ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని దాహోద్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 26 MAY 2025 6:47PM by PIB Hyderabad

త్రివర్ణ పతాకాన్ని అందరూ సగర్వంగా ఎగరేస్తూనే ఉండండి..

భారత్ మాతా కీ జై,

భారత్ మాతా కీ జై,

భారత్ మాతా కీ జై,

భారత్ మాతా కీ జై.

 

గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్గుజరాత్ మంత్రివర్గంలోని నా సహచరులందరూపార్లమెంటు సభ్యులుశాసనసభ సభ్యులుఇతర విశిష్ట ప్రముఖులుదాహోద్ లోని నా ప్రియమైన సోదరులుసోదరీమణులారా!

అందరూ ఎలా ఉన్నారుదయచేసి బిగ్గరగా స్పందించండి-దాహోద్ ప్రభావం ఇప్పుడు పెరిగింది!

 రోజు మే 26 తేదీ. 2014లో ఇదే రోజున నేను మొదటిసారిగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానుత్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ సగర్వంగా ఎగరాలని నేను కోరుకుంటున్నాగుజరాత్ ప్రజలు నన్ను మనసారా ఆశీర్వదించారు తరువాత దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరులు నన్ను ఆశీర్వదించారుమీ ఆశీర్వాదాలతో అధికారాన్ని పొందిన నేను నా తోటి దేశప్రజలకు రేయింబవళ్ళూ సేవ చేయడానికి నన్ను నేను అంకితం చేసుకున్నాను.

కొన్నేళ్లుగా ఒకప్పుడు ఊహించలేనిఅపూర్వమైనవిగా భావించిన నిర్ణయాలను దేశం తీసుకుందిదశాబ్దాల నాటి సంకెళ్ళను ఛేదించుకొనిప్రతి రంగంలోనూ పురోగతి సాధించాంనేడు దేశం నిరాశ నుంచి బయటపడి సరికొత్త ఆత్మవిశ్వాసంఆశలతో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తోంది.

మిత్రులారా...

నేడుమనం -140 కోట్ల మంది భారతీయులంభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి సంకల్పంతో కృషి చేస్తున్నాందేశ ప్రగతికి అవసరమైనవన్నీ భారత్ లోనే ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందిమనం చేయాల్సింది ఇదేతయారీ రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందిదేశీయ వినియోగం కోసం నిత్యావసర వస్తువుల ఉత్పత్తి అయినా లేదా ప్రపంచ దేశాలకు భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడమైనా మనం నిరంతర వృద్ధిని చూస్తున్నాంనేడుభారత్ అనేక దేశాలకు స్మార్ట్ ఫోన్లుకార్ల నుంచి  బొమ్మలుసైనిక పరికరాలుఔషధాల వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందిఅంతేకాకుండాభారత్ ఇప్పుడు రైల్వేలుమెట్రో వ్యవస్థలువాటికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేస్తోంది.  వీటిని కూడా ఎగుమతి చేస్తోంది పురోగతికి దాహోద్ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

 

కొద్ది సేపటి క్రితం మేమిక్కడ వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిప్రారంభించాంవీటిలోదాహోద్ లోని ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ అత్యంత ముఖ్యమైనదిదీనికి శంకుస్థాపన చేయడానికి నేను మూడు సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చానుకొంతమంది వ్యక్తులకు విమర్శలు చేయడమే అలవాటుకేవలం ఎన్నికల లాభం కోసం మోదీ శంకుస్థాపన చేశారని దాని వల్ల ఏమీ జరగదని వారు ఎద్దేవా చేశారుఏమైంది.. మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ఇక్కడ మొదటి విద్యుత్ రైలింజన్ విజయవంతంగా తయారు చేయడాన్ని మనమందరం చూడవచ్చుకొద్దిసేపటి క్రితం దాన్ని  ప్రారంభించే గౌరవం నాకు లభించిందిఇది గుజరాత్ కు మాత్రమే కాకుండా మొత్తం దేశానికి గర్వకారణం.

రైల్వేల్లో నూరు శాతం విద్యుద్దీకరణ లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా నేడు గుజరాత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది విజయం సాధించినందుకు గుజరాత్ లోని నా సోదరులుసోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మిత్రులారా...

