిచేశాం. గోవా మున్ముందు అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.’’
(Release ID: 2132936)
Read this release in:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam