ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మే 23న న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని


* దృష్టి సారించే రంగాలు: పర్యాటకం, ఆగ్రో-ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మౌలిక వసతులు, ఇంధనం, వినోదం, క్రీడలు

* అవకాశాల నిలయంగా ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ప్రదర్శించి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం

Posted On: 22 MAY 2025 4:13PM by PIB Hyderabad

రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 23న ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అవకాశాల నిలయంగా ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం, కీలకమైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం.  

రెండు రోజుల (మే 23, 24 తేదీలు) పాటు ఈ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సు సన్నాహక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వరుస రోడ్ షోలు, కేంద్ర సహకారంతో ఈశాన్య రాష్ట్రాలు నిర్వహించిన రాయబారుల సమావేశాలు, ద్వైపాక్షిక ఛాంబర్ల సమావేశాలు, రాష్ట్రాల రౌండ్ టేబుల్ సమావేశాలు ముగుస్తాయి. సదస్సులో భాగంగా మంత్రిత్వ స్థాయి సమావేశాలు, బిజినెస్-టు-గవర్నమెంట్ సెషన్లు, బిజినెస్-టు-బిజినెస్ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే అంకుర సంస్థలు, పెట్టుబడుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుసరిస్తున్న విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి.  

పర్యాటకం, ఆతిథ్యం, ఆగ్రో-ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత రంగాలు, టెక్సటైల్స్, చేనేత, హస్తకళాకృతులు, ఆరోగ్య రంగం, విద్య-నైపుణ్యాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలు, మౌలికవసతులు, సరకు రవాణా, ఇంధనం, వినోదం, క్రీడలు తదిరత రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.

 

***


(Release ID: 2130621)