నన్ను మరోసారి మీ అందరి మధ్యకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడి ప్రజలకు మొదట నేను నా కృతజ్ఞతలు చెప్పాలిచాలా మంది వయో వృద్ధులను,  సుపరిచిత వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించిందిఅలాగే ఇక్కడ నాకున్న ఎన్నో విలువైన జ్ఞాపకాలను నెమరేసుకునే అవకాశం కూడా దక్కిందిదాహోద్ తో నా అనుబంధం నేను రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ప్రారంభం కాలేదుఇది దాదాపు 70 సంవత్సరాల క్రితానిదిఇక్కడ రెండుమూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది రోజు నేను 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత పరేల్ ను సందర్శించాను ప్రాంతం మొత్తం మారిపోయిందిఇంతకుముందు నేను వచ్చినప్పుడల్లాసాయంత్రం వేళకు పరేల్ కు సైకిల్ పై వెళ్ళడానికి ప్రయత్నించేవాడ్ని.  వర్షం కురిస్తేపరిసరాలు పచ్చదనంతో నిండిపోతేనేను చిన్న కొండల మీదుగా ఇరుకైన మార్గాల్లో ఆనందంగా సైకిల్ తొక్కుతానుఅలాంటి సాయంత్రాలు నాకు అపారమైన ఆనందాన్ని తెచ్చిపెట్టాయి తరువాతనేను పరేల్లోని రైల్వేలో పనిచేసే సోదరుల ఇళ్లలో భోజనం చేస్తానువారితో నాకున్న అనుబంధం చాలా దగ్గరగా ఉండేది రోజు పరేల్ వైభవాన్ని చూడటం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది.

మిత్రులారా...

మేమిక్కడ ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాంఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకున్నాంనేను ఒకప్పుడు దాహోద్ కోసం కన్న కలలు ఇప్పుడు నా కళ్ల ముందే సాకారమవుతున్నాయని గర్వంగా చెప్తున్నాభారతదేశంలో గిరిజన ప్రాబల్యం కలిగిన జిల్లాను ఎలా అభివృద్ధి చేయవచ్చో ఎవరైనా ఒక నమూనాను చూడాలనుకుంటేవారు తప్పనిసరిగా దాహోద్ ను  సందర్శించాలని నేను పూర్తి విశ్వాసంతో స్పష్టంగా  చెబుతున్నాగిరిజన జిల్లాలో స్మార్ట్ సిటీని నిర్మించాలనే ఆలోచన ఒకప్పుడు చాలా మందిని ఆశ్చర్యపరిచిందిగత కొన్ని సంవత్సరాలుగా మన రైల్వేలు ఎంత వేగంగా మారాయో మనం చూశాంరైల్వే అభివృద్ధి దిశ మారిందిదాని వేగం పెరిగిందిమెట్రో సేవలు వేగంగా విస్తరిస్తున్నాయిగతంలోసెమీ-హై-స్పీడ్ రైల్వేలు భారత్ పదజాలంలో కూడా భాగం కాలేదునేడిది వాస్తవికతగా మారుతోందిప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 70 మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయినేడు సోమనాథ్ దాదా పవిత్ర పాదాల చెంత దాహోద్ నుంచి అహ్మదాబాద్-వెరావల్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్  ప్రారంభమైందిఇంతకుముందుదాహోద్ కు చెందిన మన సోదరులు తరచు సమీపంలోని ఉజ్జయిని సందర్శించేవారుఇప్పుడు వారికి సోమనాథ్ తలుపులు కూడా తెరుచుకున్నాయి.

మిత్రులారా...

నేడు దేశమంతటా లెక్కలేనన్ని ఆధునిక రైళ్లు నడుస్తున్నాయి పరివర్తనకు ప్రధాన కారణం మన దేశ యువత -మన కొత్త తరంఇప్పుడు భారతదేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోందికోచ్ లు భారత్ లో తయారవుతున్నాయి.  ఇక్కడ రైలింజన్లు ఉత్పత్తి అవుతున్నాయిగతంలో మనం వీటన్నింటినీ విదేశాల నుంచి  దిగుమతి చేసుకోవలసి వచ్చేదిఇప్పుడుపెట్టుబడి మనదిప్రయత్నం మనదివిజయాలు కూడా మనవేరైల్వే సంబంధిత పరికరాల ఎగుమతుల్లో భారత్ ఇప్పుడు ప్రధాన ప్రపంచ ఎగుమతిదారుగా మారుతోందిమీరు ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తేవారి మెట్రో వ్యవస్థలలో ఉపయోగించే కోచ్ లు గుజరాత్ లో తయారయ్యాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారుఇంగ్లాండ్సౌదీ అరేబియాఫ్రాన్స్ లను సందర్శించండి..  దేశాలలో నడుస్తున్న అనేక ఆధునిక రైళ్ల కోచ్ లు  భారత్ లో తయారవుతున్న విషయాన్ని తెలుసుకుంటారుమెక్సికోస్పెయిన్జర్మనీఇటలీలలో వివిధ చిన్నపెద్ద రైల్వే భాగాలు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.

ఎంఎస్ఎంఈలుకుటీర పరిశ్రమలను నడుపుతున్న మన చిన్న తరహా పారిశ్రామికవేత్తలు అసాధారణ ప్రతిభ చూపుతున్నారువారు క్లిష్టమైన భాగాలను కచ్చితత్వంతో తయారు చేసి ప్రపంచ మార్కెట్ కు  ఎగుమతి చేస్తున్నారుభారతీయ ప్రయాణీకుల కోచ్ లను ఇప్పుడు మొజాంబిక్శ్రీలంక వంటి దేశాలలో ఉపయోగిస్తున్నారుభారత్ అనేక దేశాలకు మేడ్ ఇన్ ఇండియా రైలింజన్లను కూడా ఎగుమతి చేస్తోంది 'మేడ్ ఇన్ ఇండియాబ్రాండ్ విస్తరిస్తోందిఫలితంగా భారత్ సగర్వంగా ప్రపంచం ముందు తన తల ఎత్తుకోగలుగుతుంది.

దాహోద్ లోని నా సోదర సోదరీమణులారా.. ఇప్పుడు నాకు చెప్పండి-ఇప్పుడు భారత్ లో తయారైన వస్తువులు ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయిమన ఇళ్లల్లో విదేశీ తయారీ  ఉత్పత్తులు ఉండాలాగట్టిగా సమాధానం ఇవ్వండిమనకు కావాలా.. వద్దాత్రివర్ణ పతాకాన్ని ఊపుతూ  చెప్పండి.. మనం భారతీయ తయారీ వస్తువులకు మద్దతు ఇవ్వాలా వద్దామిమ్మల్ని మీరు చూసుకోండి-మీరు త్రివర్ణ పతాకం నీడలో కూర్చుని చెబుతున్నారు:  మన దేశంలో తయారైన ఉత్పత్తులను మనం ఎందుకు ఉపయోగించకూడదు?  గణేష్ చతుర్థి వచ్చినప్పుడువిదేశీ లక్షణాలుచిన్న కళ్ళు కలిగిన గణపతి విగ్రహాలను ఇంటికి తీసుకురావాలామన దేశంభారత్ లో తయారు చేసిన విగ్రహాలను ఇంటికి తీసుకురావాలాహోలీదీపావళి సమయంలోమనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బాణసంచాపిచికారీలను ఉపయోగించాలాదానికి బదులు మన  భారతీయ ఉత్పత్తులను ఎంచుకోకూడదాభారతీయులు భారతీయ ఉత్పత్తుల నుంచి సంపాదించాలా వద్దాభారత్ పురోగతి సాధించాలంటేప్రతి భారతీయుడు దీనిని వ్యక్తిగత తీర్మానంగా తీసుకోకూడదా?

మిత్రులారా...

రైల్వే రంగం బలంగా ఉంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందిఇది పరిశ్రమలువ్యవసాయంవిద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందిమన సోదరీమణులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుందిగత దశాబ్దంలోరైల్వేలు  మొదటిసారిగా అనేక ప్రాంతాలకు చేరుకున్నాయిగుజరాత్లో కూడాచిన్న రైళ్లు మాత్రమే నడిచే అనేక ప్రదేశాలు ఉండేవి.. అవి కూడా చాలా నెమ్మదిగా నడిచేవిఉదాహరణకు దభోయ్ ప్రాంతాన్ని తీసుకోండిఅక్కడ రైళ్లు ఎంత నెమ్మదిగా నడుస్తాయంటేఅది  కదులుతున్నప్పుడు మధ్యలో దిగి మళ్లీ ఎక్కవచ్చుఇటువంటి అనేక ఇరుకైన గేజ్ మార్గాలు ఇప్పుడు బ్రాడ్ గేజ్ గా మారాయిదభోయ్ లోని ఇరుకైన గేజ్ రైల్వే స్థాయి ఇప్పుడు పెరిగింది.

 రోజు ఇక్కడ అనేక రైల్వే మార్గాలు ప్రారంభమయ్యాయిదాహోద్వల్సాద్ మధ్య ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభించిందిదాహోద్ కు చెందిన నా సోదరులు గుజరాత్లోని ప్రతి మూలా ఉన్నారురాష్ట్రంలోని ఏదైనా చిన్న పట్టణానికి వెళ్ళండి.. అప్పుడు మీకు దాహోద్ కు చెందిన వాళ్ళు ఎవరైనా కచ్చితంగా కనిపిస్తారు.  ఇప్పుడు  కొత్త రైల్వే నెట్వర్క్ తో  దాహోద్ త్వరలో 100 కిలోమీటర్ల నెట్వర్క్ ద్వారా అనుసంధానితమవుతుంది అభివృద్ధి తాలూకు లబ్ధిదారులు మన గిరిజన పిల్లలే  అవుతారు.

మిత్రులారా...

ఒక కర్మాగారాన్ని ఎక్కడ నెలకొల్పినాదాని చుట్టూ మొత్తం పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుందివిడి భాగాలను ఉత్పత్తి చేయడానికి చిన్న కర్మాగారాలు పుట్టుకొస్తాయిఇవి క్రమంగా ఉపాధిని సృష్టిస్తాయిమన యువతకు తగినంత ఉపాధి అవకాశాలు లభించేలా నేను కృషి చేస్తున్నాదాహోద్ లోని రైలు కర్మాగారం ప్రపంచంలోని ప్రధాన తయారీ యూనిట్లలో ఒకటిగా మారుతుందిఇది దేశానికి ఒక మైలురాయిలా నిలుస్తుందిమిత్రులారాఇది సాధారణ కర్మాగారం కాదునేను మీకు గుర్తు చేస్తున్నా ఇంతకుముందు అక్కడ ఉన్నవన్నీ దాదాపు అదృశ్యమయ్యాయి ప్రదేశాన్ని విడిచిపెట్టేశారుదాహోద్  పరేల్ నా కళ్ళ ముందు ఎండిపోవడాన్ని చూశానుఇప్పుడుఅది మళ్లీ సజీవంగా కళకళలాడుతూ ఉండటం చూస్తున్నాను -అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది పరివర్తన మీ ప్రేమఆశీర్వాదాల వల్ల వచ్చిందే రోజు భారత్ కు చెందిన 9,000 హార్స్పవర్ రైలింజను ఎక్కడ తయారైందని ఎవరైనా అడిగితేసమాధానం దాహోద్ అని చెబుతారుఇక్కడ తయారవుతున్న రైలింజన్లు సగర్వంగా మేడ్ ఇన్ ఇండియా ను ప్రతిబింబిస్తాయిఇవి మన రైల్వేల బలంసామర్థ్యాన్ని పెంచడమే కాకుండాఇక్కడ తయారు చేసిన టైర్లు ప్రపంచవ్యాప్తంగా కీర్తిని పొందుతాయిదాహోద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మోగుతుందిరాబోయే సంవత్సరాల్లోవందలాది రైలింజన్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయిఅతి త్వరలోప్రతి రెండు రోజులకో  కొత్త లోకోమోటివ్ బయటకొచ్చే సమయం వస్తుంది విజయం స్థాయిని ఊహించుకోండి -ప్రతి రెండు రోజులకు ఒక లోకోమోటివ్ఇంత పెద్ద తయారీ మన స్థానిక సోదరులుసోదరీమణులకుయువతకు విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాలలో విడిభాగాల తయారీ యూనిట్లుచిన్న తరహా పరిశ్రమలు విస్తృత స్థాయిలో వృద్ధి చెందడానికి కూడా దారి తీస్తుంది.

ఫ్యాక్టరీలో నేరుగా ఉపాధి లభించినప్పటికీ అనుబంధ పరిశ్రమలు లెక్కలేనన్ని కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయిమన రైతు సోదరులుసోదరీమణులుమన పశువుల పెంపకందారులుచిన్న దుకాణదారులుకార్మికులు -పురుషులు లేదా మహిళలు-సమాజంలోని ప్రతి విభాగం  అభివృద్ధి నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారు.

మిత్రులారా,

విద్యఇన్ఫర్మేషన్ టెక్నాలజీసెమీకండక్టర్లుపర్యాటకం వంటి రంగాలలో గుజరాత్ నేడు గణనీయమైన పురోగతిని సాధించిందిరంగమేదైనా కావొచ్చు.. గుజరాత్ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగరడం చూస్తారువేల కోట్ల విలువైన పెట్టుబడులు గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి దారితీస్తున్నాయి ప్రయత్నాల ఫలితంగారాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

మిత్రులారా...

వడోదరలో వివిధ చిన్నపెద్ద ప్రాజెక్టులు జరుగుతున్న కాలమదిపంచమహల్ జిల్లాను విభజించిదాహోద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన రోజు నాకు గుర్తుంది నిర్ణయం పంచమహల్దాహోద్ రెండింటి స్వతంత్ర అభివృద్ధికి దారితీస్తుందని నా మనస్సులో స్పష్టంగా ఉండేది రోజునేను నా కళ్ళ ముందు  అభివృద్ధిని చూసినప్పుడు భూమికి నేను రుణం తీర్చుకోవడంలో నాకు కలిగే ఆనందం అపారమైనదిమిత్రులారాఈరోజు నాకు చాలా సంతృప్తిగా ఉందినేను మీ ఉప్పు తిన్నానేను మీ కోసం ఎంత చేసినా అది తక్కువేచుట్టుపక్కల చూడండి- రోజుచిన్న తరహా పరిశ్రమలు  సాధారణ స్థాయిలో కాదు అత్యంత అధునాతనహైటెక్ ఉత్పత్తులను అందిస్తున్నాయి మొత్తం వృద్ధి నా గిరిజన సోదరులుసోదరీమణుల వల్ల జరిగిందే.

మీరు వడోదర నుంచి దాహోద్ వరకు అలాగే మధ్యప్రదేశ్ వరకు ప్రయాణిస్తేవడోదరలో విమానాల తయారీ ఇప్పుడు వేగంగా పురోగమిస్తున్న విషయాన్ని మీరు గమనిస్తారుకొన్ని నెలల క్రితమే అక్కడ ఎయిర్బస్ అసెంబ్లీ లైన్ ప్రారంభమైందిదేశంలోని మొట్టమొదటి గతి శక్తి విశ్వవిద్యాలయం కూడా వడోదరలో ఏర్పాటైందివిదేశీ పెట్టుబడులతో నడిచే రైల్వే కోచ్ లుకార్ల తయారీకి సావ్లీలో ఒక ప్రధాన కర్మాగారం ఏర్పాటైందినేడు ఇది అంతర్జాతీయ స్థాయికి  చేరుకుంటోందిదేశంలోని అత్యంత శక్తిమంతమైన రైలు ఇంజిన్ -9,000 హార్స్పవర్ రైలింజనుఇక్కడే దాహోద్ లో తయారు అవుతోందిగోద్రాకలోల్హాలోల్ లోని అనేక పరిశ్రమలుతయారీ యూనిట్లు పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉద్భవిస్తున్నాయిగుజరాత్ అంతటా పురోగతి అలలు ఎగసిపడుతున్నాయి.

మిత్రులారా...

సైకిళ్ళుమోటార్ సైకిళ్ల నుంచి రైల్వే ఇంజిన్లువిమానాల వరకు ప్రతీదీ గుజరాత్ తయారు చేసే రోజు కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాఇవన్నీ గుజరాత్ యువత గుజరాత్ నేలపై తయారుచేస్తారుఇటువంటి హైటెక్ ఇంజినీరింగ్తయారీ కారిడార్ ప్రపంచంలో అరుదైన దృగ్విషయంవడోదర నుంచి దాహోద్హలోల్కలోల్,  గోద్రా వరకు అసాధారణ పారిశ్రామిక నెట్వర్క్ ఏర్పాటు అవుతోంది.

మిత్రులారా...

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించడానికిగిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా అంతే కీలకంనేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడురాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలోని నా గిరిజన సోదరులుసోదరీమణులకు సేవ చేసే అవకాశం నాకు లభించిందివారి సంక్షేమానికి నన్ను పూర్తిగా అంకితం చేసుకున్నానుతరువాతకేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడునేను  ప్రయత్నాలను కొనసాగించానుగత పదకొండు సంవత్సరాలుగాగిరిజన వర్గాల అపూర్వ అభివృద్ధికి నన్ను నేను అంకితం చేసుకున్నాగుజరాత్లోని గిరిజన ప్రాంతాలలో సుదీర్ఘకాలం-దాదాపు ఏడు దశాబ్దాలుగా విస్తృతంగా పనిచేసే అవకాశం నాకు లభించింది.  గిరిజన సోదరులుసోదరీమణులు పంచుకున్న లెక్కలేనన్ని అనుభవాలను నేను విన్నాఒకప్పుడు ఉమర్గాం నుంచి అంబాజీ వరకు మొత్తం గిరిజన ప్రాంతంలో 12 తరగతికి ఒక్క సైన్స్ పాఠశాల కూడా ఉండేది కాదుఇలాంటి సందర్భాలను నేను చూశానుకానీ నేడుఅదే ప్రాంతంలో-ఉమర్గామ్ నుంచి  అంబాజీ వరకు-అనేక కళాశాలలుఐటీఐలువైద్య కళాశాలలురెండు గిరిజన విశ్వవిద్యాలయాలు కూడా గిరిజన ప్రాంతాలలో చురుకుగా పనిచేస్తున్నాయిగత పదకొండు సంవత్సరాలలోఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నెట్వర్క్ కూడా గణనీయంగా విస్తరించిందిదాహోద్ లో కూడా ఇటువంటి అనేక పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

మిత్రులారా...

నేడుగిరిజన వర్గాల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విస్తృతమైనకేంద్రీకృత ప్రయత్నాలు జరుగుతున్నాయిస్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గిరిజన గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనేక కొత్త పథకాలు ప్రారంభమయ్యాయిగిరిజన గ్రామ అభివృద్ధి కోసం బిర్సా ముండా ధర్తి ఆబా గా వ్యవహరించే 'ధర్తి ఆబాకార్యక్రమాన్ని  ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన విషయాన్ని  మీరు గమనించవచ్చు.

 పేరుతో మేం  జనజాతి గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ను  ప్రారంభించాందీని ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది కార్యక్రమం గుజరాత్  తో సహా దేశవ్యాప్తంగా 60,000 కి పైగా గ్రామాలలో అభివృద్ధి పనులకు తోడ్పడుతోందినా గిరిజన సోదరులుసోదరీమణులకు అత్యంత ఆధునిక సౌకర్యాలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి -అది విద్యుత్ అయినాస్వచ్ఛమైన తాగునీరు అయినారోడ్లు అయినాపాఠశాలలు అయినా లేదా ఆసుపత్రులు అయినాఘనమైనకాంక్రీటు గృహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్మితమవుతున్నాయి.

మిత్రులారా...

ప్రపంచం తరచుగా నిర్లక్ష్యం చేసే వారిని మోదీ గౌరవిస్తారుగిరిజన జనాభాలో అనేక సంఘాలు చాలా కాలంగా వెనుకబడి ఉన్నాయి-కానీ వాటిని మేం విస్మరించలేదువారి కోసం ప్రభుత్వం పీఎం జన్మాన్ యోజనను ప్రవేశపెట్టింది పథకం కిందఅత్యంత అణగారిన గిరిజన కుటుంబాలకు గృహనిర్మాణంవిద్యఉపాధి అవకాశాలు వంటి అవసరమైన సేవలను అందించడానికి మేము కృషి చేస్తున్నాం.

సోదర సోదరీమణులారా..

రక్తహీనత వ్యాధి వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి గుజరాత్లో మనకు చాలా కాలంగా తెలుసునేను గుజరాత్లో ఉన్నప్పటి నుంచి  అనారోగ్యాన్ని ఎదుర్కోవటానికి కృషి చేస్తున్నా రోజు మనం దీన్ని దేశవ్యాప్త స్థాయిలో పరిష్కరిస్తున్నాంరక్తహీనత వ్యాధి కబంధ హస్తాల నుంచి నా గిరిజన సోదరులుసోదరీమణులను విడిపించడానికి  మిషన్ మోడ్లో పని చేస్తున్నాం మిషన్లో భాగంగా ప్రస్తుతం లక్షలాది మంది గిరిజనులను పరీక్షిస్తున్నారు.

చారిత్రాత్మకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందిదురదృష్టవశాత్తుదేశంలోని 100 అత్యంత వెనుకబడిన జిల్లాలను గతంలో వారి తలరాతకే విడిచిపెట్టారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు-సమర్థులైన అధికారులు ఎవరూ అక్కడ పనిచేయడానికి ఇష్టపడలేదుపాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో లేరుఇళ్లు లేవురోడ్లు లేవు పరిస్థితి ఇప్పుడు మారిపోయిందిబాధిత ప్రాంతాల్లో అనేక గిరిజన జిల్లాలు ఉన్నాయిఒకప్పుడు దాహోద్ జిల్లాను కూడా వాటిలో లెక్కించేవారుకానీ ఇప్పుడు స్మార్ట్ సిటీ చొరవలో భాగంగా దాహోద్ జిల్లాదాహోద్ నగరం మారుతున్నాయిదాహోద్ భవిష్యత్తు దృష్టితో ముందుకు సాగుతోందిఇది ఆశాజనక జిల్లాల విభాగంలో కూడా గుర్తింపును సంపాదించిందిదాహోద్ నగరం పునరుజ్జీవితమవుతోందిఇక్కడ ఆధునిక స్మార్ట్ సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయి.

మిత్రులారా...

దాహోద్ తో సహా దక్షిణ గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తరతరాలుగా కొనసాగుతూనే ఉందినేడునీటి సరఫరా కోసం వందల కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు వేయడానికి విస్తృతమైన పని జరుగుతోందిప్రతి ఇంటికి నర్మదా నీరు చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయిగత ఏడాదిలోనే ఉమర్గాం నుంచి అంబాజీ వరకు 11 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించగలిగాంఇది మన రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చిందితద్వారా వారు సంవత్సరానికి మూడు పంటలను పండించడానికి వీలు కల్పించింది.

సోదర సోదరీమణులారా..

ఇక్కడికి రాకముందు నేను వడోదరలో ఉన్నానుఅక్కడ వేలాది మంది తల్లులుసోదరీమణులతో సమావేశమయ్యామన సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వారంతా కలిసి వచ్చారువారు   గౌరవాన్ని నాకు కల్పించారుతల్లి బలం యొక్క గొప్పతనానికి నేను గౌరవంగా నమస్కరిస్తున్నాఇక్కడ దాహోద్ లో కూడామీరంతా -మా తల్లులుసోదరీమణులుమీ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఆపరేషన్ సిందూర్  కోసం మీ ఆశీర్వాదాలను అందించారు దాహోద్ భూమి తపస్సుత్యాగనిరతి గల భూమిదుధిమతి నది ఒడ్డున మహర్షి దధిచి విశ్వ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగం చేసినట్లు చెబుతారు.

 నేల ఒకప్పుడు విప్లవకారుడు తాత్యా తోపేకు అవసరమైన సమయంలో మద్దతుగా నిలిచిందిఇక్కడ నుంచి చాలా దూరంలో మంగర్ ధామ్ ఉంది -గోవింద్ గురు నేతృత్వంలోని వందలాది మంది గిరిజన యోధుల శౌర్యంత్యాగాన్ని సూచించే పవిత్ర ప్రదేశమదిఅందువల్ల ప్రాంతంభారత మాతమానవత్వ సేవలో మన నిస్వార్థ త్యాగ  పురాతన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందినాకు చెప్పండి... అటువంటి విలువలు భారతీయుల హృదయాల్లో ఉన్నప్పుడుజమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన పనికి భారత్ మౌనంగా ఉండగలదామోదీ మౌనంగా ఉండగలడా?

ఎవరైనా మన సోదరీమణుల నుదిటి  సింధూరాన్ని (వెర్మిలియన్తుడిచివేయడానికి ధైర్యం చేసినప్పుడువారి సొంత వినాశనం అనివార్యం అవుతుందిఅందువల్లఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య కాదు-ఇది భారతీయ విలువలు,  భావోద్వేగాల ప్రతిబింబంమోదీని  ఎదుర్కోవడం ఎంత భయంకరంగా ఉంటుందో ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేకపోయారుత్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఉండండిఅది  గౌరవాన్ని సూచిస్తుందో ఆలోచించండిఒక తండ్రిని తన పిల్లల ముందు కాల్చి చంపేశారు-నేటికీ నేను  చిత్రాలను చూసినప్పుడునా రక్తం మరిగిపోతుందిఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారుమీరందరూ నాకు అప్పగించిన పదవితో ఒక ప్రధాన సేవకుడిగా నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చానునేను మన మూడు సాయుధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చామన సైనికుల ధైర్యాన్ని అనేక దశాబ్దాలుగా ప్రపంచం చూడలేదుసరిహద్దు వెంబడి పనిచేస్తున్న తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలను మేము గుర్తించాంవాటి కచ్చితమైన స్థానాలను ధ్రువీకరించాం.  6 తేదీ రాత్రికేవలం 22 నిమిషాల్లో 22 తేదీనాటి దుర్మార్గాలకు ప్రతీకారంగా వారందరినీ నిర్మూలించాం.

భారత్ ప్రతిస్పందనతో ఉలిక్కిపడిన పాకిస్తాన్ సైన్యంనిరాశతో దాడికి ప్రయత్నించినప్పుడుమన దళాలు వారిని కూడా ఓడించాయిమన రిటైర్డ్ సైనిక సిబ్బంది చాలా మంది ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని నాకు సమాచారం అందిందినేను వారికి కూడా ప్రణమిల్లుతున్నా పవిత్రమైన దాహోద్ భూమి నుంచి  మన దేశ సాయుధ దళాల శౌర్యానికి నేను మరోసారి నివాళులర్పిస్తున్నా.

మిత్రులారా...

విభజన తరువాత ఉద్భవించిన  దేశానికి ఒకే ఒక లక్ష్యం ఉంది... భారతదేశం పట్ల శత్రుత్వంభారతదేశం పట్ల ద్వేషంభారతదేశానికి హాని కలిగించాలనే అవిశ్రాంత కోరికమరోవైపుపేదరికాన్ని నిర్మూలించడందాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంఅభివృద్ధి చెందిన దేశంగా స్థిరపడటం భారతదేశం లక్ష్యంమన సాయుధ దళాలు బలంగా ఉన్నప్పుడుమన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన భారత్ సాకారం అవుతుంది దిశగా నిరంతరం దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నాం.

మిత్రులారా...

దాహోద్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందినేటి కార్యక్రమం భవిష్యత్తుకి  ఒక సంగ్రహావలోకనం మాత్రమేకష్టపడి పనిచేసే నా స్నేహితులందరిపై దేశ ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉంది కొత్త సౌకర్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనిదాహోద్ ను  దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలలో ఒకటిగా మార్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను నమ్మకంతోనేను మరోసారి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నానుఇప్పుడుఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ప్రతి ఒక్కరూ లేచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నేను ఆహ్వానిస్తున్నానుమనమందరం కలిసి నిలబడిత్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినేను అన్నట్లు అనండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

'భారత్ మాతా కీ జైఅన్న నినాదం బిగ్గరగా ప్రతిధ్వనిస్తూనే ఉండాలి.

 

***


(Release ID: 2132432)